కరీంనగర్ జిల్లా గ్రామ నామాలు
స్థలనామ విజ్ఞానం (టోపోనమి) అనే శాస్త్రానికి సంబంధించి పాశ్చాత్య దేశాల్లో గ్రామ నామాల పరిశోధన ప్రారంభమై వందేళ్ళకు పైనే అయిందనవచ్చు. భాష పుట్టిన తర్వాతనే పేర్లు పుట్టుకొచ్చాయి. గ్రామాల పేర్లు కూడా అంతే. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామాలకు ఆయా పేర్లు ఎలా వచ్చాయో అనడానికి చాలా చరిత్రే ఉంది. జనాలు గుంపుగా ఒకచోట స్థిరనివాసం ఏర్పరచుకున్నాక అక్కడ భౌగోళిక, చారిత్రక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని వందల ఏళ్ళ క్రితమే ఊర్ల పేర్లు వచ్చాయని చరిత్ర …