ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉత్తర కోస్తా ప్రాంతం యొక్క ప్రముఖమైన ప్రదేశం. ఈ జిల్లా 13,140 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. ఈ జిల్లాకి ఈశాన్యంలో విజయనగరం జిల్లా, నైరుతిలో తూర్పుగోదావరి జిల్లా, ఉత్తరాన ఒడిస్సా, దక్షిణాన బంగాళాఖాత సముద్రం. విశాఖపట్నం నగరం రాష్ట్రంలోని అతిపెద్ద నగరం. ప్రముఖమైన ఓడరేవు, స్టీల్ ప్లాంట్ సింహాచల క్షేత్రం, అందమైన పర్యాటక స్థలాలు ఉండటం వల్ల, ఈ నగరం, జిల్లా ప్రాముఖ్యత సంతరించుకున్నది. చెన్నై-కోల్‍కతా రహదారి NH-7 ఈ నగరం ద్వారా వెళ్తుంది.
ఈ జిల్లా చాలా వరకు కొండ ప్రాంతంగా ఉంటుంది. అడవి ప్రాంతం కూడా ఎక్కువే. మరియు చాలా రగ్గడ్ టోఫాగ్రఫితో కూడి వుంటుంది. ఈ జిల్లా కోస్తా ప్రాంతం కావడం, సముద్ర తీరాన పొడుగాటి, ఎత్తైన ఈస్టర్న్ఘాట్ కొండలు ఇక్కడి నుండి ఒడిస్సాలోకి విస్తరించాయి. దీని వల్ల కోస్టాల్‍ప్లేన్ చాలా తక్కువ వెడల్పూగా ఉంటుంది. అందుకే ఈ కోస్తా ప్రాంతాన్ని ఎరోశనల్ కోస్ట్గా గుర్తించబడినది. ఈ జిల్లాలోని ఎత్తైన ప్రాంతం 1645 మీటర్లు. తక్కువ ఎత్తుగల ప్రాంతం 29 మీటర్లు ఎం.ఎస్.ఎల్ పైన ఉండటం విశేషం. ఈ జిల్లాలోని ముఖ్య నదులు శారదా, తాండవా, గొస్తని వీటి ఉపనదులు. వీటి డ్రైనేజ్ నెట్ వర్క్ నీటి అవసరాలను పూర్తిచేస్తాయి. ఈ నదులన్ని దక్షిణానికి పారి సముద్రంలో కలిసిపోతాయి. వీటి డ్రైనేజ్ ప్యాటర్న్ సబ్ ప్యారిలెల్ నుండి సబ్ డెండ్రెటిక్‍గా ఉంటుంది.
ఈ ప్రాంతంలోని ముఖ్యమైన ల్యాండ్ ఫార్మస్ స్టక్చరల్ రిడ్జ్స్, డెమీడేశన్‍ల హిల్స్, ప్లాటూస్, ఫ్లడ్ ప్లేన్స్, కోస్తా ప్రాంతంలో బీచ్ రిడ్జ్స్, టైడల్ ప్లాట్స్, లగూస్స్, ఎత్తైన స్కార్‍ప్స్, కేవ్స్, వేవ్‍కట్ టెర్రేసెస్ వగైరా స్ట్రక్చర్స్ని చూడగలము. ఈ జిల్లాలో ఉత్తర ప్రాంతంలో లోమీ సాయిల్, దక్షిణ ప్రాంతంలో సాండి సాయిల్ కోస్తా ప్రాంతంలో అల్లువియల్ మరియు సాండి సాయిల్స్ని చూడగలము. ఈ జిల్లాలోని ఉత్తర ప్రాంతాన్ని జోన్-Iగా మరియు దక్షిణ ప్రాంతాన్ని జోన్-II గా నిర్ధారించారు. సీస్మోటెక్ టానిక్, స్టడీ ప్రకారం ఈ ప్రాంతం నియోటెక్ టానికల్‍గా ఏక్టివ్‍గా ఉన్నదన్న విషయాన్ని కాటర్న్రి స్టడీస్ ద్వారా నిర్ధారించబడినది. ఈ జిల్లా యొక్క కోస్తా ప్రాంతం ప్రముఖమైన ఫాల్ట్ స్కార్స్ ఉండటం ఇది అఫ్‍లిఫ్ట్ అయినట్టు ఆధారాలు సేకరించడం వల్ల ఈ ప్రాంతాన్ని ఫాల్ట్ కంట్రోల్డ్ కోస్ట్ అని నిర్ధారించబడినది.
ఈ జిల్లాలో ఈస్ట్ర్న్ ఘాట్ మొబైల్ బెల్ట్కు చెందిన శిలలు కొండలైట్, చార్నొకైట్ మిగ్మటైట్ గ్రూప్స్కు చెందిన ఈస్ట్ర్న్ ఘాట్ సూపర్ గ్రూప్‍కు చెందినది. కొండరైట్ గ్రూప్‍లో క్వార్ట్జ్ ఫెల్స్పార్, గార్నెట్ – సిల్లిమనైట్ గ్రాఫైటీ నైస్, కాల్క్ గ్రానులైట్ వీటిలో కార్ట్జైట్ అక్కడ కూడా రిడ్జస్, బాండ్స్ రూపంలో ఉన్నవి. చార్నాకైట్ గ్రూప్‍లో ఏసిడి, ఇంటర్‍మీడియట్, బేసిక్ వెరైటీస్‍ని చూడగలము. మిగ్నటైట్ గ్రూప్‍లో పర్ఫిరో బ్లాస్టిక్ గ్రానైట్‍సైస్, లెఫ్టినైట్, గార్నెట్ బయోటైటీ హైపర్స్ తీన్ నైస్, క్వార్థ్జో ఫెల్స్ పాతిక్ నైస్ మరియు ఇతర హైబ్రీడ్ శిలలు కలవు. బాక్సైట్, లాటరైటీలని ఎన్నో ఫ్లాట్ టాప్ కొండలపైన చూడగలము. ఇవి చాలా వరకు కొండలైట్స్పైన ఏర్పడతావి. ఇవి 1000 మీటర్ల ఎత్తైన కొండలపైన చూడగలము.
గోండ్‍వానా సూపర్‍గ్రూప్‍కు చెందిన తిరుపతి సాండ్‍స్టోన్ ఆర్క్యన్ క్రిస్ట్లైన్స్పైన అన్ కన్ఫర్మ్బుల్‍గా ఉన్నది. ఇది తీరానికి దగ్గరగా ఉన్నది.
క్వాటరనెరి సెడిమెంట్స్, ఫ్లూవియల్ మరియు మెరైన్ కోవకు చెందినవి. నదులకు ఇరు ప్రక్కన, ఫ్లువియల్ ఫ్లడ్ ప్లేన్స్కు చెందిన సెడిమెంట్స్, తీరానికి దగ్గరగా మెరైన్ పెడిమెంట్స్ని చూడగలం. భీమునిపట్నం వద్ద చాలా ప్రఖ్యాతి చెందిన ఎర్రమట్టి దిబ్బలను చూడగలము. ఇది బ్యాడ్ ల్యాండ్‍గా గుర్తించబడినది. ఇవి ఏర్పడిన విధానం గల్లి ఎరోశన్ వల్ల. ఈ దిబ్బలు రెడ్ సాండ్స్తో కూడి వుంటుంది. జియోలాజికల్‍గా దీనిని పేలియొడ్యూన్ అని నిర్ధారించిరి. దీని వయస్సు OSL మెదడ్ ద్వారా 55,000 సంవత్సరాలుగా నిర్ణయించబడినది. ఈ అసాధారణ ఎర్ర మట్టి దిబ్బలను 2014లో GSI ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ జియో హెరిటేజ్ సైట్‍గా గుర్తింపబడినది.
గోస్తని నదికి ఈశాన్యంలో సముద్రతీరాన్ని ఆనుకొని 10 మీటర్ల ఎత్తుగల, 3 కి.మీ. పొడవుతో క్వాటర్‍నెరికి చెందిన ఫెరుజినస్ సాండ్‍స్టోన్ వెవ్ కట్ టెర్రెస్, నియోటెక్టానిక్ ఎక్టివిటికి నిదర్శనంగా నిలుస్తుంది. దీని వయస్సు OSL మదడ్ ద్వారా 77,000 సంవత్సరాలుగా నిర్ధారించారు. ఇది రాష్ట్రంలోని క్వార్‍నెరికి చెందిన ఓల్డెస్ట్ యూనిట్. ఇది కాకుండా నదుల చాలా పై ప్రాంతంలో వల్కానిక్ యాశ దొరుకుతుంది. దీనిని సుమాత్ర దీవిలోని తోబా వోల్కా నిజంతో కొరిలేటి చేస్తారు. దీని వయస్సు 75,000 సంవత్సరాలుగా నిర్ధారించారు.
ఈ జిల్లాలోని శిలలో రీజినల్ ఫోలియేషన్ NE-SW నుండి NW-SE ఈ దిశలలో చూడగలం. ఈ శిలలో మేజర్ ఇసోక్లైనల్ ఫోల్డ్ దానిపై క్రాస్ ఫోల్డ్లను చూడగలం. ఈ ప్రాంతంలో NE-SW మరియు NW-SE దిశలలో ఫాల్ట్లు, లినియమెంట్స్ను చూడగలం.
ఖనిజ సంపద
బాక్సైట్ :
బాక్సైట్ క్వాప్పింగ్స్ రకరకాల సైజ్‍లో విస్తరించి యున్నది కొండలపైన ముఖ్యమైన బాక్సైట్ నిక్షేపాలు అరకు ప్రాంతంలో గాలికొండ, చిత్తంగొండి కొండలపై, చింతపల్లి ప్రాంతంలో గూడెం, సప్పర్లలో. అల్యుమినియం ఇందులో 45% నుండి 51%లో యున్నది. ఇవి కాకుండా మినిములూరు, అనంతగిరి ప్రాంతంలో కూడా బాక్సైట్ నిక్షేపాలు కలవు.
అపటైట్
అపటైట్ నిక్షేపాలు కాశీపట్నం ప్రాంతంలో వీన్స్ రూపంలో కలదు. ఇవి కొండలైట్ చార్నొకైట్ కాన్‍టాక్ట్లో దొరుకుతుంది. కనీసం 110 వీన్స్ని సీతారామపురం, సీతంపేట, రెగువలస బుడి ప్రాంతాలలో గుర్తించారు. ఇందులో నుండి 30 వీన్స్ లాభదాయకం అని నిర్ధారించారు. ఈ వీన్స్NNW-SSE నుండి NW-SE దిశలో 600-700 డిప్‍తో కలవు. ఈ వీన్స్ 600 మీరట్ల పొడవు 2.5 మీటర్ల వెడల్పుగా వున్నవి. దీని రిజర్వు 0.2999 మిలియన్ టన్నులు మరియు P5O5 శాతం 35% నుండి 42.5%గా 50 మీటర్ల లోతు వరకు కలవు. దీన్ని చాలా వరకు ఫర్టిలైజర్స్లో
ఉపయోగిస్తారు.
గ్రాఫైట్ :
గ్రాఫైట్ కొండలైట్ గ్రూప్ శిలల్లో వీన్స్, స్పెక్స్, స్ట్రీక్స్, లెన్సెస్ రూపంలో కలదు. దీన్ని కుప్పమెట్ట, లంకలపాలెం, పెద్దలపాలెం, మరుపాలెం, తడపాల, సివలింగాపురం, పాదికొండ ప్రాంతాలలో చూడగలం. దీన్ని క్రూసిబుల్స్ తయ్యారిలో, లూబ్రికెంట్‍గా, బ్యాటరీ సెల్స్లో, ఎలక్ట్రికల్ పరిశ్రమలో వాడతారు.
జెమ్‍స్టోన్స్ :
సిల్లిమనైట్ యొక్క జెమ్ వెరైటీ అరకు ప్రాంతంలో కొండలైటీలో, మైగ్మటైసీడ్ శిలలో దొరుకును. పాడేరు ప్రాంతంలో కొండలైటీలో చూడగలము. నిట్టిమడి, కొంటిల్ ప్రాంతాలలో మిగ్మటైస్ట్ కొండలైట్‍లో దొరుకును.
వర్మికులైట్ :
వర్మికులైట్ అపటైట్ వీన్స్ యొక్క మార్జిన్స్లో కాశీపట్నం ప్రాంతంలో దొరుకును. దీన్ని సిమెంట్ కాంక్రీట్, జిప్సం ప్లాస్టర్స్, ఎయిర్ కండిషనర్స్ మరియు ఫైర్ ప్రూఫ్‍లో ఉపయోగిస్తారు.
మాగ్నటైట్ :
మాగ్నటైట్ అపటైట్ వీన్స్తో కూడి వున్నది. కాశీపట్నం ప్రాంతంలో వీటి నిక్షేపాలు 30 మీటర్ల లోతు వరకు ఉన్నట్టు నిర్ధారించారు.
మార్బల్ / క్రిస్టలైన్ లైమ్‍స్టోన్ :
మాగ్నీషియమ్ మార్బల్ క్రిస్టలైన్ లైమ్‍స్టోన్ బ్యాండ్స్ రూపలో బొర్రా ప్రాంతంలో దొరుకును. దీన్ని ఫిల్లర్, మైల్డ్ అబ్రేసివ్‍గా, మాగ్నీషియం లైమ్ తయ్యారిలో ఉపయోగిస్తారు.
ప్లాగోఫైట్ మైకా : ఇది బొర్రా ప్రాంతంలో గ్రానైటిక్ శిలలో దొరుకును. దీన్ని హీట్ రెసిస్ టెంట్‍గా ఉపయోగిస్తారు.
ఓఖర్:
ఓఖర్ నిక్షేపాలు సారంగి, అరకు పరిసరాలలో నాలా సెఁ్‍న్‍లో, కొండల దిగువ ప్రాంతప్రాంతాలలో ఉన్నవి. దీనిని డిస్టెంబర్ మరియు పేన్‍ట్‍లో ఉపయోగిస్తారు.
బీచ్ సాండ్స్: భీమునిపట్నం వద్ద బ్లాఖ్ సాన్‍డ్స్ పుష్కలంగా వున్నవి. వీటిలో ఎక్కువ మొత్తంలో టైటానీయం ఖనిజం ఇల్మ్ నైట్, కొంత రూటైల్, తోరియం ఖనిజం మొనజైటీ మరియు ఇనుము ఖనిజం మాగ్నటైటీ కలదు. ఇక్కడ కాకుండా తుగిడం దగ్గర కూడా ఈ ఖనిజాలను చూడగలం.
- కమతం మహేందర్ రెడ్డి
ఎ : 90320 12955