గత అక్టోబర్‍లో జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్,
సైన్స్ & టెక్నాజీ విభాగంలో దక్కన్‍ల్యాండ్ వ్యాసాల నుండి
100 మార్కులకు పైగా ప్రశ్నలు వచ్చిన వైనం
పోటీ పరీక్షార్థులకు దిక్సూచిగా యువ రచయిత పుట్టా ఓబులేసు వ్యాసాలు
సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2 వంటి పోటీ పరీక్షల్లో సైన్స్ &టెక్నాలజీ సబ్జెక్ట్ అనేది ప్రవహించే నీటిని తలపిస్తుంది. బేసిక్స్పై సమగ్ర అవగాహన కలిగి ఉంటూనే, రోజువారీ వర్తమాన వ్యవహారాలను డేగకన్నుతో పరిశీలిస్తూ, వాటిని బేసిక్ సబ్జెక్ట్కు జతపరచుకుంటూ ఆయా అంశాలపై పట్టు సాధించాల్సి ఉంటుంది. అయితే సైన్స్ & టెక్నాజీలోని క్లిష్టమైన సాంకేతిక పదజాలాన్ని అవగాహన చేసుకుంటూ, మూల భావనలపై పట్టు సాధించడం కాస్త శ్రమతో కూడిన వ్యవహారంగా చెప్పవచ్చు.
సైన్స్ & టెక్నాలజీ సబ్జెక్టుకు సంబధించి ఆంగ్లంలో ఉన్న కఠినమైన సాంకేతిక పదజాలాన్నంతటినీ, వీలైనంత వరకు మాతృభాషలోకి అనువదించి, మూలభావనలను సరళంగా, సులువుగా, సమగ్రంగా వివరించి చెబితే ఎంత బాగుంటుందో అని భావిస్తున్న సగటు తెలుగు మీడియం అభ్యర్థులకు దక్కన్‍ల్యాండ్ మాసపత్రికలో ప్రచురితమవుతున్న యువరచయిత పుట్టా ఓబులేసుగారి వ్యాసాలు దారిదీపంలా తోడ్పడుతున్నాయి.
కేవలం క్వశ్చన్ టు ఆన్సర్ రాసే విధానంలో కాకుండా ఒక కాన్సెప్ట్కు సంబంధించి విభిన్న కోణాలలో ఏ రూపంలో ప్రశ్న అడిగినా అభ్యర్థులు ధీటుగా సమాధానం రాసేవిధంగా అభ్యర్థులు పరిణామం చెందేలా పుట్టా ఓబులేసు వ్యాసాలున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
దక్కన్ ల్యాండ్ మాసపత్రిక సంపాదకులు మణికొండ వేదకుమార్‍గారి ప్రోత్సాహంతో దక్కన్‍ల్యాండ్ మాసపత్రికలో పుట్టా ఓబులేసు రాస్తున్న వ్యాసాలు తెలుగు మీడియం నేపథ్యం కలిగిన సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2 పోటీ పరీక్షార్థులకు ఎంతగానో ఉపకరిస్తున్నాయని పలువురు అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వర్తమాన వ్యవహారాలలో బాగా చర్చనీయాంశమైన టాపిక్‍ను ఎంపిక చేసుకోవడమే కాకుండా 3600 కోణంలో ఆ టాపిక్‍కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అత్యంత సులభశైలిలో వివరిస్తూ, తగు ఉపమానాలు, కొటేషన్లు, గణాంకాలతో అత్యంత నిగూఢంగా, విశ్లేషణాత్మకంగా పుట్టా ఓబులేసు రాసిన వ్యాసాలు పోటీ పరీక్షార్థుల మనసును హత్తుకుంటున్నాయని పలువురు అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు.
గత అక్టోబర్‍లో జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్-1, మెయిన్స్ పరీక్షలలో సైన్స్ & టెక్నాలజీ విభాగానికి సంబంధించి పేపర్-1, సెక్షన్-3 నందు ‘‘వాతావరణ మార్పులను తగ్గించడంలో పునరుత్పాదక ఇంధన పాత్రను వివరించండి’’ అన్న వ్యాసరూప ప్రశ్న 50 మార్కులకు ఇవ్వడం జరిగింది. పునరుత్పాదక ఇంధన వనరుల (రెన్యువబుల్ ఎనర్జీ)ను గురించి సమగ్రంగా విశ్లేషిస్తూ సుస్థిర ప్రగతికి ఊతం, బంగరు భవితకు మార్గం రెన్యువబుల్ ఎనర్జీ అన్న శీర్షికతో దక్కన్‍ల్యాండ్ అక్టోబర్-2024 సంచికలో వ్యాసం ప్రచురించడం జరిగింది. రెన్యువబుల్ ఎనర్జీకి సంబంధించి పేపర్-4, సెక్షన్-3 ఎన్విరాన్‍మెంట్ విభాగం నందు సాంప్రదాయ శిలాజ ఇంధన ఆధారితశక్తికి బదులుగా హరిత ఇంధనం (గ్రీన్ పవర్)ను ఉపయోగించడం వల్ల వచ్చే పర్యావరణ ఫలితాలను చర్చించుము అన్న ప్రశ్న 10 మార్కులకు ఇవ్వడం జరిగింది. ఇదే అంశంలో భారతదేశంలో పర్యావరణ సుస్థిర తనంతో కూడిన ఆర్థికాభివృద్ధిని సాధించడంలో ఎదురయ్యే సవాళ్లను విమర్శనాత్మకంగా చర్చించండి అన్న ప్రశ్నను 10 మార్కులకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా దక్కన్‍ల్యాండ్ అక్టోబర్-2024లో రెన్యువబుల్ ఎనర్జీ వ్యాసం చదవడం వల్ల ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు, తద్వారా 70 మార్కులు సులువుగా పొందవచ్చు.
అదే విధంగా పేపర్-5, సెక్షన్-1లో గగన్‍యాన్, నానో టెక్నాలజీ, రోబోటిక్స్ మీద ఒక్కొక్క ప్రశ్న 10 మార్కుల చొప్పున మొత్తం 30 మార్కులకు ప్రశ్నలొచ్చాయి. ఈ అంశాలన్నింటిపై గతంలో దక్కన్‍ల్యాండ్ మాసపత్రికలో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పేపర్-5, సెక్షన్-2లో భారతదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి మరియు రోగనిరోధకత కార్యక్రమాన్ని చర్చించండి అన్న ప్రశ్నను 10 మార్కులకు ఇవ్వడం జరిగింది. దీనిపై కూడా దక్కన్‍ల్యాండ్ పత్రికలో గతంలో రెండు సందర్భాల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. మొత్తం మీద దక్కన్‍ల్యాండ్ సైన్స్ & టెక్నాలజీ వ్యాసాలు అనుసరిస్తున్న అభ్యర్థులు 100 పైగా మార్కులు అవలీలగా పొందే అవకాశం ఉంది. పుట్టా ఓబులేసుగారి సైన్స్ & టెక్నాలజీ వ్యాసాలతో అభ్యర్థుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
సివిల్స్ పరీక్షలకూ ఉపయుక్తమైన వ్యాసాలు
ప్రస్తుత పోటీపరీక్షల ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీకు ఉన్న ప్రాముఖ్యత చాలా విస్తృతమైనది. ఇది ఎప్పటికప్పుడు వచ్చే వర్తమాన అంశాలతో గతిశీలమవుతూ ఉండే సబ్జెక్ట్. ఈ విషయంలో తెలుగుమీడియం అభ్యర్థులు సరైన వనరులు లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే దక్కన్‍ల్యాండ్ మ్యాగజైన్‍లో పుట్టా ఓబులేసు గారు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద రాసే వ్యాసాలు చాలా సరళంగా, సమగ్రమైన వివరణలతో, లోతైన విశ్లేషణతో కూడుకొని ఉంటాయి. ఇవి సివిల్స్ మరియు గ్రూప్-1మెయిన్స్ రాసే తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా ఉపయుక్తకరంగా ఉంటాయి. ఇటీవల జరిగిన తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నల సరళిలోనూ ఆయన వ్యాసాలలోని పునరుత్పాదక ఇంధన వనరులు జనరల్ ఎస్సే పేపర్‍లోనూ నానోటెక్నాలజీ, రోబోటిక్స్, వ్యాక్సినేషన్ తదితర అంశాల మీద పేపర్-5లోనూ డైరెక్ట్గా ప్రశ్నలు రావడం జరిగింది. కఠినతరమైన శాస్త్రీయ భావనలను సులభమైన నిర్వచనాలు, సందర్భోచిత ఉదాహరణలు, సమకాలీన అంశాల అనుసంధానం, లోతైన విశ్లేషణతో కూడిన ఆయన వ్యాసరచన తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా ఉపయోగకరం. ఆ విషయంలో తన ప్రయత్నం అభినందనీయం. దక్కన్‍ల్యాండ్ మాసపత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు. -శ్రీరామ్ చంద్ర శ్రీనివాస్. డీఎస్పీ, టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల మెంటార్
తెలుగు మీడియం అభ్యర్థులకు వరం
గ్రూప్-1 పరీక్ష రాసే అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఒక పట్టాన కొరుకుడు పడని సబ్జెక్ట్గా భావిస్తూ, ఆందోళన చెందుతూ ఉంటారు. ప్రధానంగా తెలుగు మీడియం అభ్యర్థులకు ఇలాంటి ఆందోళన ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే దక్కన్‍ల్యాండ్ మాసపత్రికలో పుట్టా ఓబులేసుగారు రాసే సైన్స్
అండ్ టెక్నాలజీ వ్యాసాలు చదివి, వాటిని పదిలపరుచుకుంటే అభ్యర్థులకు ఇక ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పవచ్చు. చక్కటి ఉపోద్ఘాలతో వ్యాసం ప్రారంభం నుండి ముగింపు వరకు ఏకబిగిన చదవాలన్న ఆసక్తిని కలిగించే విధంగా ఆయన వ్యాసాలు అద్భుతంగా ఉంటాయి. గత అక్టోబర్‍లో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కూడా ఓబులేసుగారు రాసిన నానో టెక్నాలజీ, రోబోటిక్స్, రెన్యువబుల్ ఎనర్జీ, గగయన్‍యాన్, వ్యాక్సిన్లు తదితర అంశాలపై నేరుగా ప్రశ్నలు రావడం హర్షనీయం. పుట్టా ఓబులేసు గారు ఇలా మరిన్ని సంక్లిష్ట, సాంకేతిక అంశాలకు సంబంధించిన వ్యాసాలు రాసి తెలుగుమీడియం అభ్యర్థులకు అండగా నిలవాలని కోరుకుంటూ, ఆయనను ఆ దిశగా ప్రోత్సహించాలని దక్కన్‍ల్యాండ్ మాసపత్రిక యాజమాన్యాన్ని అభ్యర్థిస్తున్నాను. విలువైన వ్యాసాలు రాస్తున్న పుట్టా ఓబులేసుగారికి అభినందనలు, దక్కన్‍ల్యాండ్ మాసపత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
-జిన్నా నాగార్జున రెడ్డి, గ్రూప్-1 ఆస్పిరెంట్ (టీజీపీఎస్సీ), ఎక్సైజ్ సీ.ఐ, హుజూర్‍నగర్, సూర్యాపేట జిల్లా, తెలంగాణ
విలువైన వ్యాసాలు
గ్రూప్-1 లాంటి ఉన్నతమైన పోటీ పరీక్షల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ చాలా విస్తృతమైనది మరియు ఒక సవాల్ లాంటిది. ఈ సవాల్‍ను ఎదుర్కోవడానికి సరైన వనరులు లేక తెలుగుమీడియం అభ్యర్థులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే దక్కన్‍ల్యాండ్ మాసపత్రికలో పుట్టా ఓబులేసుగారు రాసే సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యాసాలు ఆ కొరతను తీర్చేవిధంగా ఉన్నాయి. ప్రతివ్యాసం ప్రారంభంలో రాసే పరిచయం పాఠకులను ఆకట్టుకునేవిధంగా, వ్యాసాన్ని ఆమూలగ్రం చదవాలనే కుతూహలాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఇలా ప్రత్యేకమైన శైలితో సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యాసాలు రాసే రచయితలు అరుదుగా ఉంటారు. ఓబులేసుగారు అలాంటి అరుదైన రచయితల్లో ఒకరని నేను నమ్ముతున్నాను. ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్- మెయిన్స్ పరీక్షలో ఆయన రాసిన వ్యాసాల నుండే చాలా ప్రశ్నలు వచ్చాయి. భవిష్యత్‍లో ఇంకా అనేక సాంకేతిక అంశాలపై ఆయన మరిన్ని వ్యాసాలు రాయాలని కోరుకుంటున్నాను. తన వెలకట్టలేని వ్యాసాల ద్వారా ఉభయతెలుగు రాష్ట్రాల గ్రూప్స్ పోటీ పరీక్షార్థులకు ఎనలేని సేవచేస్తున్న పుట్టా ఓబులేసుగారికి శుభాభినందనలు. ఇటువంటి రచయితను వెలుగులోకి తెచ్చి, ప్రోత్సహిస్తున్న దక్కన్‍ల్యాండ్ మాసపత్రిక ఎడిటర్ వేదకుమార్ సర్‍కు హృదయపూర్వక కృతజ్ఞతలు. -ఎన్. రాంబాబు జోషి , గ్రూప్స్ ఆస్పిరెంట్, విశాఖపట్నం, ఎన్‍డీ(వీ)
కొత్వాల్ సచిన్,
ఎ : 97010 01036