1837వ సంవత్సరంలో గాలీబ్‍కి రూ. 5,000లు అప్పు ఇచ్చిన వ్యక్తి అది తిరిగి పొందడానికి గాలీబ్ మీద దావా దాఖలు చేశాడు. గాలీబ్‍కి వ్యతిరేకంగా మనీ డిక్రీ కూడా జారీ అయ్యింది. గాలీబ్ మిత్రుడెవరో ఆ డబ్బుని అతనికి చెల్లించాడని చెబుతారు. గాలీబ్ తీసుకున్న మరో లోన్ కట్టకపోవడం వల్ల 1848వ సంవత్సరంలో గాలీబ్ ఇంటి మీద దాడి జరుగుతుంది. గాలీబ్ జూదం ఆడుతున్నందుకు గానూ అతని మీద రూ।।100/- జరిమానాన్ని విధిస్తారు. గాలీబ్ జూదం ఆడటాన్ని మానుకోలేదు. ఆరు సంవత్సరాల తరువాత మళ్ళీ జూదం ఆడుతున్నందుకు అతని మీద కేసు నమోదవుతుంది. అతనికి ఆరు నెలల జైలుశిక్ష, రెండువందల రూపాయల జరిమానాన్ని విధిస్తారు.
కొత్వాల్ దురుద్దేశ్యంతో తన మీద కేసుపెట్టి శిక్ష విధించినారని ఆరోపిస్తూ కేసుని కోర్టులో కంటెస్టు చేస్తాడు. కానీ కోర్టు శిక్షని నిర్థారిస్తుంది. కఠిన కారాగార శిక్షకు బదులు సాధారణ జైలు శిక్షగా దాన్ని మార్పుచేస్తారు. చక్రవర్తి బహదూర్‍షా జాఫర్ ఈ విషయంలో జోక్యం చేసుకొని గాలీబ్ శిక్షని తగ్గించమని బ్రిటీష్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. సగం శిక్షను అనుభవించిన తరువాత బ్రిటీష్ సివిల్ సర్జన్ డాక్టర్ రాస్ గాలీబ్ శిక్షని తగ్గించమని బ్రిటీష్ ప్రభుత్వానికి సలహా ఇస్తాడు. మరో కవి మిత్రుడు మోమిన్ ఖాన్, డాక్టర్ రాస్‍ని కోరతాడు. రాస్ సలహాను బిట్రీష్ ప్రభుత్వం ఆమోదించి గాలీబ్‍ని విడుదల చేస్తుంది.
గాలీబ్, కోర్టులు, చట్టంతో వున్న సంబంధం అతని రచనలలో కొనసాగింది. అతని గజల్స్లలో చాలా చోట్ల న్యాయ పరిభాష కన్పిస్తుంది. దివాన్-ఎ-గాలీబ్ అదాలబ్ (కోర్టు), పౌజుదారీ (క్రిమినల్ లా), షెరిష్వీదార్ (కోర్టు అధికారి), గవా(సాక్షి), తలాబ్ (సమీన్స్), హుక్మ్ (ఉత్తర్వులు), ముఖద్దమా(కేసు) వంటి పదాలు పదబంధాలు ఆయన గజల్స్లో కన్పిస్తాయి. అంతేకాదు డైమ్-ల్-హబ్స్ (జీవితఖైదు), గిరాహైర్(అరెస్టు) ముద్దాయి లాంటివి కూడా అతని గజల్స్లో చోటు చేసుకున్నాయి.
ఈ పదాలను మెటాఫోరికల్‍గా వాడినప్పటికి అతనికి న్యాయవ్యవస్థతతో వున్న పరిచయం కన్పిస్తుంది. ఇదే విషయాన్ని తాహిర్ మహామూద్ తన వ్యాసంలో పేర్కొన్నాడు.
ఫిర్ కుచ్ ఏక్ దిర్ కో బే•రాల్ హై (మరోసారి హృదయం కొంత చంచలమైంది) అన్న అందమైన గాలీబ్ గజల్‍లో లీగల్ మెటఫర్స్ని గాలీబ్ విరివిగా వాడినాడు.
‘‘ఫిర్ ఖులా హైదార్-ఎ-అదాలత్-ఇ-నాజ్
గర్మ్ బజార్-ఎ-పౌజ్దారీ హై
ఫిర్ దియా పారా – ఇ – జిగర్ నెసవాల్
ఏక్ పార్శార్బ్-ఇ ఆహ-ఓ-జారాహై
ఫిర్ హుమే హైగవాహ్-ఇ-ఇష్క్
తలాబ్ అప్బ్కారీ కా హుక్మ్ జారీహై
దిల్ -ఓ-మిజగాన్ కా జో ముఖద్పదూ
తా ఆజ్ ఫిర్ ఉస్‍కి రూబ్ కార్ హై’’
కోర్టు తలుపు మళ్ళీ తెరుచుకుంది. అక్కడ క్రిమినల్ కేసు బజార్‍లా చురుకుదనంతో వుంది. ప్రపంచం చీకటిలో కప్పబడి ఉంది. ఆమె కురులు కోర్టు రికార్డు రూప్ కీపర్ల మాదిరిగా వున్నాయి. నా హృదయంలోని ఓ ముక్క నీ ముందు దరఖాస్తులో వుంది. ఆ ఫిర్యాదులో నా నిట్టూర్పులు, మూలుగులూ వున్నాయి.
ప్రేమ సాడిని మళ్ళీ పిలిచారు. కన్నీళ్ళు పెట్టుకోవాలని
ఉత్తర్వులని జారీ చేశారు. గుండె, కనురెప్పల మధ్య వున్న పాత వివాదం మరోసారి విచారణకు వచ్చింది. చట్టాల పదాలతో తయారైన ఈ పద్యాలను తీసుకొండి.
‘‘జాన్‍దర్ హవా-ఇయాక్ నిగాహ్-ఎ-గర్మ్
హై అసద్వర్వానా హై వకీల్ తేరా దాద్-ఖ్వాహ్-కా’’
మీ ఆత్మ మీ పిటీషనర్ కేసుని వాదించడానికి నిప్పు మీద నిమగ్నమై వుంది.
‘‘దిల్ ముద్దాయి ఓదీదా బినా ముద్దా
అలాహ్ నజ్జార్ కా ముఖద్దరూ ఫిర్
రూబకార్ హై’’
వాడి కన్నులు, హృదయం రెండింటిని ప్రతివాది చూపుల కేసు విచారణను పిలిచారు.
కవిని రక్షించడానికి కవిత్వం:
గాలీబ్ కోర్టు జీవితం అతని కవిత్వాన్ని ప్రభావితం చేసింది. అతని కవిత్వం అతని రాతను కూడా నిర్ణయించింది, నిర్థారించింది. ఇది చాలా ఉత్సాహంగా అన్పిస్తుంది. వైన్ మర్చంట్ గాలీబ్ మీద డబ్బు వసూలు చేసుకోవడానికి దావా వేశాడు. 1837వ సంవత్సరంలో గాలీబ్ మీద కేసు దాఖలై 5,000/- రూపాయల డిక్రిని జారీ అయ్యింది. ఆ కేసు ఈ కేసూ ఒకటేనని కొంత గందరగోళం ఏర్పడింది. ఈ కేసు ఢిల్లీలోని అత్యున్నత స్మాల్ కాజేస్ కోర్టు ముందుకు వచ్చింది. ముప్తీ సదరుద్దీన్ అన్న వ్యక్తి ఆ కోర్టుకి న్యాయమూర్తి. ఆ రోజుల్లో అది అత్యున్నతమైన కోర్టు. ఓ భారతీయుడు ఆ కోర్టుని అధిష్టించడం ఓ గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు.
ముప్తీ సాహెబ్ స్వతహాగా కవి. గాలీబ్‍కీ పాత స్నేహితుడు. ఇప్పుడు తెలిసిన వ్యక్తులు కోర్టు ముందుకు వస్తే న్యాయమూర్తులు ఆ కేసులని విచారించడానికి ఇష్టపడరు. కానీ ఆ రోజుల్లో అలాంటి పరిస్థితిలేదు. తెలిసిన వ్యక్తుల కేసులు తమ ముందుకు వచ్చినా అప్పటి న్యాయమూర్తులు విరమించుకోరు. కేసుని ఎలాంటి భయం కానీ, సంకోచం గానీ లేకుండా వింటారు. కోర్టు నుంచి సమన్స్ రాగానే కోర్టు ముందు గాలీబ్ హాజరైనాడు. కేసులోని క్లెయిమ్ గురించి ముఫ్తీసాబ్ అడిగా ఒప్పుకోమ్మని గాలీబ్‍ని అడిగాడు.
తరుచూ ఉదహారించే తన కవితని గాలీబ్ కోర్టు ముందు చదివాడు.
‘భార్జ్కీ పీటే తామ్‍మే,
రెకీన్ సమజ్‍చే తామ్ మై
కి హన్‍రంగ్‍లావేగి హమారీ ఫడా మస్తీ ఏక్‍దిన్’
నేను అప్పుడు తాగేవాడిని, కష్టాల్లో ఉండటం కోసం ఏదో అద్భుతాలు చేస్తుందని అనుకుంటున్నాను’.
ముఫ్తీ సాబ్ దీన్ని మౌఖిక అంగీకారంగా పరిగణించి, దావాను డిక్రీ చేస్తాడు. హతుడు చెల్లించాల్సిన డబ్బులు అతనే చెల్లించి గాలీబ్‍ని ఇంటికి పంపించి వేస్తాడు.
ఇప్పుడు వస్తున్న తీర్పుల్లో కొంతమంది న్యాయమూర్తులు గాలీబ్‍ని తరుచూ పేర్కొంటూ వుంటారు. వాటి గురించి మరోసారి.
-మంగారి రాజేందర్ (జింబో)
ఎ : 9440483001