ఈ చెట్టు పేరు బావోబాబ్ (Baobab). ప్రధానంగా మడగాస్కర్‍లో కనిపించడంతో పాటు ఆస్ట్రేలియాలో కూడా కనిపిస్తుంది. ఇవి 1,000 సంవత్సరాలకు పైగా జీవించగలవు. కొన్ని చెట్లు 3,000 సంవత్సరాల వరకు బతుకుతాయి. ఈ చెట్ల భారీ కాండంలో వేల లీటర్ల నీరు నిల్వ అవుతుంది. కాబట్టి కరువులను తట్టుకుని నిలబడగలవు. బావోబాబ్ చెట్లను నివాసంగా, ఆహారంగా, మరియు ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు. ఈ చెట్లు అంతరించే ప్రమాదంలో ఉన్న జీవుల జాబితాలో (ఎన్‍డేంజర్డ్ లిస్ట్లో) ఉన్నాయి. ముఖ్యంగా అడన్‍సోనియా గ్రాండిడియరీ (Adansonia grandidieri) అనే రకం తీవ్రంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది.
- దక్కన్‍న్యూస్
ఎ : 9030 6262 88