38వ సూరజ్‍కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్టస్ ఫెయిర్ 2025 ఫిబ్రవరి 7 నుండి 23, 2025 వరకు ఫరీదాబాద్ (హర్యానా)లోని సూరజ్‍కుండ్‍లో జరుగుతుంది. కేంద్ర పర్యాటక, సంస్కృతి, విదేశీ వ్యవహారాలు, జౌళి, ICCR మరియు హర్యానా ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే ఈ ఫెయిర్, భారతదేశం అంతటా, అలాగే ఇతర దేశాల నుండి వచ్చిన క్రాఫ్టస్, టెక్స్టైల్స్, సంస్కృతి మరియు వంటకాల యొక్క అత్యుత్తమ సంప్రదాయాలను ప్రదర్శిస్తుంది. కొన్ని సంవత్సరాలుగా, ఈ ప్రాంతం యొక్క పర్యాటక క్యాలెండర్‍లో ఈ ఫెయిర్ ఒక ప్రముఖ కార్యక్రమంగా మారింది.

37వ సూరజ్‍కుండ్ ఫెయిర్ 2024లో 45 కంటే ఎక్కువ దేశాలు మరియు 592 మంది విదేశీ కళాకారులు పాల్గొన్నారు. ఇది 1.3 మిలియన్లకు పైగా సందర్శకులను ఆకర్షించింది. 38వ సూరజ్‍కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్టస్ ఫెయిర్ 2025 కోసం, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (BIMSTEC)ని భాగస్వామి సంస్థగా ఆహ్వానించాలని ప్రతిపాదించబడింది.
సాంస్కృతిక బృందాలను (సుమారు 10 నుండి 15 మంది సభ్యులు), వారి వారసత్వాన్ని ప్రదర్శించగల కళాకారులను పంపడం ద్వారా ఆ దేశాలు ఫెయిర్‍లో పాల్గొనవచ్చని మేము మీకు తెలియజేస్తున్నాము. సూరజ్‍కుండ్ మేళా అథారిటీ వారు ఢిల్లీ విమానాశ్రయం నుండి ఫెయిర్ గ్రౌండ్‍లకు ఉచిత వసతి, భోజనం, రవాణా సౌకర్యాన్ని అందిస్తుంది. మెయిల్: haryanatourism74 @gmail.com.
సూరజ్‍కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్టస్ మేళా ప్రపంచ వైవిధ్యాన్ని అనుభవించడానికి ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఇది విభిన్న సంస్కృతుల సంగమం. సూరజ్‍కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్టస్ మేళా సందర్శకులు హస్తకళలను, వస్త్రాల షాపింగ్ చేయడానికి, సాంస్కృతిక ప్రదర్శనలను, మరియు వంటకాల శ్రేణిని ఆస్వాదించడానికి అద్భుతమైన ఈవెంట్.
- దక్కన్‍న్యూస్
ఎ : 9030 6262 88