ఇంద్రేశం ఒక పురా చారిత్రక సందేశం
సంగారెడ్డి జిల్లా పటాన్-చెరు మండలంలో ఇంద్రేశం, ఐనోల్, కర్దనూర్, క్యాసారం, చిట్కుల్, చిన్నకంజర్ల, నందిగావ్, పాటి ఘన్‍పూర్, పాశమైలారం, పెద్దకంజర్ల, పోచారం, పటాన్‍చెరు, బచ్చుగూడ, భానూర్, ముతంగి, ఇస్నాపూర్, రామేశ్వర్‍బండ, రుద్రారం, లక్దారం గ్రామాలున్నాయి. గ్రామనామాలను విశ్లేషిస్తే ఎక్కువమట్టుకు శైవసంబంధమైన పేర్లే ఎక్కువ. ఇంద్రేశంలో చరిత్రపూర్వయుగం నుంచి ఈ ప్రాంతంలో మానవుల ఆవాసాలుండేవని తెలిపే ఆధారాలు కొత్తరాతియుగం మానవులు తమ రాతిగొడ్డండ్లకు పదునుపెట్టుకున్న నూరుడు గుంటలు దొరికాయి.వేల సంవత్సరాల మనిషి చరిత్ర ఇక్కడుంది. బుద్ధుని కాలంలోనే బౌద్ధం …