ఇందిరా మహిళా శక్తి బజారులో సింగరేణి సేవా సమితి స్టాల్‍ను సందర్శించిన ప్రపంచ సుందరీమణులు

ప్రపంచ అందాల పోటీల నేపథ్యంలో మే 22న హైదరాబాద్‍లోని శిల్పారామాన్ని సందర్శించిన అనంతరం ప్రపంచ సుందరీమణులు పక్కనే ఉన్న ఇందిరా మహిళా శక్తి బజారును సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి స్వయం ఉత్పత్తిదారుల వస్తు విక్రయశాలను కూడా వారు సందర్శించారు.


వివిధ ఏరియాల నుండి సింగరేణి సేవా సమితిలో శిక్షణ పొందిన మహిళలు తయారుచేసి విక్రయశాలలో ఉంచిన బ్యాగులు, చేతి పర్సులు, మగ్గం వర్క్ చేసిన దుస్తులను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విక్రయశాలలో ఉన్న స్వయం ఉత్పత్తి యూనిట్ల మహిళలతో ముచ్చటించి సెల్ఫీలు దిగారు. వివిధ ఉత్పత్తుల తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు.


మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు చక్కగా ఉన్నాయి అంటూ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ స్థాయి సుందరీమణుల నుంచి ప్రశంసలు అందుకోవడం మాకు గర్వకారణమని సమితి సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.


తమకు సింగరేణి సేవా సమితి ద్వారా శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించిన సింగరేణి యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి స్టాల్‍ ఏర్పాటుకు అవకాశం కల్పించిన సీఎండీ ఎన్‍.బలరామ్‍కు స్టాల్‍లో ఉన్న సేవా మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.


అలాగే మారుమూల ప్రాంతంలో ఉన్న తమకు హైదరాబాద్‍లో స్టాల్‍తో పాటు వసతి, రవాణా సదుపాయాన్ని కల్పించడమే కాకుండా ప్రపంచ సుందరీ మణులను ఇక్కడకు తీసుకొచ్చి తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించిన సెర్ఫ్ సీఈవో శ్రీమతి దివ్యా దేవరాజన్‍కు ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *