నాగ్‍పూర్ జూలో H5N1 బర్డ్ఫ్లూతో 3 పులులు, 1 చిరుతపులి మ•తి చెందడంతో అధికారులు ఆందోళన చెందారు. మానవ ఆరోగ్యం మరియు వన్యప్రాణులతో సహా వివిధ రంగాలలోని ప్రయత్నాలను ఏకీక•తం చేయడానికి ఒక-ఆరోగ్య విధానాన్ని కోరడానికి అధికారులు తక్షణ శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు.
నాగ్‍పూర్‍లోని బాలాసాహెబ్ థాకరే గోరేవాడ ఇంటర్నేషనల్ జూలాజికల్ పార్క్లో సాధారణంగా ‘బర్డ్ ఫ్లూ’ అని పిలువబడే హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‍ఫ్లుఎంజా (HPAI) H5N1 వైరస్ బారిన పడి మూడు పులులు మరియు ఒక చిరుత మరణించింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, మానవ-జంతు సంఘర్షణల తరువాత, చంద్రపూర్ నుండి 2024 డిసెంబర్‍లో జంతువులను అడవి నుండి రక్షించారు.
భారతదేశంలో బందీలుగా ఉన్న వన్యప్రాణుల మరణాలకు కారణమైన వ్యాధికి ఇది మొదటి ఉదాహరణ. ఈ పరిణామం మహారాష్ట్రలోని ఇతర జంతు ప్రదర్శన శాలలకు రెడ్ అలర్ట్ జారీ చేయవలసి వచ్చింది. వెంటనే నిలిపివేయాలని అధికారులు పిలుపునిచ్చారు. జూ జారీ చేసిన లేఖ ప్రకారం, మరణాల తరువాత, డిసెంబర్‍లో భోపాల్‍లోని ICAR-నేషనల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‍కు నమూనాలను పంపినట్లు దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) చంద్రశేఖరన్ బాలా ఎన్ అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్కు 2024 డిసెంబర్ 31న తెలియజేశారు. ఇటీవలి కాలంలో పౌల్ట్రీ పక్షులలో మొదటిసారిగా నివేదించబడిన H5N1, 500 జాతులకు పైగా, కనీసం 70 క్షీరద జాతులకు సోకడానికి ‘‘వన్యప్రాణులలోకి చిందించబడింది’’ అని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
ఈ వైరస్ ఐదు ఖండాల్లోని 108 దేశాలలో తన ఉనికిని స్థాపించింది. ధ్రువ ఎలుగుబంట్లు, అంటార్కిటికా పెంగ్విన్‍లకు సోకడానికి ప్రపంచంలోని చాలా మూలాలకు చేరుకుంది.
జనవరి 1, 2025న ICAR-NIHSAD నాలుగు పులులు మరియు రెండు చిరుతపులిల నమూనాలను స్వీకరించింది. మూడు పులులు మరియు రెండు చిరుతపులులు H5N1 ఏవియన్ ఇన్‍ఫ్లుఎంజా వైరస్‍కు పాజిటివ్ పరీక్షించబడ్డాయి. అయితే ఒక మగ పులికి నెగెటివ్ వచ్చింది. ఈ సంఘటన జంతు ప్రదర్శనశాలలు, రెస్క్యూ సెంటర్లు మరియు ట్రాన్సిట్ ట్రీట్‍మెంట్ సెంటర్‍లలో ఏవియన్ ఇన్‍ఫ్లుఎంజా (H5N1) వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన చర్యలను వివరిస్తూ వైల్డ్లైఫ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (WRTC) ఒక సలహాను జారీ చేయడానికి ప్రేరేపించిందని లేఖలో పేర్కొన్నారు.
ఇన్ఫెక్షన్ యొక్క మూలం గురించి, స్ట్రెయిన్ 2.3.4.4 b అనే దాని గురించి మాట్లాడలేదు. ఈ జాతి ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణులు మరియు పశువులలో మరణాలు మరియు వ్యాధిని కలిగించింది. మానవులకు కూడా సోకింది.
వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి WRTC ఒక సమగ్ర సలహా, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ‘‘అడవి జంతువులలో H5N1 వ్యాప్తి, ముందస్తుగా గుర్తించడం కోసం రాష్ట్రం, పొరుగు రాష్ట్రాల్లోని జంతుప్రదర్శనశాలలు, రెస్క్యూ కేంద్రాలకు దీనిని ఫార్వార్డ్ చేయవచ్చు’’ అని WRTC నుండి గోరేవాడ జూ CEO కి ఒక లేఖలో పేర్కొంది.
యాక్షన్ ప్లాన్‍లో వలలు, కవర్ల వాడకంతో పక్షులు ఇతర జంతువులలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి బయోసెక్యూరిటీ చర్యలు ఉన్నాయి. పరిశుభ్రతను నిర్వహించడం, పాదరక్షలు, పరికరా లను క్రిమిసంహారక చేయడం తదితర అంశాలు యాక్షన్ ప్లాన్‍లో ఉన్నాయి.
తెలియని లేదా ధృవీకరించని మూలాల నుండి మాంసాహారులకు పచ్చి పౌల్ట్రీ లేదా ఇతర మాంస ఉత్పత్తులను తినిపించడాన్ని నివారించడం కూడా ఈ చర్యలలో ఉంటుంది. జంతువుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని WRTC పిలుపునిచ్చింది. ముఖ్యంగా అసాధారణ ప్రవర్తన సంకేతాలు లేదా ఏవియన్ ఇన్‍ఫ్ల్లూఎంజాను సూచించే లక్షణాలు. జనవరి 3న, పశుసంవర్ధక శాఖ కమిషనర్, అభిజిత్ మిత్ర, సోకిన లేదా రోగలక్షణ పులులు, ఇతర పిల్లి జాతులు లేదా ఏదైనా ఇతర జంతువులను మరింత వ్యాప్తి చెందకుండా వేరుచేయాలని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
తాత్కాలికంగా మూసివేయాలని, బయోసెక్యూరిటీ చర్యలను పెంచాలని నిర్దేశించబడింది. HPAI కి పాజిటివ్ పరీక్షించిన పులులు, చిరుతపులుల మరణాలు వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతున్నాయని లేఖ పేర్కొంది.
‘‘జంతువు-మానవ’’ ఆరోగ్యం రెండింటికీ ప్రమాదాలను తగ్గించడానికి పరిస్థితి. తక్షణ శ్రద్ధ అవసరం. సమస్యను సమగ్రంగా పరిష్కరించడానికి మానవ ఆరోగ్యం, వన్యప్రాణులతో సహా వివిధ రంగాలలోని ప్రయత్నాలను ఏకీకృతం చేస్తూ, ‘వన్-హెల్త్’ విధానాన్ని అమలు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
-హిమాన్షు నిత్నావేర్
(డౌన్ టు ఎర్త్ సౌజన్యంతో)
అనువాదం: ఎ. శ్రీహరి