గత చరిత్రపు మరచిపోయిన మెట్లబావులు రాష్ట్ర చరిత్రలోకి తొంగిచూపు

హైదరాబాద్‍ చారిత్రాత్మక పరిసరాలు, కాలనీలలో ‘‘హైదరాబాద్‍లోని బౌలీలు’’
(చారిత్రాత్మక మెట్లబావులు) అన్వేషణ.
కాకతీయుల పాలనలో వర్షపు నీటిని సమర్ధవంతంగా పట్టుకోవడంలో
మెట్లబావులు కీలక పాత్ర పోషించాయి.
గుజరాత్‍కు భిన్నంగా తెలంగాణలో మెట్లబావుల కార్యాచరణపై దృష్టి సారించి
సమర్థవంతంగా పనిచేయడానికై రూపొందించాయి.

తెలంగాణలో మరుగన పడిన, మరచిపోయిన మెట్ల బావుల ఉనికిని కనుగొనడానికి, అన్వేషించడానికి మరియు డాక్యుమెంట్‍ చేయడానికి, హైదరాబాద్‍ డిజైన్‍ ఫోరం అధ్యక్షుడు ప్రొఫెసర్‍ యశ్వంత్‍ రామమూర్తి నేతృత్వంలో అతని బృందం నైపుణ్యంతో, విషయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించి, సమర్పించిన ‘‘ది ఫర్గాటెన్‍ స్టెప్వెల్స్ ఆఫ్‍ తెలంగాణ’’ను ఇటీవల విడుదల చేసారు.


డాక్యుమెంటేషన్‍ ప్రయాణంలో కనుగొన్న ఈ మెట్లబావులు ఆనాటి కాలంలో వ్యవసాయ భూములు, కోటలు, దేవాలయాలు, పట్టణ ప్రాంతాలతో వివిధ రూపాల్లో అనుసంధానించబడి, నీటి రిజర్వాయర్లుగా పనిచేసాయి. నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు సేకరించడం, కొరత సమయాల్లో అందుబాటులో ఉండేలా చూడటంపై వారు ప్రధానంగా దృష్టి పెట్టేవారు.
గత చరిత్ర తరచి చూస్తే నాగరికత అంతా మానవ మనుగడకు కీకలమైన నదులు లేదా సరస్సులు వంటి నీటి వనరులపై కేంద్రీకృతమయ్యాయి.
కేవలం తాగునీరుగా మాత్రమే కాక, సాంస్కృతికపరంగా మరియు మతపరంగా గణనీయమైన ప్రాముఖ్యతను పొంది, ఆరాధనా ప్రదేశాలుగా పరిగణించబడ్డాయి.


ఈ పుస్తకంలో స్నేహ పార్ధసారథి రాసిన ‘యాన్‍ ఓడ్‍ టు వాటర్‍’ అనే రచనలో మెట్లబావులను అన్వేషించడానికి మరియు అధ్యయనం చేయడానికి భారతదేశం అంతటా ప్రయాణం సాగించిన విషయం ప్రస్తావిస్తుంది. ఈ పుస్తకంలో ఆమె పరిశోధన క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నుండి ఆధునిక కాలం వరకు నీటి వ్యవస్థల పరిణామాన్ని, ప్రాంతీయ ప్రాముఖ్యతను వివరిస్తుంది.


శ్రీవల్లి ప్రదీప్తి ఇక్కుర్తి రచన,”The Reasoning, Relation, and Positioning of Water” లో, పురాతన హిందూ గ్రంథాలలో నీటి ప్రాముఖ్యతను పేర్కొంది. దేవాలయాల ఈశాన్య దిశలో నీరు ఎందుకు స్థానం ఆక్రమిస్తుందో ఆమె వివరించారు. అదనంగా, ఇది ఈ స్థానానికి మరియు ఉత్తరం మధ్య అయస్కాంత సంబంధాన్ని హైలైట్‍ చేస్తూ పవిత్ర ప్రదేశాలలో నీటి స్థానాన్ని ఎలా నిర్ణయిస్తుందో నొక్కి చెబుతుంది.


ముఖ్యంగా బషీర్‍భాగ్‍, ఇబ్రహీంభాగ్‍ వంటి ‘బాగ్స్’గా పిలువబడే హైదరాబాద్‍లోని ప్రాంతాలు, కాలనీల మధ్య సంక్లిష్టమైన సంబంధాన్ని ‘బావోలీస్‍ ఆఫ్‍ హైదరాబాద్‍’ పుస్తకంలో రామమూర్తి పొందుపరిచారు. ఒకప్పుడు ‘బాగ్‍ నగర్‍’ అని పిలువబడే నగరంలో భాగమైన ఈ ప్రాంతాలు అనేక ఉద్యానవనాలు మరియు కాలనీలను కలిగి ఉన్నాయి. వీటిలో బావోలిస్‍ (మెట్ల బావులు) అంతర్భాగాలుగా ఉన్నాయి. ముఖ్యంగా, పుత్లీబౌలి వంటి కాలనీలు ఈ బావోలీల ఉనికి ద్వారా గుర్తించబడ్డాయి. ఇవి నగర పరిధిలో వాటి చారిత్రక ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి.

“Hydrology and Geomorphology of Telangana”అంశంలో మౌనిక దేరెడ్డి స్టెప్‍వెల్స్ లోపల కనిపించే నేలల కూర్పుపై దృష్టి సారించారు. వర్షపాతం నమూనాలు, నీటి వనరులు, భూగర్భ జల మట్టాలు మరియు శిలల భౌగోళిక కూర్పుతో సహా వివిధ అంశాలను ఈ కథనం విస్తరించింది. ఇది బావోలిస్‍ ఎలా సృష్టించబడిందో పరిశీలిస్తుంది. ఈ నిర్మాణాలలో స్థిరమైన ఆర్ద్రీకరణను సులభతరం చేసే చీమల కొండలు లేదా పాము గుంతలు వంటి ప్రత్యేక నిర్మాణాలను, అదనంగా, ఇది బావోలిస్‍ లోపల స్థిరమైన తేమ స్థాయిలకు దోహదం చేయడంలో జామున్‍ చెట్టు వంటి చెట్ల ప్రాముఖ్యతను సూచిస్తుంది.
మెట్ల బావుల్లో రాతి పరిమాణం, మట్టిని మోసే సామర్థ్యం, ఇసుకు, సున్నం మోర్టార్‍ తదితర సాంకేతిక పరిజ్ఞానాన్ని డీకోడ్‍ చేయడం గురించి ప్రొఫెసర్‍ నీహీమా షానవాజ్‍ మాట్లాడారు.


ముఖ్యంగా తెలంగాణలో కాకతీయు పాలనలో సాగునీటి వ్యవస్థలో మెట్లబావులు కీలక పాత్ర పోషించాయి. వర్షపు నీటిని సమర్థవంతంగా కాపాడుకుని నిల్వ చేసుకునే విధంగా కాకతీయులు పరిజ్ఞానంతో కట్టలు, నిర్మాణాలకు రూపకల్పన చేశారు. ఈ మెట్ల బావులు కీలకమైన జలాశయాలుగా మారి, వర్షాకాలం నుండి నీటిని నిల్వచేసి, తద్వారా వ్యవసాయానికి స్థిరమైన నీటి సరఫరాను అందించాయి.
నేటికీ, ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు తమ వ్యవసాయ అవసరాలకు వర్షాకాల నీటిని వ్యర్థం కాకుండా కాపాడడానికి ఈ పురాతన నీటి సంరక్షణ పద్ధతుల యొక్క శాశ్వత వారసత్వం మరియు ఆచరణాత్మకతను అనుకరిస్తున్నాయి.


శ్రీవల్లి ప్రదీప్తి ఇక్కుర్తి గుజరాత్‍లో మెట్లబావులు చెక్కిన మాదిరిగా కాకుండా తెలంగాణలో క్రియాత్మకమైనవి మరియు ఎక్కువ శిల్పకళను కలిగి ఉండక అందులోని ప్రతిమలు పురాణాలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు.
అపర్ణ బిదార్కర్‍ కేవలం నీటి సేకరణ చర్యకు నీరు మరియు మహిళల మధ్య సంబంధంపై ఆసక్తికరమైన దృక్పథాన్ని హైలైట్‍ చేస్తుంది. ఆమె అభిప్రాయం ప్రకారం, నీటి ప్రదేశాలు ఉపయోకరమైన వనరులే కాకుండా సామాజిక పరస్పర సంబంధాలను పెంపొందించడానికి సమయాన్ని కేటాయించే కేంద్రాలుగా మారాయి. ఈ ప్రాంతాలు మహిళలకు విశ్రాంతి, ఆనందం మరియు వినోదం కోసం అవకాశాలను అందించాయి. దాని క్రియాత్మక పాత్రకు మించి, నీరు సామాజిక జీవితంలో అంతర్భాగంగా మారింది, ముఖ్యంగా మహిళలకు, పరస్పర చర్చలు మరియు స్నేహానికి స్థలాలుగా కూడా ఉపయోగపడ్డాయి.


యశ్వంత్‍ రామమూర్తి ఈ మెట్లబావుల ప్రస్తుత దుస్థితిని, భవిష్యత్తును పరిశీలనలో వాటి స్థితిగతులపై ఆశ, నిస్పృహ రెండింటినీ ప్రతిబింబించే కథనాన్ని ముందుకు తెచ్చారు.
బావులలోని కొన్ని కొండిపోయినప్పటికీ, పునర్వినియోగానికి ఒక స్ఫూర్తిదాయక అంశం ఉంది. అనేక మంది నివాసితులు ఈ ప్రదేశాలను వివిధ సాంస్కృతిక మరియు సామాజిక కార్యకలాపాల కోసం పునర్నిర్మించారు. ప్రజల అనుబంధాన్ని ఈ నిర్మాణాల పునర్వినియోగం వల్ల పునరుజ్జీవింపజేసింది. ఫొటోగ్రఫీ సెషన్లు, వివాహాలు, ఫ్యాషన్‍ షూట్లు మరియు సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికలుగా మార్చారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రసిద్ధ గమ్యస్థానాలుగా మార్చింది. ఈ బావుల లోపల ప్రాంగణాలు మరియు ఇంటరాక్టివ్‍ ప్రదేశాలను రూపొందించడం, సామాజిక నిమగ్నతను పెంపొందించడం మరియు పరస్పర చర్చలు మరియు ఆహ్లాద కేంద్రాలుగా అందించడంలో వాస్తు శిల్పులు కూడా ఒక పాత్ర పోషించారు. ఈ పుస్తకంలోని వ్యాసాలు సంపాదకుడు, కల్పనా రమేష్‍ల కథలతో నిండి ఉన్నాయి.

  • దక్కన్‍న్యూస్‍, ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *