హెరిటేజ్‍ పునరుజ్జీవనం ‘ముడుమాల్‍ మెగాలిథిక్‍ మెనిహిర్స్’ డిజైన్‍ కాంపిటీషన్‍

డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ నవంబర్‍ 21 నుండి 25 వరకు నిర్వహించిన వరల్డ్ హెరిటేజ్‍ వీక్‍ సెలబ్రేషన్స్-2024 కార్యక్రమ ముగింపు రోజు సందర్భంగా వారసత్వ పరిరక్షణలో యువతను నిమగ్నం చేయడమే లక్ష్యంగా, గ్రాడ్యుయేట్‍ ఆర్కిటెక్చర్‍ విద్యార్థుల కోసం ‘‘పునరుజ్జీవన వారసత్వం’ – ‘ముడుమాల్‍ మెగాలిథిక్‍ మెనిహిర్స్’ పేరుతో డిజైన్‍ పోటీని నిర్వహించారు.


హెరిటేజ్‍ తెలంగాణ శాఖ సంచాలకులు ఎన్‍.శ్రీధర్‍ మార్గదర్శకాలను అనుసరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెరిటేజ్‍ తెలంగాణ శాఖ రెండు బ్రోచర్లు ‘‘సెంటినరీ హెరిటేజ్‍ మ్యూజియం’’, ‘‘బౌద్ధుల సైట్‍ మ్యూజియం, ఫణిగిరి’’ విడుదల చేసింది.


వేదకుమార్‍ మణికొండ మాట్లాడుతూ.. ముడమాల్‍ మహారాతియుగం మెనిర్స్ సైట్‍ యొక్క విశిష్టమైన సార్వత్రిక విలువను (ఓయువి), దాని చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలియచేశారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో ఈ ప్రదేశాన్ని చేర్చే లక్ష్యంతో పరిశోధన, డాక్యుమెంటేషన్‍ మరియు సంరక్షణ అధ్యయనాలను నిర్వహించడంలో తెలంగాణ వారసత్వ శాఖ మరియు దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ (డిహెచ్‍ఎటి) సంయుక్త, సహకారం ప్రయత్నాలను, వివరాలను మరియు విశిష్టతలను తెలియజేశారు. ఇలాంటి సంపదను భావితరాలకు అందించడం, మానవాళి ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేయడం, ప్రపంచ వారసత్వ పటంలో తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టడంలో వారసత్వ పరిరక్షణ కీలక పాత్ర పోషిస్తుందని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ చైర్మన్‍ వేదకుమార్‍ మణికొండ ఉద్ఘాటించారు.


డాక్టర్‍ దీపేంద్ర శర్మ మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రశంసించారు. రాష్ట్ర వారసత్వాన్ని పరిరక్షించడంలో తెలంగాణ వారసత్వ శాఖ చురుకైన చర్యలను అభినందించారు. ప్రభావ వంతమైన వారసత్వ పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ను ఆయన ప్రశంసించారు.


డాక్టర్‍ ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. వారసత్వ సంపదగా తెలంగాణ సాంస్కృతిక ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. సూక్ష్మ చిత్రాలు, గోడ చిత్రాలు, ఫిరంగులు, శాసనాలు మరియు కాలిగ్రఫీతో సహా దాని వైవిధ్యమైన సంపదను ప్రస్తావించారు. వీటన్నింటినీ జాగ్రత్తగా సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.


డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్తో కలిసి ఈ కార్యక్రమంలో హైదరాబాద్‍లోని జేబీఆర్‍ ఆర్కిటెక్చర్‍ కళాశాల నిర్వహణ బాధ్యత తీసుకోంది. ఎస్వీ కాలేజ్‍ ఆఫ్‍ ఆర్కిటెక్చర్‍,SPA,JNAFA,, ఉస్మానియా యూనివర్సిటీ, Architecture Department Students మరియు ఆక్స్ఫర్డ్ గ్రామర్‍ స్కూల్‍ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అవార్డుల ప్రదానోత్సవంతో జరిగింది. విజేతలను సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పార్టిసిపేషన్‍ సర్టిఫికెట్‍లను ప్రధానం చేశారు.


వారసత్వ పరిరక్షణలో విద్యావేత్తలు మరియు స్థానిక సంస్థలను భాగస్వామ్యం చేయడం మరియు యువతలో అవగాహన మరియు భాగస్వామ్య సంస్కృతిని పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతకు ఈ సహకార ప్రయత్నం నిదర్శనంగా నిలుస్తుంది.


బి. నారాయణ, నాగరాజ్‍, డిప్యూటీ డైరెక్టర్స్,హెరిటేజ్‍ తెలంగాణ విభాగం, డాక్టర్‍ ఈ.శివనాగిరెడ్డి, సిఇఒ-ప్లీచ్‍ ఇండియా, ఇంటాక్‍ న్యూఢిల్లీ గవర్నింగ్‍ కౌన్సిల్‍ సభ్యుడు డాక్టర్‍ దీపేంద్ర శర్మ, కోటయ్య వింజమూరి, ఏఎస్‍ఐ, అసిస్టెంట్‍ ప్రొఫెసర్‍, ఓయు జయశ్రీ, మరియు ఇంటాక్‍ హైదరాబాద్‍ చాప్టర్‍ కన్వీనర్‍ పి. అనురాధారెడ్డి, ఫోటోగ్రాఫర్‍ రమేశ్‍ మరియు అసిస్టెంట్‍ డైరెక్టర్‍ నర్సింగ్‍రావు, తదితరులు పాల్గొన్నారు. హెరిటేజ్‍ తెలంగాణ శాఖ డిప్యూటీ డైరెక్టర్‍ నాగరాజ్‍ సభికులకు ధన్యవాదం తెలిపారు.

  • కె. శ్యామల

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *