నిబద్దతకు నిలువుటద్దం – దక్కన్‍ల్యాండ్‍

దక్కన్‍ల్యాండ్‍ మాసపత్రిక అంటే నిబద్దతకు, వాస్తవికతకు నిలువుటద్దం. చరిత్రను, వర్తమానాన్ని నిశ్శబ్ధంగా రికార్డు చేస్తున్న సామాజిక, రాజకీయ పత్రిక. విజయవంతంగా పదకొండేళ్లు పూర్తిచేసుకుని పన్నెండవ ఏట ప్రవేశిస్తున్న సందర్భంగా దక్కన్‍ల్యాండ్‍ యాజమాన్యానికి, సంపాదకులు మణికొండ వేదకుమార్‍ గారికి హృదయపూర్వక అభినందనలు.


అనివార్యంగా డిజిటల్‍ యుగంలోకి ప్రవేశించిన మనం పత్రికను నిరంతరాయంగా పదకొండేళ్లు పూర్తి చేసుకొని విజయవంతంగా పన్నెండో ఏట ప్రవేశించడం ఒక గొప్ప విజయం. దక్కన్‍ ల్యాండ్‍ ఏ సంచికకు ఆ సంచిక ప్రత్యేకమైనదే. వర్తమాన రాజకీయ పోకడలు, పర్యావరణం, మన చరిత్ర, మన సంస్క•తి వంటి అనేక అంశాలను అక్షరబద్ధం చేయడంలో కఠోర నియమాలు విధించుకున్నదని దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు తెలుసు. మనం మరిచిపోయిన అనేక విషయాలతో పాటు ఈ ప్రాంత అనేక విషయాలపట్ల పరిశోధనలు చేసి చక్కటి వ్యాసాలతో, విశేషాలతో భావితరాలకు పనికొచ్చే విధంగా నిబద్ధతతో తీర్చిదిద్దడంలో దక్కన్‍ ల్యాండ్‍ పత్రిక విజయవంతమైందనే చెప్పాలి.


ఏ విషయం మీద రాసిన వ్యాసమైన నిజాయితితో, అతిశయోక్తలు లేకుండా విశ్లేషణాత్మకంగా, ఆలోచనాత్మకంగా ఉండటం ఒక ప్రత్యేకత తెలంగాణలో ఇంత రెగ్యులర్‍గా వస్తున్న మాసపత్రికలు లేవనే చెప్పాలి. ఈ నాటి యువతకు, విద్యార్థులకు వర్తమాన సామాజిక, రాజకీయ అంశాలపట్ల అవగాహన కలిగించడంలో దక్కన్‍ ల్యాండ్‍ పాత్ర ఎంతో ఉంది.


కొంత కాలం సాహిత్య అంశాలను స్ప•శించినా, చరిత్ర, సామాజిక, రాజకీయ అంశాలకు పరిమితమై పోయింది. వర్తమాన కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ రంగాలలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు అక్షరబద్ధం చేయడం నాకు ఎంతో నచ్చిన అంశం. బుద్ధి జీవులందరికీ అభిమానమైన పత్రికగా కొనసాగడం నచ్చింది. పత్రికలకు కొన్ని ఉద్దేశాలుంటాయి. తమ తమ ఉద్దేశాలను పాఠకుల మీద ప్రభావం చూపే ప్రయత్నమూ చేస్తాయి. కాని ఉన్నదున్నట్లు జరిగిందీ, జరుగుతున్నది ఒక చారిత్రక ప్రయాణంలా ఎప్పటికప్పుడు పొందుపరచడం కష్టమైన పనే. నిజాయితీగా, నిబద్ధతతో, ఉన్నత విలువలతో దక్కన్‍ ల్యాండ్‍ పత్రికా రంగంలో ప్రత్యేకతను నిలుపుకుంటున్నందుకు మరోసారి అభినందిస్తూ…


‘పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు’ అన్న నార్ల మాటను గుర్తు చేసుకుంటూ ఒక నాడు గొలకొండ పత్రిక ఆత్మ గౌరవాన్ని నిలబెడితే ఇవ్వాల దక్కన్‍ ల్యాండ్‍ పత్రిక వేదకుమార్‍గారి నేతృత్వంలో తెలంగాణ మట్టి పరిమళాన్ని మూటగట్టి భావితరాలకు అందిస్తున్నందుకు అభినందిస్తూ…


-కోట్ల వెంకటేశ్వరరెడ్డి
ఎ : 944023326

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *