పక్షులు… రైతు నేస్తాలు!


మానవ కార్యకలాపాలు పక్షుల పాలిట పెను శాపంగా మారుతున్నాయి. అడవుల తరుగుదల, ఆవాసాల నష్టం వల్ల దేశీయంగా ఎన్నో జాతుల పక్షులు మనుగడ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. భారత్‍కు మాత్రమే ప్రత్యేకమైన కొన్ని జాతుల పక్షులు ఇప్పటికే అంతర్థానమయ్యాయి.
అభివ•ద్ధి పేరిట సాగుతున్న కార్యకలాపాలు ఎన్నో రకాల పక్షుల ఉనికిని ప్రశ్నార్ధకంగా మారుస్తు న్నాయి. పదమూడు వందలకు పైగా పక్షిజాతులకు భారత్‍ నెలవు. ప్రపంచ పక్షి జాతుల్లో ఇవి 12.4శాతం. వీటిలో 78 జాతుల పక్షులు (అయిదు శాతం) కేవలం భారత్లోనే కనిపిస్తాయని, ఇతర దేశాల్లో వాటి ఉనికి ఉండదని ఇటీవల జులాజి కల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా (జెర్‍ఎస్‍ఎస్‍ఐ) అధ్యయనం వెల్లడించింది. ఈ 78 జాతుల్లో మూడింటి జాడను కొన్ని దశాబ్దాలుగా భారత్‍ లో గుర్తించలేదని నిపుణులు చెబుతున్నారు. అవి-మణిపురి బుష్‍ క్వెయిల్‍, హిమాలయన్‍ క్వెయిల్‍, జర్డన్‍ కర్సర్లు. అంతర్జాతీయ ప్రక•తి పరిరక్షణ సంస్థ (ఐయూసీఎన్‍) చాలా ఏళ్ల క్రితమే వాటిని మనుగడ ఎదుర్కొంటున్న జాబితాలో చేర్చింది.


ఐయూసీఎన్‍ జాబితా ప్రకారం భారత్లో 73 ప్రాణిజాతులు తీవ్ర మనుగడ ముప్పును ఎదుర్కొంటున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతా వరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిరుడు రాజ్యసభలో వెల్లడించింది. వాటిలో తొమ్మిది క్షీరద, 18 పక్షి, 26 సరీస•ప, 20 ఉభయచర జాతులు ఉన్నాయి. అంత రించే ప్రమాదంలో ఉన్న పక్షుల్లో గ్రేట్‍ ఇండియన్‍ బస్టర్డ్ (బట్టమేక పక్షి), తదితరాలతో పాటు నాలుగు అడవి గుడ్లగూబ రాబందు ఖ్యలో ఉన్న రాబందులు ప్రస్తుతం కనిపించడమే అరుదుగా మారింది. డైక్లోఫినాక్‍ ఔషధం వినియోగ పశువులు మరణించినప్పుడు, వాటిని తిన్న రాబందులు మ•త్యువాత పడుతున్నాయి. ఆంధప్రదేశ్‍లోని రోళ్లపాడు, మహారాష్ట్రలోని మరో పక్షుల అభయారణ్యాల్లో బట్టమేక పక్షి సంరక్షణకు చర్యలు తీసుకుంటు ఉన్నారు. విపరీతమైన పట్టణీకరణలో భాగంగా చెరువులు, కుంటలు, పచ్చదనం కనుమరుగవుతున్నాయి. ఫలితంగా అక్కడి జీవ వైవిధ్యం దెబ్బతిని పక్షులపైనా ఆ ప్రభావం పడుతోంది. ఈబర్డ్ డాట్‍ ఆర్గ్ అనే వెబ్‍సైట్‍ గతంలో ముంబైలో 52 పక్షుల ఆవాసాలను గుర్తించింది. నానాటికీ తీవ్రమవుతున్న నగరీకరణ మూలంగా వాటిలో చాలావరకు ప్రస్తుతం కనుమరుగయ్యాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో దిల్లీ లాంటి మరెన్నో ప్రదేశాల్లో పక్షిజాతుల మనుగడకు తీవ్ర ముప్పు తప్పదని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షులు చెట్లను ఆశించే కీటకాలు, గింజలు, పండ్లు తదితరాలను తింటాయి. దేశీయంగా అటవీ నిర్మూలన వల్ల పక్షులకు ఆహార లభ్యత తగ్గి క్రమంగా వాటి సంఖ్య తరిగిపోతుంది. చెట్లు తగ్గిపోయినప్పుడు ఆయా పక్షులు వాటి వైరిజాతులకు సులభంగా కనిపించి, వాటికి ఆహారంగా మారే అవకాశం ఉంది. జీవ వైవిధ్యానికి నెలవైన పశ్చిమ హిమాలయ అరణ్యాల్లో భూ వినియోగంలో మార్పుల వల్ల కీటకాలను తినే పక్షుల సంఖ్య భారీగా తరుగుపడినట్లు రెండేళ్ల క్రితం ఒక అధ్యయనం వెల్లడించింది.


సెల్‍ఫోన్‍ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‍ వల్లా పక్షుల పునరుత్పత్తిపై ప్రభావం పడుతున్నట్లు గతంలో పలు పరిశీలనలు వెల్లడిం చాయి. ఆ రేడియేషన్‍ను తట్టుకోలేక గతంలో పిచ్చుకల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. సెల్‍ టవర్ల విద్యుదయ స్కాంత క్షేత్రం వల్ల పక్షులు దిక్కుతోచని స్థితికి చేరి అన్ని దిశల్లో ఎగురుతాయి. ఈ క్రమంలో అవి తమ గమ్య స్థానాలను గుర్తించడంలో గందర గోళానికి గురవుతున్నాయి. అందుకే ఛత్తీస్‍గఢ్‍ రాష్ట్రం గరియాబంద్‍ జిల్లా లోని లాచ్‍కెరా గ్రామం ప్రజలు తమ ప్రాంతంలో సెల్‍ టవర్ల ఏర్పాటును నిషేధించారు. వాటివల్ల తమ ప్రాంతానికి ఏటా వలస వచ్చే ఆసియా ఓపెన్‍బిల్‍ స్టార్క్ అనే పక్షులకు ఆటంకం కలు గుతుందని భావించి ఆ నిర్ణయం తీసుకున్నారు. వాటిని ఇబ్బందులకు గురిచేసే వారికి వెయ్యి రూపాయల జరిమానా సైతం విధిస్తున్నారు. మరోవైపు వాతావరణ మార్పుల కారణంగా భారత్‍కు ఏటా వలస వచ్చే పక్షుల సంఖ్యా తగ్గిపోతోంది. పంటలను ఆశించే కీటకాలను భక్షించి రైతులకు పక్షులు మేలు చేస్తాయి. గింజలను సుదూర ప్రాంతాల్లో జారవిడిచి అడవుల పెరుగుదలకు అవి తోడ్పడతాయి. పువ్వులు పండ్లుగా మారడానికి అవసరమైన పరాగ సంపర్కంలోనూ వాటి పాత్ర ఉంది. అందుకే, మన అభివ•ద్ధి కార్యకలాపాలు పక్షుల ఉనికిని దెబ్బతీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

  • ఎం.వి.బాబు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *