December

ప్రాచీన ఖగోళ విజ్ఞాన గని ‘ముడుమాల’

ఎన్నికల సంరంభం ముగిసి ఫలితాల కోసం ఉత్సుకతో ఎదురుచూస్తున్న వేళ ‘దక్కన్‍ల్యాండ్‍’ ప్రజల ముందుకు వస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణా సాధనలో ప్రధాన నినాదాలయ్యాయి. గడిచిన కాలంలో అనేక కారణాల వలన నియామకాలలో ఎదురయిన ఆటంకాలు, వైఫల్యాలు నిరుద్యోగ యువతలో ఆందోళనకు కారణమయ్యాయి. రాబోయే నూతన ప్రభుత్వం ముందు నిరుద్యోగ సమస్య సవాలుగా నిలువనుంది. ఏ ప్రభుత్వమయినా సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తుంది. ఆ క్రమంలో అనేక రూపాలలో ఆటంకాలు …

ప్రాచీన ఖగోళ విజ్ఞాన గని ‘ముడుమాల’ Read More »

పర్యావరణ ఉద్యమాల చిరునామా కెప్టెన్‍ జలగం రామారావు

పర్యావరణవేత్త, సామాజిక చింతనాపరుడు కెప్టెన్‍ జలగం రామారావు. తన 94వ ఏట అనారోగ్యంతో హైదరాబాద్‍లో మరణించారు.ప్రత్యేకంగా పర్యావరణం,కాలుష్యం అంశాలపై పని చేసే వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఖమ్మం జిల్లాలో జన్మించిన ఆయన ఇంజినీరింగ్‍ పూర్తి చేశాక నౌకాదళంలో చేరారు. కెప్టెన్‍ స్థాయికి ఎదిగి 23 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ పొందారు. దాదాపు రెండు దశాబ్దాలు హైదరాబాద్‍లో చిన్న మెషిన్‍ టూల్స్ పరిశ్రమ నడిపించారు. అందువల్ల పరిశ్రమ రంగంలో జరుగుతున్న అవక తవకలను, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యాన్ని, …

పర్యావరణ ఉద్యమాల చిరునామా కెప్టెన్‍ జలగం రామారావు Read More »

గత చరిత్రపు మరచిపోయిన మెట్లబావులు రాష్ట్ర చరిత్రలోకి తొంగిచూపు

హైదరాబాద్‍ చారిత్రాత్మక పరిసరాలు, కాలనీలలో ‘‘హైదరాబాద్‍లోని బౌలీలు’’(చారిత్రాత్మక మెట్లబావులు) అన్వేషణ.కాకతీయుల పాలనలో వర్షపు నీటిని సమర్ధవంతంగా పట్టుకోవడంలోమెట్లబావులు కీలక పాత్ర పోషించాయి.గుజరాత్‍కు భిన్నంగా తెలంగాణలో మెట్లబావుల కార్యాచరణపై దృష్టి సారించిసమర్థవంతంగా పనిచేయడానికై రూపొందించాయి. తెలంగాణలో మరుగన పడిన, మరచిపోయిన మెట్ల బావుల ఉనికిని కనుగొనడానికి, అన్వేషించడానికి మరియు డాక్యుమెంట్‍ చేయడానికి, హైదరాబాద్‍ డిజైన్‍ ఫోరం అధ్యక్షుడు ప్రొఫెసర్‍ యశ్వంత్‍ రామమూర్తి నేతృత్వంలో అతని బృందం నైపుణ్యంతో, విషయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించి, సమర్పించిన ‘‘ది ఫర్గాటెన్‍ స్టెప్వెల్స్ …

గత చరిత్రపు మరచిపోయిన మెట్లబావులు రాష్ట్ర చరిత్రలోకి తొంగిచూపు Read More »

పర్యావరణ హితం – గాంధీ దీపధారి

పర్యావరణ హితవరులుగా వ్యక్తులు, వ్యవస్థలు. వారి వారి వైఖరులు ఒక మేరకు మనకు దారి చూపుతుంటాయి. దిశానిర్దేశం చేస్తూ ఉంటాయి. ప్రతి సందర్భంలోనూ ఎదుర్కోవలసిన ప్రశ్న ఏమిటంటే సమస్యలో భాగమవుతామా? లేక పరిష్కారంలో భాగంగా ఉంటామా? అనేది ఇదొక ఎడతెగని, ఎంతకీ సంతృప్తికర సమాధానం దొరకని ప్రశ్నగానే మిగులుతుంది. అభివృద్ధి, స్థిరత్వం, సమతుల్యతను సాధించడం అనేవి ఒకదాని కొకటి అభిముఖంగా నిలవటమే కాక పరస్పరం ఖండించుకుంటూ ఉంటాయి. గాంధీ మహాత్ముడు గ్రామ పునరుద్ధరణ మీదనే భారతదేశ స్వాతంత్య్రం …

పర్యావరణ హితం – గాంధీ దీపధారి Read More »

జాఫర్‍ మామూ

ఆంధప్రదేశ్‍ అవతరించిన సంవత్సరమది.ఆ రోజులలో ఒకానొక సాయంత్రం చార్‍సౌ సాల్‍ హైద్రాబాద్‍ పాతనగరం శాలిబండల మా ఇంటెనుక పెరట్ల నిండుపున్నమి పండు వెన్నెల మల్లె పందిరి క్రింద ఘుమఘుమల మత్తుగాలుల మధ్య ముషాయిరా శురువయ్యింది. రంగు పూల షత్రంజీ మీద మల్లెపూవులాంటి తెల్లని చాదర్‍ పరిచి అందులో గుండ్రంగా కూర్చున్న వాళ్ల మధ్యల వెలుగుతున్న ‘షమా’ సాక్షిగా కమనీయ కవితాగానానికి అంతా తయార్‍ అయ్యింది. నాజూకు నడుము లాంటి తెల్లని పొడుగు పొడుగు సీసపు గ్లాసులల్ల ఎరెర్రని …

జాఫర్‍ మామూ Read More »

రోజు రోజుకూ ఆ గుళ్లు కూరుకుపోతున్నాయి చూపరుల గుండెలు తరుక్కుపోతున్నాయి

నీళ్లలో కాదు, మట్టిలో మునిగిపోతున్నాయి. ఒకప్పుడు అంగరంగ వైభవంగా వెలిగిపోయిన ఆగుళ్లు మట్టిలో కూరుకుపోతున్నాయి. చూపరుల గుండెలు తరుకుపోతున్నాయి. ఎక్కడో కాదు. ఇక్కడే హైదరాబాదు నగర పరిసరాల్లోనే.ఒకప్పుడు పట్టణ చెరువు. అది ఇప్పుడు పటాన్‍చెరు. కన్నడంలో పొట్టలకెఱె, పొట్టళ కెఱెయె అని పేర్కొన్న పటాన్‍చెరు. క్రీ.శ. 11వ శతాబ్దిలో కళ్యాణ చాళుక్యుల శాఖా నగరంగా వర్ధిల్లిన చోటు. రాజులు, రాణులు, చక్రవర్తులు, ప్రధానులు, సామంతుల రాకతో కళకళ లాడిన నగరం. సువిశాల సౌధాలతో, గుళ్ళూ, గోపురాలతో, చక్కటి …

రోజు రోజుకూ ఆ గుళ్లు కూరుకుపోతున్నాయి చూపరుల గుండెలు తరుక్కుపోతున్నాయి Read More »

వ్యాక్సిన్‍ సాంకేతికతలో సాటిలేని దిగ్గజం…!! ఏ ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్‍ టెక్నాలజీ

(2023వ సంవత్సరానికి ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్‍ సాంకేతికతపై పరిశోధనకు గానూఫిజియాలజి (మెడిసిన్‍) విభాగంలో నోబెల్‍ బహుమతి వచ్చిన సందర్భంగా…) మానవ పరిణామ క్రమంలో నిప్పు, చక్రం, ద్రవ్యం (కరెన్సీ) లాగా వ్యాక్సిన్‍ను కూడా ఒక గొప్ప నవ కల్పనగా అభివర్ణించడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. కొన్ని శతాబ్దాల క్రితం ఏదైనా వ్యాధి సోకిందంటే, దానిని నియంత్రించే మార్గాలు లేక గ్రామాలకు గ్రామాలే శవాల గుట్టలుగా మారిపోయేనన్న విషయం మనందరికీ తెలుసు. ఇలా తమపై విలయతాండం చేస్తున్న వ్యాధుల విషయంలో కలవరపడిన …

వ్యాక్సిన్‍ సాంకేతికతలో సాటిలేని దిగ్గజం…!! ఏ ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్‍ టెక్నాలజీ Read More »

తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు

మెగాలిథిక్‍ మెన్హిర్ల పరిరక్షణలో స్థానికులకు భాగస్వామ్యండిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ మరియుదక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రౌండ్‍ టేబుల్‍ మీట్‍ వరల్డ్ హెరిటేజ్‍ వీక్‍ -2023ని పురస్కరించుకొని 2023 నవంబర్‍ 20న తెలంగాణ ప్రభుత్వ డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ (DHT) విభాగం, దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రౌండ్‍ టేబుల్‍ మీట్‍ జరిగింది. ముడుమాల్‍లోని మెగాలిథిక్‍ మెన్హిర్స్ : వాటి ప్రాధాన్యం అనే అంశంపై ఈ సమావేశం జరిగింది. ఈ మానవ నిర్మిత …

తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు Read More »

కాంచన్‍ జంగ్‍ నేషనల్‍ పార్క్

ఉనికి: సిక్కిం, భారతదేశంఅంశం: యునెస్కో వారసత్వ గుర్తింపుప్రకటిత సంవత్సరం: 2016విభాగం: మిక్స్డ్‍ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్షిత ప్రాంతాలకు సంబంధించి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో ఉన్న వాటిలో కాంచన్‍ జంగ్‍ నేషనల్‍ పార్క్ ఒకటి. అసాధారణ రీతిలో ఏడు కిలోమీటర్లకు పైగా నిట్టనిలువు వాలు కూడా ఇక్కడ చూడవచ్చు. గడ్డితో కూడిన లోయలు, మంచుతో నిండిన కొండలు… ఇలా వైవిధ్యభరితంగా ఈ ప్రాంతం ఉంటుంది. కాంచన్‍ జంగా పర్వతంతో పాటుగా ఇక్కడ ఉన్న మరెన్నో ప్రాకృతిక విశిష్టతలు ప్రగాఢ …

కాంచన్‍ జంగ్‍ నేషనల్‍ పార్క్ Read More »

నిరుద్యోగ యువతతో ధైర్యంగా చర్చించిన కేటీఆర్‍

ఇతర పార్టీల నాయకులూ అదే బాటలో నడవాలి‘ఐడ్రీం’ సీనియర్‍ జర్నలిస్ట్ నెల్లుట్ల కవిత చేసిన ఇంటర్వ్యూలో టీఎస్‍పీఎస్సీ మాజీ ఛైర్మన్‍ ప్రొఫెసర్‍ ఘంటా చక్రపాణి నీళ్లు, నిధులు, నియామకాలు…ఈ మూడు అంశాలే ప్రధానంగా తెలంగాణ ఉద్యమం కొనసాగింది. కోరుకున్న తెలంగాణను సాధించుకున్నాం. నీళ్లు, నిధుల విషయంలో వివిధ అంశాలు కొంతవరకు సజావుగానే సాగినప్పటికీ… నియామకాల విషయానికి వచ్చే సరికి కొంత అసంతృప్తి నెలకొంది. జాబ్‍ క్యాలెండర్‍ లేకపోవడం, నోటిఫికేషన్లు వాయిదా పడటం, ప్రశ్నాపత్రాలు లీక్‍ కావడం వంటివి …

నిరుద్యోగ యువతతో ధైర్యంగా చర్చించిన కేటీఆర్‍ Read More »