ప్రమాదకరమైన పురుగుమందు ‘క్లోర్‍పైరిఫోస్’పై మినహాయింపులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా నిషేధం విధించాలని తిరిగి ప్రజలు కోరుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, నీరు, మానవ రక్తం, తల్లి పాలలో కూడా క్లోర్‍పైరిఫోస్ అవశేషాలు కనుగొనబడ్డాయి. 2003లో జరిగిన ఒక భారతీయ అధ్యయనం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన భద్రతా పరిమితి కంటే 41 రెట్లు ఎక్కువ స్థాయిలను నివేదించింది.
ర్‍పైరిఫోస్ వంటి ప్రమాదకర పురుగుమందులను పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా నిషేధించాలనే డిమాండ్ మరోసారి ప్రారంభమైంది. స్టాక్‍హోమ్ కన్వెన్షన్ కింద జెనీవాలో జరుగుతున్న సమావేశంలో, పెస్టిసైడ్ యాక్షన్ నెట్‍వర్క్ (పాన్) ఇంటర్నేషనల్ శాస్త్రవేత్తలు, ప్రతినిధులు ఈ రసాయన పురుగుమందును ఎటువంటి మినహాయింపులు లేకుండా అనుబంధం A లో జాబితా చేయాలని సిఫార్సు చేశారు.
Annex A అనేది స్టాక్ హోమ్ కన్వెన్షన్ యొక్క అధికారిక అనుబంధం. ఇది ప్రపంచ వ్యాప్తంగా పూర్తిగా నిషేధించ బడాలి లేదా తొలగించబడాలి అనే ప్రమాదకరమైన రసాయనాలను జాబితా చేస్తుంది. Annex A లో మినహాయింపులు లేకుండా చేర్చబడిన రసాయనాలు లేదా పురుగుమందులు ప్రపంచ ఉత్పత్తి, ఉపయోగం, దిగుమతి మరియు ఎగుమతి నుండి నిషేధించబడ్డాయి.
స్టాక్‍హోమ్ కన్వెన్షన్ అనేది పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ (POPs) ఉత్పత్తి, వినియోగం, వాణిజ్యం, ఉద్గారాలను దశలవారీగా తొలగించడం లేదా కఠినంగా నియంత్రించడం లక్ష్యంగా పెట్టుకున్న అంతర్జాతీయ ఒప్పందం. స్విట్జర్లాండ్‍లోని జెనీవాలో జరుగుతున్న ప్రస్తుత సమావేశం ఏప్రిల్ 28న ప్రారంభమై మే 9, 2025 వరకు కొనసాగింది.
సమీక్షా సమావేశంలో, పాన్ ఇంటర్నేషనల్ సీనియర్ శాస్త్రవేత్త ఎమిలీ మార్క్వెజ్ మాట్లాడుతూ.. తక్కువ స్థాయిలో క్లోర్‍పైరిఫోస్ కూడా పిల్లల మెదడు అభివ•ద్ధిపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని, జీవితాంతం పరిణామాలను కలిగిస్తుందని అన్నారు. ఈ పురుగుమందు వ్యవసాయ క్షేత్రాలకే పరిమితం కాకుండా ఆర్కిటిక్ వంటి మారుమూల ప్రాంతాలలో కూడా కనుగొనబడిందని, దీని దీర్ఘకాలిక పర్యావరణ స్థిరత్వాన్ని హైలైట్ చేస్తుందని ఆమె పేర్కొన్నారు.
అదనంగా, స్టాక్‍హోమ్ కన్వెన్షన్ కింద స్థాపించబడిన POPs రివ్యూ కమిటీ (POPRC)నుండి వచ్చిన ఫలితాల ద్వారా పురుగు మందును నిషేధించాలనే వాదనలు బలపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా దశలవారీ నిషేధానికి క్లోర్‍పైరిఫోస్ అన్ని ప్రమాణాలను తీరుస్తుందని కమిటీ నిర్ధారించింది.
ఇంతలో, పాన్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడి దిలీప్ కుమార్ భారతదేశంలో దాని ప్రభావాన్ని హైలైట్ చేస్తూ, వ్యవసాయ ఉత్పత్తులు, నీరు, మానవ రక్తం మరియు, తల్లి పాలలో కూడా క్లోర్‍పైరిఫోస్ అవశేషాలు కనుగొనబడ్డాయని వెల్లడించారు. 2003 భారతీయ అధ్యయనం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన భద్రతా పరిమితి కంటే 41 రెట్లు ఎక్కువగా ఉందని నివేదించింది.
ఈ రసాయనం రైతులు, వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా, అంతర్జాతీయ వాణిజ్యంలో జాడలు భారతదేశ వ్యవసాయ ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీస్తాయి.
పాన్ ఆసియా పసిఫిక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అలియా డయానా అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల ప్రత్యేక ఆందోళన వ్యక్తం చేశారు: ‘‘ఇటువంటి పురుగుమందులు దుర్బల వర్గాలను అసమానంగా ప్రభావితం చేస్తాయి. పుట్టబోయే పిల్లలు కూడా ప్రమాదంలో ఉన్నారు, తెలివితేటలు, జ్ఞాపకశక్తికి శాశ్వత నష్టం వాటిల్లుతోంది.’’
క్లోర్‍పైరిఫోస్ యొక్క ప్రస్తుత ఉపయోగాలన్నింటికీ వ్యవసాయ-పర్యావరణ మరియు సేంద్రీయ తెగులు నిర్వహణ పద్ధతులతో సహా సురక్షితమైన, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయాలు ఇప్పటికే ఉన్నాయని మూడు సంస్థలు నొక్కిచెప్పాయి. అందువల్ల, దాని నిరంతర ఉపయోగం కోసం ఎటువంటి శాస్త్రీయ లేదా వాణిజ్య సమర్థన లేదు.
స్టాక్‍హోమ్ కన్వెన్షన్ యొక్క అనుబంధం A లో మినహా యింపులు లేకుండా క్లోర్‍పైరిఫోస్‍ను చేర్చాలని, ఈ విషపూరిత పురుగుమందుపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉండేలా చూడాలని వక్తలు ఏకగ్రీవంగా కోరారు.
-వివేక్ మిశ్రా
అనువాదం: దక్కన్ న్యూస్