తాపీమేస్త్రీ
ఈ కథలో మనకు ప్రధానంగా కనిపించే పాత్రలు రెండే రెండు రత్తమ్మ, సుందరమ్మ. రత్తమ్మ నెమ్మదస్తురాలు, డాంబికాలు నచ్చవు. ఉన్నదాంట్లో సర్దుకు పోయే మనిషి, సుందరమ్మ కాస్త డాబుసరి. ఆవిడకి హెచ్చులు, ఆడంబరాలు ఎక్కువ. ఇద్దరికీ భర్తలు లేరు. కాలాంతరము చెందారు. ఇరువురు తమ పిల్లల ఉద్యోగాల కోసం రాజమండ్రికి వచ్చారు. రత్తమ్మకు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు బి.ఎ. పూర్తి చేసిఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. సుందరమ్మకు ఇద్దరూ కొడుకులే. ఒకడు బి.ఎ. పూర్తి …