ఉమ్మడి విశాఖపట్నం జిల్లా శిలా మరియు ఖనిజ సంపద
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉత్తర కోస్తా ప్రాంతం యొక్క ప్రముఖమైన ప్రదేశం. ఈ జిల్లా 13,140 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. ఈ జిల్లాకి ఈశాన్యంలో విజయనగరం జిల్లా, నైరుతిలో తూర్పుగోదావరి జిల్లా, ఉత్తరాన ఒడిస్సా, దక్షిణాన బంగాళాఖాత సముద్రం. విశాఖపట్నం నగరం రాష్ట్రంలోని అతిపెద్ద నగరం. ప్రముఖమైన ఓడరేవు, స్టీల్ ప్లాంట్ సింహాచల క్షేత్రం, అందమైన పర్యాటక స్థలాలు ఉండటం వల్ల, ఈ నగరం, జిల్లా ప్రాముఖ్యత సంతరించుకున్నది. చెన్నై-కోల్‍కతా రహదారి NH-7 …