ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శిలా మరియు ఖనిజ సంపద

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆంధప్రదేశ్‍ యొక్క కోస్తా ప్రాంతంలోని మధ్య భాగంలో ఉంటుంది. ఈ జిల్లాకి ఈశాన్యంలో విశాఖపట్నం జిల్లా, పశ్చిమలో పశ్చిమ గోదావరి జిల్లా, వాయువ్యంలో ఖమ్మం జిల్లా మరియు దక్షిణం, తూర్పులో బంగాళాఖాతం కలదు. కాకినాడ ఈ జిల్లాకు హెడ్‍ క్వార్టర్‍. ఇది కాకుండా ముఖ్య పట్టణాలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, పిఠాపురం. కోలకత్తా-చెన్నై (NH-5) ఈ పట్టణాల గుండా వెళ్తుంది. సముద్రతీరాన్ని ఆనుకొని, గౌతమి గోదావరి పక్కన ఉన్న చిన్న భాగం యానం. ఒకప్పుడు ఫ్రెంచ్‍ కాలనీగా ఉండేది. కానీ ఇప్పుడు ఇది పుదుచ్చేరికి చెందిన ప్రాంతంగా నిర్ధారించారు. ఈ జిల్లాలోని భూభాగాన్ని ఫిసియే గ్రాఫికల్‍గా మూడు భాగాలుగా గుర్తించబడినది. అవి 1. డెల్టా ప్రాంతం – దక్షిణంలో కలదు. 2. మధ్యప్రాంతంలో మెట్ట ప్రాంతం 3. అడవి మరియు కొండలుగా ఉన్న ఈస్టర్న్ ఘాట్‍ ప్రాంతం. ఈ జిల్లాలో ముఖ్యనది గోదావరి. ఇది ఉత్తర భాగం గుండా జిల్లాలోకి ప్రవేశించి, దక్షిణ దిశగా 125 కి.మీ. ప్రవహిస్తూ తరువాత సముద్రంలో కలిసిపోతుంది. రాజమండ్రికి దక్షిణంలో రెండు పాయలుగా చీలుతుంది. వశిస్టా గోదావరి, గౌతమి గోదావరి. ఈ నది యొక్క ప్రముఖమైన ఉపనదులు పాములేరు, సీలేరు. పోలవరం, అలుమేరువాగు, గండివాడు. ఈ జిల్లాలోని ఎత్తైన ప్రాంతం 641 మీ. అతి తక్కువ ఎత్తుగల ప్రాంతం 65 మీ. MSLపైన కలదు. ఈ జిల్లాలోని ప్రాంతంలో డ్రైనేజ్‍ ప్యాటర్న్ సబ్‍డెండ్రిటిక్‍ నుండి ప్యారెలెల్‍గా ఉంటుంది.


ఈ జిల్లా యొక్క ఉత్తర ప్రాంతంలో ఈస్ట్ర్న్ ఘాట్‍ సూపర్‍ గ్రూప్‍కు చెందిన కొండలైట్‍, చార్నోకైట్‍, మిగ్నటైట్‍ గ్రూప్‍లకు చెందిన శిలలను చూడగలము. కొండలైట్‍ గ్రూప్‍ యొక్క శిలలు ముఖ్యంగా క్వార్ట్జ్‍ – గార్నెట్‍ – సిల్లిమనైట్‍ – గ్రాఫైట్‍ నైస్‍, క్వార్ట్జైట్‍, కాల్క్ గ్రానులైట్‍ నైస్‍ మరియు సాఫరిన్‍తో కూడిన క్వార్ట్జో ఫెల్స్ పాతిక్‍నైస్‍. చార్నోకైట్‍ గ్రూప్‍కు చెందిన శిలలు ముఖ్యంగా, ఎసిడ్‍, ఇంటర్‍మీడియట్‍, బేసిక్‍ చార్నోకైట్స్. మిగ్మటైట్‍ గ్రూప్‍కు చెందిన శిలలు పార్సిరోబ్లాస్టిక్‍ గ్రానిటాయిడ్‍ నైస్‍, గార్నెటిఫెర్రస్‍ -క్వార్ట్జోఫెల్స్ పాతిక్‍నైస్‍ (లెప్టినైట్‍), గార్నెట్‍ – బయోటైట్‍ – హైపర్‍ స్తీన్‍ నైస్‍ మరియు క్వార్ట్జో – ఫెల్స్ పాతిక్‍ మొబిలిజెట్స్.


ఈ ఆర్‍ క్యన్‍ పెలియోప్రొటిరోజోయక్‍కు చెందిన క్రిస్టలైన్స్ పైన అప్పర్‍ గోండ వానా యొక్క తిరుపతి సాండ్‍ స్టోన్‍ని చూడగలము. ఇది ఒక ట్రాన్షిశనల్‍ వాతావరణంలో డిపాజిట్‍ అయినది కోస్తా ప్రాంతంలో. ఈ ఫార్మేశన్‍లో సాండ్‍స్టోన్‍తో పాటు కంగ్లామరేట్‍, క్లే జోన్స్ను చూడగలము. క్లే జోన్స్లో టిలోఫైలమ్‍ ప్లాంట్‍ ఫాసిల్‍ని చూడగలము. అన్నవరం ప్రాంతంలో గోండ్‍వానా శిలల్లో, మెరైన్‍ ఫాసిల్స్ని రిపోర్ట్ చేయబడినవి. రాజమహేంద్ర వరంకు 2 కి.మీ.
ఉత్తర, తూర్పు దిశలలో డెక్కన్‍ ట్రాప్స్ యొక్క బేసిక్‍ ప్లోస్‍ని చూడగలము. ఇందులో లైమ్‍స్టోన్‍ ఇంటర్‍ ట్రోపియన్స్ రూపంలో గాస్ట్రోపాడ్‍, లీమెలి బ్రాంచ్‍ ఫాసిల్స్తో కూడి యున్నది. ఇవి కోటిలింగాల, కోరుకొండ, కాటేరు ప్రాంతాలలో కలవు. రాజమండ్రి ఫార్మేశన్‍లో మేయప్లై యొ సీన్‍కు చెందిన సాండ్‍స్టోన్‍, గ్రిట్‍, కంగ్లామరేట్‍ కలదు. వీటిపైన కరెంట్‍ బెడ్డెడ్‍ సాండ్‍ స్టోన్‍, క్లే బెడ్స్శేల్‍ బ్యాండ్స్తో కూడి యున్నది. ఈ ఫార్మేశన్‍ కేరళలోని వర్క లా బెడ్స్ మరియు తమిళనాడులోని కడ్డలూరు సాండ్‍స్టోన్‍తో కొరిలేట్‍ చేయబడినది. డెల్టా ప్రాంతంలో ఫ్లూ వియల్‍ మెరైన్‍ మరియు ఫ్లూవియొ మెరైన్‍ సెడిమెంట్స్ క్వాటర్‍నేరికి చెందినది.


ఖనిజ సంపద :
ఈ జిల్లాలో గ్రాఫైట్‍, టంగ్‍స్టన్‍, బాక్సైట్‍, క్లే, డైమెన్షన్‍ స్టోన్‍ నిక్షేపాలు పుష్కలంగా వున్నవి.
గ్రాఫైట్‍ :
గ్రాఫైట్‍ ఖనిజం కొండలైట్‍ గ్రూప్‍కు చెందిన గ్రాఫైట్‍ నైస్‍లో మరియు కొన్ని ప్రాంతాలలో క్వార్ట్జైట్స్లో దొరుకుతుంది. కొన్ని జోన్స్ ఎక్కడైతే క్వార్ట్జో పెల్స్ పాతిక్‍ ఇంజెక్షెన్స్, పెగ్మటైట్స్, క్వార్ట్జ్‍వీన్స్ కలవో అక్కడ వీటిలో రీ మొబిలైజ్‍ అయి లేన్సెస్‍, పాకెట్స్ రూపంలో గ్రాఫైట్‍ దొరుకుతుంది. ఈ గ్రాఫైట్‍, క్రిస్ట్లైన్‍ మరియు ఫ్లేకీగా వుంటుంది. ఈ లోగ్రేడ్‍ గ్రాఫైట్‍ డిపాజిట్స్ ఈ జిల్లాలో లీనియర్‍, కన్‍ఫర్మెబుల్‍ బ్యాండ్స్ రూపంలో 200 మీ. నుండి 750 మీ పొడవు గలిగి యున్నవి. వీటి విడ్త్ 5 మీ నుండి 12 మీ వరకు కలవు. ఈ గ్రాఫైట్‍ దొరికే ముఖ్యమైన ప్రాంతాలు బూరుగుబండ, తపసికొండ, మర్రికొండ, కొక్కిరపల్లె, రెడ్డిబొడేర.


టంగ్‍స్టన్‍ :
టంగ్‍స్టన్‍ ఈ ప్రాంతంలో కొండలైట్‍ గ్రూప్‍కు చెందిన గ్రాఫైట్‍ నైస్‍లో దొరుకుతుంది. ఇక్కడ టంగ్‍స్టన్‍ యొక్క ఖనిజం వోల్‍ఫ్రమైట్‍. ఇది ఈ ప్రాంతంలో క్వార్ట్జ్‍ రిచ్‍పెగ్మెటైట్స్లో వీన్స్ (0.3-3 cm తిక్‍) మరియు నెస్టస్ (5 to 15 cm) రూపంలో దొరుకును. అక్కడక్కడ వోల్‍ఫ్రమైట్‍లంప్స్ను కూడా చూడగలము. గ్రాఫైట్‍ నైస్‍లో టంగ్‍స్టన్‍ మినరలైజేషన్‍ 360 మీ పొడవు, 2 నుండి 12 మీ. వెడల్పుగల లేన్సెస్‍లో 0.1 నుండి 0.2% WO3ని చూడగలము. తపసికొండలో మినరలైజేషన్‍ క్వార్టెజ్‍ వీన్స్లో చూడగలం. ఈ జోన్‍ 5 నుండి 10 మీ. వెడల్పు వుంటుంది. పైడి పుట్ట ప్రాంతం 1.5 కి.మీ. తపసికొండకు దక్షిణంలో వుంటుంది. ఇక్కడ మినరలైజేషన్‍ 1.0 నుండి 2.0 మీ. వెడల్పుగల జోన్‍ కలదు. ఇక్కడ మినరలైజేషన్‍ ఫోల్డ్ ఎక్సిస్‍ కంట్రోల్‍ చేస్తుంది. NMDC టంగ్స్టన్‍ మినరలైజేషన్‍ని 1500 మీ పొడవు గలిగి, 10 మీ. వెడల్పుగల జోన్‍లో 0.1 నుండి 0.2% ఖనిజం ఉన్నట్టు నిర్ధారించారు.
బూరుగుబండ – తపసికొండ మినరల్‍ బెల్ట్ 22 కి.మీ. పొడువు కలదు. ఇందులో చిన్నచిన్న ఫైట్‍నైస్‍ లెన్సెస్‍, బ్యాండ్స్ కలవు. మరియు వీటిలో టంగ్స్టన్‍ మినరలైజేషన్‍ కలదు. ఈ బెల్టులో టంగ్స్టన్‍ ఖనిజం చాలా వరకు వోల్‍ఫ్రమైట్‍ (ఫెబ్బరైట్‍ వెరైటి). ఈ ఖనిజం గోధుమరంగు మరియు నలుపు రంగులో ఉంటుంది. బాక్స్ వర్క్స్, నెస్టస్ రూపంలో దొరుకుతుంది. వీటి మార్జిన్స్లో వోల్‍ఫ్రమైట్‍ని శీలైట్‍ రీప్లేస్‍ చేస్తుంది. జి.ఎస్‍.ఐ బెనిఫిషియేషన్‍ టెస్టులు జరిపి బూరుగుబండ బెల్ట్లో వోల్‍ఫ్రమైట్‍ 45% రికవరీ చేసింది.


బాక్సైట్‍:
బాక్సైట్‍ క్యాప్పింగ్స్ రూపంలో కొండలైట్‍, చార్నొకైట్‍ గ్రూప్‍కు చెందిన శిలలపైన 1090 నుండి 1445 మీ MSL పైన దొరుకుతుంది. ఈస్ట్కోస్ట్ బాక్సైట్‍తో సిలికా తక్కువ మొత్తంలో ఉంటుంది. మరియు ఐరన్‍ ఆక్సైడ్‍ ఎక్కువగా ఉంటుంది. డెక్కన్‍ ట్రాప్‍ బాక్సైట్‍తో పోలుస్తే ఈ క్యాప్పింగ్స్ కొనికల్‍, లీనియర్‍ స్కార్ప్స్‍, పీక్స్గా ఒక మోస్తారి స్లోప్‍తో కూడిన ప్లాటూపైన చూడగలము. ఈ బాక్సైట్‍లో ఊలిటిక్‍, పిసోలిటిక్‍ స్టక్చర్స్ ఉండవు. ఈ బాక్సైట్‍లో ముఖ్యమైన ఖనిజం గిబ్‍సైట్‍. ఇది కాకుండా వేరే ఖనిజాలు హెమటైట్స్ లిమొనైట్‍, గొతైట్‍ మరియు క్లే. బాక్సైట్‍ క్యాపింగ్స్ని మూడు ప్రాంతాలుగావిభజించవచ్చును. 1 అనంతగిరి గ్రూపు 2. చింతపల్లి గ్రూపు 3. గుర్తేడు గ్రూపు. మొదటి రెండు గ్రూపులను సెపరేట్‍ బెల్ట్గా గుర్తించబడినది. గుర్తేడు గ్రూప్‍ రెండు సబ్‍గ్రూప్‍లుగా విభజించబడినది. 1. కాటంరాజు కొండ. ఇందులో రెండు బ్లాకులు కలవు. ఇవి 1.8 చదరపు కి.మీలో విస్తరించి యున్నది. మొత్తం రిజర్వేస్‍ 42.60 మీ MT. దీని ఏవరేజ్‍గ్రేడ్‍ 46.76% AI2O3 , దీని విడ్త్ 8 మీ నుండి 14.62 మీ ఉంటుంది.


క్లే నిక్షేపాలు:
క్లే నిక్షేపాలు దౌలేశ్వరం, రాజోలు, ఎర్రపాలెం, రామచంద్రాపురం, పెద్దాపురం, జగ్గంపేట, నరేంద్రపురం గ్రామాలలో రాజమండ్రి సాండ్‍ స్టోన్‍లో ఇంటర్‍ బెడ్స్ రూపంలో దొరుకుతుంది. అక్కడక్కడ కంగ్లామరేట్స్లో కూడా చూడవచ్చును. ఈ బెడ్స్ తిక్‍నెస్‍ 0.3 మీ నుండి 7.1 మీ వరకు వుంటుంది. దీని రిసోర్స్ 11.31 మీగా నిర్ధారించారు. ఈ క్లే తెలుపు, పింక్‍, గ్రే రంగులలో ఉంటుంది. ఈ క్లే ముఖ్యంగా కేయొలినైట్‍ ఖనిజం. ఈ క్లేని, సెరామిక్‍, పేంట్‍ ఎక్స్పోలసివ్‍, పాలిటెక్నిక్‍ పరిశ్రమలల్లో ఉపయోగిస్తారు. రాజమండ్రి సాండ్‍ స్టోన్‍ని కన్స్ట్రక్షన్‍ పరిశ్రమలో ఉపయోగిస్తారు.

  • కమతం మహేందర్‍ రెడ్డి
    ఎ : 90320 12955

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *