తోలుబొమ్మల కళాకారిణికి జాతీయ పురస్కారం

భారత ప్రభుత్వం అందించే ‘శిల్పగురు’ అవార్డు తెలుగు కళాకారిణి దళవాయి శివమ్మను వరించింది. సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన ఆమె తోలుబొమ్మల కళాకారిణి.


కేంద్ర జౌళి శాఖ నిర్వహించే శిల్పగురు, జాతీయ చేతి వృత్తుల అవార్డు-2023 పోటీలకు తోలుపై అద్భుతంగా రూపొందించిన శ్రీకృష్ణ చరిత, ఏడు అడుగుల ఎత్తైన విశ్వరూప హనుమాన్‍ కళాఖండాలను ఆమె పంపించారు.


వీటిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం.. శిల్పగురు పురస్కారానికి ఎంపిక చేసింది. శివమ్మ మాట్లాడుతూ.. ఈ రెండింటినీ తయారు చేయడానికి 6 నెలల పాటు కష్టపడ్డానని చెప్పారు. తాను శిల్పగురు అవార్డుకు ఎంపిక కావడం నిమ్మలకుంట తోలుబొమ్మల కళాకారులకు దక్కిన గౌరవమని చెప్పారు. త్వరలో దిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు అందుకోనున్నట్లు వెల్లడించారు.

  • దక్కన్‍న్యూస్‍,
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *