పర్యావరణ హిత పరమైన కథలు


ప్రక•తి అంతా పచ్చగా ఉండాలి. పక్షుల కిల కిల రావాలతో, పంట పొలాలతో, పాడి పంటలతో కళ కళ లాడాలి. అప్పుడే ప్రక•తి అందంగా ఉంటుంది. అదే పర్యావరణం అవుతుంది. ప్రక•తికి మరో పేరు గా నిలుస్తుంది.
అంత గొప్ప పర్యావరణం నేడు ఆపదకు లోనవుతోంది. అనారోగ్యాలకు చిరునామాగా మారుతోంది. దీనికి కారణం ఎవరు?.. సరిగ్గా గమనిస్తే పర్యావ‘‘రణం’’లోనే ‘‘రణం’’ ఉంది. ప్రక•తికి అనుగుణంగా నడుచుకోక పోతే… ‘‘రణా’’నికి కారణం అవుతుంది.


దీనిని కాపాడవలసిన బాధ్యత.. విచక్షణా జ్ఞానం కలిగిన మానవుని పై ఉంది. రోగం వచ్చిన తర్వాత మందు వాడటం కన్నా… రోగమే రాకుండా నివారణ చర్యలు తీసుకోవడం చాలా ఉత్తమం.
అటువంటి పర్యావరణం పై అవగాహనను, తీసుకోవలసిన భద్రతను, చేపట్టవలసిన బాధ్యతను.. బాల చెలిమి.. పిల్లల వికాస పత్రిక వారు తీసుకున్నారు. పిల్లల్లో.. ప్రక•తి పట్ల ప్రేమను, పర్యావరణంపై అవగాహనను కలిగించే పక్రియను చేపట్టారు.


నేటి బాలలే.. రేపటి పౌరులు అన్న చందాలో… పిల్లలకు .. పెద్దలకు అవసరమైన పర్యావరణ అవగాహనను కల్పించడానికి, కథా పక్రియను తీసుకున్నారు. పెద్దల చేత.. పిల్లల కోసం.. అటు పెద్దవారి కోసం.. పర్యావరణ హిత పరమైన కథలను చక్కని పుస్తక రూపంలో ‘‘పర్యావరణ కథల పోటీలు.. 2023’’ పేరుతో తీసుకు వచ్చారు. ఈ పుస్తకంలో ఉన్న నలభై ఏడు కథలూ… పర్యావరణ హితాన్ని కోరేవే. పర్యావరణాన్ని కాపాడుకోక పోతే జరిగే పరిణామాలను వివరించేవే. అన్ని కథల మూలం.. కథా వస్తువూ .. పర్యావరణమే అయినా.. ఏ రెండు కథలూ ఒకేలా అనిపించవు. కనిపించవు. అది ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత. రచయితలు, రచయిత్రులు రాసిన మంచి కథలకు పెద్దపీట వేశారు. ఒక దండలా గుది గుచ్చి ప్రచురించారు. చక్కని బొమ్మలతో పుస్తకాన్ని ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు.


భూమి డాక్టర్‍, అసలైన దైవ కార్యం, అమ్మమాట మొదలుకుని, కొత్తమార్పు, ఆకుపచ్చ వనం వరకూ ఉన్న నలభై ఏడు కథలూ దేనికవే సాటి అన్నట్టుగా ఉంటాయి. పర్యావరణ హితమును, అవసరాన్ని చాటి చెబుతాయి.


ఇంత గొప్ప బ•హత్‍ కార్యానికి… బాధ్యతగా వహించిన… బాల చెలిమి ఎడిటర్‍ శ్రీ మణికొండ వేదకుమార్‍ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము.
మరియు పుస్తక రూపంలో రావడానికి క•షి చేసిన శ్రీ గరిపల్లి అశోక్‍ గారికి మరియు కథల ఎంపికలో పాల్గొన్న న్యాయ నిర్ణేతలకు.. ప్రతీ ఒక్కరికీ పేరు పేరు నా హ•దయ పూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలుపుతున్నాము.


ఇంత గొప్ప పుస్తకంలో నా కథ కూడా చోటు చేసుకోవడం గర్వంగా భావిస్తున్నాను. అందరికీ మరొక్కసారి ధన్యవాదములతో…

  • కె.వి.లక్ష్మణరావు
    ఎ : 901465904

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *