Day: September 1, 2024

కొలనుకొండే గొలనుకొండ

యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గ్రామం గొలనుకొండ. హైదరాబాద్‍-వరంగల్‍ జాతీయ రహదారిమీద 70కి.మీ.ల దూరంలో వున్న ఆలేరుకు, 16కి.మీ.ల దూరంలో వుంటుంది గొలనుకొండ. హైదరాబాదుకు 86కి.మీ.ల దూరం. ప్రసిద్ధ రామాలయం, లేడిబండలున్న జీడికల్‍ సమీప గ్రామం గొలనుకొండ. గొలనుకొండకు కొండగుర్తు గొలనుకొండ గుట్ట. గొలనుకొండలో వున్న ఈ అండాకారపు గుట్ట చాలా ఎత్తుగా వుంటుంది. చూపరులకు లింగంగా అగుపిస్తుంది. దీనికి దక్షిణాన ఒకప్పుడు చాలా పెద్ద మెట్లకోనేరు వుండేదట. ఆ కోనేరు పేరుమీదుగానే గ్రామానికి కొలనుకొండ అనే …

కొలనుకొండే గొలనుకొండ Read More »

ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‍ కోదండరాం, అమీర్‍ అలీ ఖాన్‍

ప్రొఫెసర్‍ కోదండరాం, ప్రముఖ జర్నలిస్టు అమీర్‍ అలీఖాన్‍ ఆగస్టు 16న గవర్నర్‍ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలోని తన చాంబర్‍లో కౌన్సిల్‍ చైర్మన్‍ గుత్తా సుఖేందర్‍ రెడ్డి ఇరువురితో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలకు అభినందనలు తెలియజేశారు. అసెంబ్లీ కార్యదర్శి వారికి రూల్‍ బుక్‍ అందజేశారు. తెలంగాణ సకల జన సేనాని ‘ప్రొఫెసర్‍ కోదండరాం’కోదండరామ్‍ అసలు పేరు ముద్దసాని కోదండ రామిరెడ్డి. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్‍ కోదండరాంగా సుపరిచితుడు. విద్య అంతా …

ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‍ కోదండరాం, అమీర్‍ అలీ ఖాన్‍ Read More »

దక్కన్‍ల్యాండ్‍పై ప్రముఖల అభిప్రాయాలు

12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దక్కన్‍ల్యాండ్‍‘‘దక్కన్‍ల్యాండ్‍’’ మాసపత్రిక పది సంవత్సరాల సందర్భంగా ప్రముఖలు అభిప్రాయలు తెలిపారు.2024 ఆగస్టు మాసంతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగామరికొందరి అభిప్రాయాలు ప్రచురించగలమని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. విశ్లేషణాత్మక దక్కన్‍ ల్యాండ్‍ పది వసంతాలు నింపుకొని నూట ఇరవై ఐదు సంచికల్ని ప్రచురించి లోతైన విశ్లేషనలను అందించిన సామాజిక, రాజకీయ మాసపత్రిక దక్కన్‍ల్యాండ్‍ తెలంగాణ మీడియా రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంది. అందుకు పత్రికా సంపాదకుడు శ్రీ యం. వేదకుమార్‍ అభినందనీయుడు. నాకు …

దక్కన్‍ల్యాండ్‍పై ప్రముఖల అభిప్రాయాలు Read More »

నాడు ఉద్యమ కరదీపిక – నేడు సాంస్కృతిక వేదిక దక్కన్‍ల్యాండ్‍…

ఈ మాసపత్రిక పేరు చెబితేనే చాలు… నాటి తెలంగాణ ఉద్యమం కళ్ల ముందు మెదలాడుతుంది. తెలంగాణ ఉద్యమం మొదలైన తొలినాళ్లలో 2012 సెప్టెంబర్‍లో దక్కన్‍ల్యాండ్‍ తొలిసంచిక వెలువడింది. మొదటి సంచిక కవర్‍ పేజ్‍ ఫోటో నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా పేర్కొంటూ దక్కన్‍ శిలల ఫోటో వేశారు. మొదటి సంచిక వెలువడడమే సామాజిక రాజకీయ పత్రికగా వెలువడింది. అలాంటి ట్యాగ్‍ లైన్‍తో వచ్చే పత్రికలకు భిన్నమైన కవర్‍ పేజ్‍తో రావడమే మొదటిసారిగా …

నాడు ఉద్యమ కరదీపిక – నేడు సాంస్కృతిక వేదిక దక్కన్‍ల్యాండ్‍… Read More »

ప్రకృతే సౌందర్యం! 28 ప్రకృతే ఆనందం!! శ్రమైకజీవన సౌందర్యానికి ఖరీదులేదోయి!

భూమిపై సంపదల సృష్టికి మేమే కారకులమంటూ పెట్టుబడిదారులు, కాదు మేమేనంటూ శ్రమజీవులైన ఉత్పత్తిదారులు నినదిస్తూ వుంటారు. ఈ ఇరువరి మధ్యన పెట్టుబడి, శ్రమ, లాభం అనే సూత్రీకరణలు వుంటాయని మహామేధావులైన మార్కస్, ఎంగెల్స్లు విడమర్చి చెప్పారు. పెట్టుబడి ఎంతవున్నా ఉత్పత్తికి కారణమైన శ్రమలేకుండా ఏ సంపద సృష్టించబడదు. నిజానికి పెట్టుబడిదారుడు లేకుండా శ్రమజీవులు బతకగలరు గాని, శ్రమజీవులు లేకుండా ఏ పెట్టుబడిదారుడు ఒక్కరోజు బతకలేడు. ఈ సూత్రీకరణలన్నీ మానవులకు మాత్రమే పరిమితమనే విషయాన్ని మీరు ఏనాడు గ్రహించడం …

ప్రకృతే సౌందర్యం! 28 ప్రకృతే ఆనందం!! శ్రమైకజీవన సౌందర్యానికి ఖరీదులేదోయి! Read More »

పచ్చ బంగారం-వెదురు సెప్టెంబర్‍ 18న ప్రపంచ వెదురు దినోత్సవం

వెదురు మానవ గ•హ అవసరాలకు నిర్మాణాలకు అత్యధికంగా ఉపయోగిస్తారు. అందుకే వెదురును ప్రజల స్నేహితుడు అని పేదవాడి కలప అని పిలుస్తారు. వెదురు నిర్మాణాలు భూకంపాన్ని తట్టుకోగలవు. ఈ చెట్టు ఆకులు రాలుస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ పచ్చగా ఉండి సతత హరితంగా ప్రసిద్ధమైంది. మిగిలిన చెట్లతో పోలిస్తే 35 శాతం అధికంగా ఆక్సిజన్‍ను వెదురు చెట్టు విడుదల చేస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది. వరద ప్రవాహాల నుంచి, నేలకోతను నివారిస్తుంది. 1945 సంవత్సరంలో హిరోషిమా విస్పోటనం తరువాత మళ్లీ …

పచ్చ బంగారం-వెదురు సెప్టెంబర్‍ 18న ప్రపంచ వెదురు దినోత్సవం Read More »

కొర్రలతో ఆరోగ్య సమస్యలకు చెక్‍

కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచివి. మన పూర్వీకులు వీటిని ఎక్కువగా తినేవారు. అందుకే ఆరోగ్యంగా, బలంగా ఉండేవారు. కొర్రలతో ఆరోగ్య ప్రయోజనాలుజర్నల్‍ ఆఫ్‍ అగ్రికల్చరల్‍ అండ్‍ ఫుడ్‍ కెమిస్ట్రీలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో కొర్రలు గుండె సంబంధిత సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుందని కనుగొంది. ఫాక్స్టైల్‍ మిల్లెట్‍ చాలా ఆరోగ్యకరమైనది. ఇది ఆసియాలో అత్యధికంగా ఉపయోగించే జొన్న జాతులలో ఒకటి. ఇండియన్‍ మిల్లెట్‍ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‍ ప్రకారం, ఇది ప్రధానంగా తెలంగాణ, ఆంధప్రదేశ్‍, కర్ణాటక, రాజస్థాన్‍, మహారాష్ట్ర, తమిళనాడు, …

కొర్రలతో ఆరోగ్య సమస్యలకు చెక్‍ Read More »

చెట్టు చెప్పిన పాఠం

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి. పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే …

చెట్టు చెప్పిన పాఠం Read More »