ఏపీపీఎస్సీ గ్రూప్‍-1 మెయిన్స్ సైన్స్ & టెక్నాలజీలోనూ…దక్కన్‍ ల్యాండ్‍ జైత్రయాత్ర…!!


2024 అక్టోబర్‍లో జరిగిన టీజీపీఎస్సీ విభాగంలో గ్రూప్‍-1 మెయిన్స్ సైన్స్ & టెక్నాలజీ విభాగంలో 100కు పైగా మార్కులకు దక్కన్‍ ల్యాండ్‍ వ్యాసాల నుండి ప్రశ్నలు వచ్చి, ఉభయ తెలుగు రాష్ట్రాలలో దక్కన్‍ల్యాండ్‍ సంచలనం సృష్టించిన విషయాన్ని మరువక ముందే, గత మే నెలలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‍-1 మెయిన్స్ సైన్స్ & టెక్నాలజీ విభాగంలోనూ దక్కన్‍ ల్యాండ్‍ ప్రభంజనం సృష్టించింది. ఈ విభాగంలో మొత్తం 150 మార్కులకు గానూ, 50 మార్కుల వరకూ, దక్కన్‍ల్యాండ్‍ వ్యాసాల నుండే ప్రశ్నలు రావడంతో గ్రూప్స్ అభ్యర్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

సైన్స్ & టెక్నాలజీ ప్రశ్నల సరళిని గురించి పలువురు గ్రూప్స్ ఆస్పిరెంట్స్ను దక్కన్‍ల్యాండ్‍ పలుకరించినపుడు స్టాటిక్‍ పార్ట్కు సంబంధించి ఆంధప్రదేశ్‍లోని విభిన్న సంస్థలను గురించి రాయమని ప్రశ్నలు అడగడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ, దక్కన్‍ల్యాండ్‍ మాత్రం మమ్మల్ని ఎక్కడా నిరాశ పరచలేదని సమకాలీన అంశాలకు సంబంధించిన అంశాలను పరీక్ష కోణంలో అంచనా వేయడం కొంత సంక్లిష్టంగా ఉంటుందని, అయితే దక్కన్‍ ల్యాండ్‍లో రచయిత పుట్టా పెద్ద ఓబులేసు గారి వ్యాసాలను అనుసరించడంతో, మా ప్రిపరేషన్‍ సులువైందని సుమారు 5 ప్రశ్నలు దక్కన్‍ల్యాండ్‍ వ్యాసాల నుండి రావడంతో దక్కన్‍ ల్యాండ్‍ పై మా నమ్మకం ద్విగుణీకృతమైందని పలువురు అభ్యర్థులు తెలిపారు.

ప్రధానంగా సైబర్‍ నేరాన్ని నిర్వచించి, భారతదేశంలో ప్రబలంగా ఉన్న సైబర్‍ నేరాలను చర్చించండి అన్న ప్రశ్న వచ్చింది. ఈ అంశంపై ఆగస్ట్ 2024 సంచికలో సవివరణాత్మక వ్యాసం ప్రచురితమైంది. ఇంకా గృహ వ్యవస్థల ఆటోమేషన్‍పై ఇంటర్నెట్‍ ఆఫ్‍ థింగ్స్ ప్రభావాన్ని చర్చించండి? అన్న ప్రశ్న వచ్చింది. దీనిపై కూడా గతంలో దక్కన్‍ ల్యాండ్‍లో వివరణాత్మక వ్యాసం ప్రచురితమైంది. వ్యాక్సిన్లకు సంబంధించి కూడా ప్రశ్నవచ్చింది. దీనిపై దక్కన్‍ల్యాండ్‍ డిసెంబర్‍ 2023 సంచికలో విపులమైన వ్యాసాన్ని ప్రచురించడం జరిగింది. సంప్రదాయ మరియు సాంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించి ప్రశ్న వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి టీజీపీఎస్సీ గ్రూప్‍-1 మెయిన్స్లో జనరల్‍ ఎస్సే వచ్చింది. ఈ అంశంపై అక్టోబర్‍ – 2024లో సమగ్రమైన వ్యాసాన్ని ప్రచురించింది. అదేవిధంగా జెనెటిక్‍ ఇంజనీరింగ్‍కు సంబంధించి కూడా ప్రశ్న వచ్చింది. ఈ అంశంపై కూడా గతంలో దక్కన్‍ ల్యాండ్‍లో వ్యాసం ప్రచురితమైంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *