చెమట చుక్కలకు తర్ఫీదు యువతకు దేశ, విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాలపై సింగరేణి వినూత్న కార్యక్రమం

సింగరేణి విస్తరించి ఉన్న కోల్‍ బెల్ట్ ప్రాంతంలోని సింగరేణి ఉద్యోగుల పిల్లలు, స్థానిక యువతకు దేశ, విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించి వారిని మంచి స్థానాల్లో నిలిపేలా ప్రోత్సహించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎ.రేవంత్‍ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు ‘‘చెమట చుక్కలకు తర్ఫీదు’’ పేరిట సింగరేణి యాజమాన్యం ఈ పథకానికి రూపకల్పన చేసింది. రాష్ట్ర సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్‍ గాంధీ విగ్రహ ప్రాంగణంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, మహ్మద్‍ అలీ షబ్బీర్‍ ఈ పథకం లోగోను ఆవిష్కరించారు.


ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశాన్ని సింగరేణి సీఎండీ ఎన్‍.బలరామ్‍ వివరించారు. సింగరేణి కార్మికుల పిల్లలు కేవలం కార్మికులుగానో లేదా ఇతర చిన్న ఉద్యోగాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు ఉన్న అవకాశాలపై వర్కుషాప్‍లు, సెమినార్లు, కెరీర్‍ గైడెన్సెలను ప్రముఖ నిపుణులతో సింగరేణి ప్రాంతంలో ఏర్పాటు చేయిస్తామన్నారు. దీనివల్ల జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలను వారు అందిపుచ్చుకొని వివిధ రంగాల్లో ఉజ్వల కెరీర్లను మలచుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‍ కుమార్‍ సుల్తానియా, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్‍, జెన్‍ కో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


కంపెనీ భవిష్యత్‍కు మొదటి ప్రాధానం

సింగరేణిలో పని చేస్తున్న ప్రతీ ఒక్క ఉద్యోగికి సమాజంలో మంచి గౌరవం, గుర్తింపు లభిస్తున్నాయని. మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతున్న సంస్థ భవిష్యత్తే ప్రతీ ఒక్కరికీ ప్రథమ ప్రాధాన్యం కావాలని సీఎండీ ఎన్‍.బలరామ్‍ అన్నారు. సింగరేణి ఉజ్వల భవిష్యత్‍ కోసం ప్రతీ ఒక్కరూ తమకు కేటాయించిన 8 గంటల పాటు అంకితభావంతో పనిచేయాలన్నారు. నూతన సంవత్సరం నేపథ్యంలో గురువారం (జనవరి 2) సింగరేణి భవన్‍లో
ఉద్యోగులందరినీ ఉద్దేశించి సీఎండీ ఎన్‍.బలరామ్‍ మాట్లాడారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.


కొత్త ఏడాదిలో సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ప్రతీ ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఉద్యోగుల పనితీరుపై పూర్తిస్థాయిలో మదింపు ఉంటుందని, పనిచేసే వారికి తగిన గుర్తింపు, నిర్లక్ష్యంగా ఉండే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయన్నారు. రక్షణ, నాణ్యతతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదక సాధించాలని, ప్రతీ ఒక్కరూ వారికి కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వర్తించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్‍ జనక్‍ ప్రసాద్‍, జీఎం కో ఆర్డినేషన్‍ ఎస్డి.ఎం.సుభానీ, జీఎం మార్కెటింగ్‍ రవి ప్రసాద్‍, జీఎ సోలార్‍ సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.


-చీఫ్‍ పబ్లిక్‍ రిలేషన్స్ ఆఫీసర్‍
ది సింగరేణి కాలరీస్‍ కంపెనీ లిమిటెడ్‍ (ప్రభుత్వ సంస్థ)
ప్రజా సంబంధాల విభాగం, హైదరాబాద్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *