యోగాతో లభించే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహించడానికి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంను ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు.
యోగాతో పొందే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం ఈ రోజు లక్ష్యం. ‘‘యోగం’’ అనే పదం సంస్క•త మూలం ‘‘యుజ్’’ నుండి వచ్చింది. దీని అర్థం ‘‘చేరడం,’’ ‘‘కలయిక’’, లేదా ‘‘ఏకం చేయడం’’. మనస్సు – శరీరం, లేదా ఆలోచనలు – చర్యలు. సంయమనం- సంత•ప్తి. మానవులు – ప్రక•తి మధ్య సామరస్యాన్ని యోగా ప్రతిబింబిస్తుంది. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు. శ్వాస వ్యాయామాలు కూడా ఉంటాయి. ఇది ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడానికి సహాయపడుతాయి.

అంతర్జాతీయ యోగా దినోత్సవం చరిత్ర
యోగా మూలం పురాతన భారతదేశం నుండి ఉన్నప్పటికీ, సెప్టెంబర్ 2014లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. యూఎన్జీఏ 69వ సెషన్లో ప్రధాని ప్రసంగిస్తూ యోగా మన ప్రాచీన సంప్రదాయం నుంచి మనకు లభించిన అమూల్యమైన కానుక అని అన్నారు. ‘మనస్సు, శరీరం, ఆలోచన, కార్యాచరణల ఐక్యతను యోగ ప్రతిబింబిస్తుంది. యోగా (yoga) అనేది ఒక సంపూర్ణ జీవన విధానం. అది మన ఆరోగ్యానికి, మన శ్రేయస్సుకు చాలా అవసరమైనది. యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు. ఇది మీతో, ప్రపంచంతో, ప్రకృతితో ఏకత్వ భావనను కనుగొనడానికి ఒక మార్గం’’ అని మోదీ వివరించారు. ఆ తరువాత, యుఎన్జిఎ 2014 డిసెంబర్ 11న జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది.
2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్
ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగా ఆరోగ్యకరమైన ప్రపంచ జనాభా కోసం భారతదేశం యొక్క దార్శనికతను తన నెలవారీ ‘‘మన్ కీ బాత్’’ రేడియో ప్రసారంలో పంచుకుంటూ, మోడీ మాట్లాడుతూ, ‘‘2025 యోగా దినోత్సవం యొక్క ఇతివృత్తం ‘ఒక భూమి కోసం యోగా, ఒక ఆరోగ్యం’ అని ఉంచబడింది. అంటే, యోగా ద్వారా మొత్తం ప్రపంచాన్ని ఆరోగ్యంగా మార్చాలని మేము కోరుకుంటున్నాము.’’
- కె. సచిన్,
ఎ : 86866 64949