దామగుండంను కాపాడుకుందాం!
ఈ మధ్య బాగా వినిపిస్తున్న పదం పర్యావరణం. మేధావులనుంచి సామాన్య ప్రజల దాకా, అంతర్జాతీయ సంస్థల నుంచి గ్రామీణ యూనిట్స్ దాకా ఏనోట విన్నా ఈ పర్యావరణం అన్న పదమే. ఇది విషాదకరమూ, ఆనందకరమూనూ. రోజురోజుకీ విధ్వంసమవుతున్న పర్యావరణ సమతుల్యత గురించి నిరంతరం ఆందోళన చెందవలసిరావటం విషాదకరం. అన్ని విపత్తులకీ ఈ విధ్వంసమే కారణమనే స్ప•హ సామాన్య ప్రజలలో కూడా పెరిగి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం ఆనందకరం. ప్రజల జీవన వికాసానికి వివిధ రంగాలలో సమగ్రాభివృద్ధి …