December

వలసదారుల దినోత్సవం!

డిసెంబర్‍ 18 ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్లమంది పైగా ఎన్‍ఆర్‍ఐలు విశ్వవ్యాప్తంగా అధిక సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిశీలించి ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ, 1990 డిసెంబర్‍ 18న జరిగిన సమావేశంలో ‘వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాని మేరకు డిసెంబర్‍ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా ప్రకటించింది. వలస అంటే బతుకుదెరువు కోసం, లేదా ఆర్థికాభివృద్ధి కోసం చేసుకునే ‘నివాస మార్పు‘గా భావించవచ్చు. ప్రజలు వలసలతో …

వలసదారుల దినోత్సవం! Read More »

ఎట్లుండే కరెంటు ఎట్లయ్యింది

A Small body of determined spirits fired by an unquenchable faith in thair mission can alter the course of history. -Mahathma Gandhi ముఖ్యమంత్రి కేసీఆర్‍ నేతృత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. ఉద్యమం పొడగునా కలలు- ‘తెలంగాణొస్తే మన వ్యవసాయరంగానికి, పల్లెలకు నిరంతర సరఫరా అందించవచ్చు, భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించుకొని గోదావరి, కృష్ణా నీళ్లను రాష్ట్రం నలుచెరుగులా పారించి పాడి పంటలతో పచ్చగా మెరిసిపోయే …

ఎట్లుండే కరెంటు ఎట్లయ్యింది Read More »

ఉమ్మడి మెదక్‍ జిల్లా శిలా మరియు ఖనిజ సంపద

ఈ జిల్లాలోని ప్రాంతం 9,699 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. ఈ ప్రాంతం యొక్క పాత పేరు మెతుకు దుర్గం. ఈ పేరు రావడానికి కారణం ఇక్కడ సన్నటి బియ్యం పండించడం వల్ల వచ్చింది. ఈ జిల్లాకి దక్షిణాన రంగారెడ్డి జిల్లా, తూర్పున వరంగల్‍, ఈశాన్యం కరీంనగర్‍, ఉత్తరాన నిజామాబాద్‍, పశ్చిమాన కర్నాటక రాష్ట్రం యొక్క బీదర్‍, గుల్‍బర్గా జిల్లాలు. రెండు రాష్ట్రాల రహదారులు ఎన్‍హెచ్‍-9 (హైదరాబాద్‍-నాగపూర్‍) ఈ ప్రాంతం గుండా వెళ్తావి. రెండు రైలు మార్గాలు, …

ఉమ్మడి మెదక్‍ జిల్లా శిలా మరియు ఖనిజ సంపద Read More »

రత్నాల గాథ

రత్నం అనగా విలువైన రాయి. ఒక చక్కని మణి, ఆభరణం, లేదా ఉపరత్నం. ఇది ఆభరణాలలో పనికివచ్చే ఒక ఖనిజశకలం లేదా స్ఫటికం కావచ్చు. మన సాహిత్యంలో పంచరత్నాలు, నవరత్నాలు వంటివి కనిపిస్తాయి. ఇంకొక అభిప్రాయం ప్రకారం ఏదైనా విలువైనది, అమూల్యమైనది, నిధి మరియు ఉత్తమోత్తమ మైనది రత్నంగా వ్యవహరించబడింది. రత్నాల నిఘంటువు ప్రకారం రత్నం సింహళపదం నుంచి వచ్చింది. దీని అర్థం మణి అనగా ముక్కలు చేయబడి, కోయబడి సాన పట్టిన, మన్నికగల అందమైన ఆభరణాలకు …

రత్నాల గాథ Read More »

కథలు దృక్పథాలని మారుస్తాయా?

ఈ ఆదివారం పెరుగన్నం – రానిది ఒక సత్యం అన్నయ్యే!కథలు నాగరికతను ధ్వంసం చేయగలవు. యుద్ధాలని జయించగలవు. కొన్ని మిలియన్ల ప్రజల హ•దయాలని చూరగొనగలవు. శత్రువులని మిత్రులుగా చేయగలవు.ఎన్నో యుద్ధాలు కలగలిపితే వచ్చే విజయం కన్నా కథ సాదించిన విజయం ఎక్కువ.గొప్ప మతాలన్నీ ఆకర్షించేది కథల ద్వారానే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ అభిప్రాయాల గురించి ఎలాంటి సందేహాలు కలిగినా ఒకటి మాత్రం నిజం – కథలు సంస్కారాన్ని కలిగిస్తాయి. ఆ మాట కొస్తే సాహిత్యం …

కథలు దృక్పథాలని మారుస్తాయా? Read More »

యాలాల చరిత్ర యాత్ర

వికారాబాద్‍ జిల్లా యాలాల మండలం యాలాలకు మధిర గ్రామం గోవిందరావుపేటలో కక్కెరవేణి నది ఒడ్డున దిబ్బమీద వరాహస్వామి విగ్రహం కనిపించిందని 2017లో సాక్షి దినపత్రికలో ఒక వార్త అచ్చయింది. రెండోసారి మా చరిత్రబృందం కో-కన్వీనర్‍ బీవీ భద్రగిరీశ్‍ సార్‍ ఈ శిల్పాన్ని చూసానని ఫొటోలు పంపాడు. ఈ అక్టోబర్‍ నెలలో దుర్గ నవరాత్రి ఉత్సవాలలో పాల్లొనడానికి యాలాల వెళ్ళిన ఘంటా మనోహర్‍ రెడ్డి గారు యాలాల్‍ గ్రామం నర్సింహులు, బస్వరాజ్‍, మహేశ్‍లతో కలిసి చూసిన యాలాల, గోవిందరావు …

యాలాల చరిత్ర యాత్ర Read More »

ప్రకృతే సౌందర్యం! 20 ప్రకృతే ఆనందం!!మేం మేమే! మీరు మీరే! మా మానాన మమ్మల్ని బతకనీయండి!

గుర్రం కాని గుర్రం! ఏనుగు కాని ఏనుగు!!జంతువులకు పేరు పెట్టడంలో మానవులుగా మీకు మీరేసాటి! ప్రపంచ స్థాయి భాషలన్నీంటిలో మా జంతువులకు పేర్లుండడం విచిత్రమే! ఈ నేర్పరితనం మీకెలా అబ్బిందో మాకు తెలియదు. చాలా పేర్లు గ్రీకు, లాటిన్‍, ఫ్రెంచ్‍ పదాలతో సంబంధాలు వుంటే, ఆంగ్లం వాటన్నీంటిని స్వంతం చేసుకొని, అవన్నీ ఆంగ్ల పదాలని యావత్‍ ప్రపంచాన్ని భ్రమింప చేస్తున్నది. తెల్లవాడి తెలివికన్నా, వాడు సృష్టించుకున్న ఆంగ్లభాష నేడు ప్రపంచాన్ని ఇంతగా శాసిస్తుందని ఎవరు ఊహించి వుండరు. …

ప్రకృతే సౌందర్యం! 20 ప్రకృతే ఆనందం!!మేం మేమే! మీరు మీరే! మా మానాన మమ్మల్ని బతకనీయండి! Read More »

కొబ్బరి చెట్టు – లాభాలు

‘‘కొబ్బరి చెట్టు కొడుకుతో సమానం’’ అనే సామెత మనం ఎక్కువగా కోస్తా జిల్లాలలో వింటాం. కొబ్బరిచెట్టు ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. అందుకే దానిని కల్పవ•క్షం అంటారు.ఒకప్పుడు కోస్తా జిల్లాలకే పరిమితమైన కొబ్బరి పంట ఇప్పుడు తెలంగాణాలో కూడా విస్తరిస్తుంది. కొబ్బరి చెట్టుకు నీరు బాగా అవసరం. తేమ వాతావరణం అనుకూలం. తెలంగాణా రాష్ట్రం అవతరించాక సాగునీటి కరువు దాదాపు తీరిపోయింది. ప్రాజెక్టుల ద్వారా పుష్కలంగా లభించే నీరు నేలను సారవంతం చేయడమే గాకుండా వాతావరణంలో తేమను కూడా …

కొబ్బరి చెట్టు – లాభాలు Read More »

చిట్టి

తన పేరు చిట్టి…. ఆరేళ్ళ వయసు ఉంటుందేమో. చిట్టీ వాళ్ళ అమ్మ నాన్న పొలం పనులు చేస్తుంటారు. చిట్టీ వాళ్ళది చిన్న పెంకుటిల్లు. వాళ్ళ ఇంటి ముందు పూల మొక్కలు చాలా ఉంటాయి. కానీ చిట్టీకి మాత్రం ఎదురుగా వున్న పెద్ద జామ చెట్టు అంటే చాలా ఇష్టం. చిట్టి పసికందుగా వున్నప్పుడు చిట్టీ వాళ్ళ అమ్మ దానికే ఉయ్యాల వేసేది. చిట్టి ఊగుతూ నిద్ర పోయేది. దానికి చిన్న చిన్న ఎర్రటి జామపళ్ళు కాస్తుంటాయి. అవి …

చిట్టి Read More »

సితార

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి.పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలు …

సితార Read More »