దేశ సంపదను పెంచడంలో చిన్న తరహా పరిశ్రమల పాత్ర ఎనలేనిది. పారిశ్రామిక అభివృద్ధితోనే ఏ దేశమైనా అభివృద్ధి చెందు తుంది. ఒక పరిశ్రమను స్థాపించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కుటుంబాలకు జీవనాధారం దొరుకుతుంది. ఔత్సాహికులు ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తే,
ఉపాధి అవకాశాలు ఏర్పడి పేదరిక నిర్మూలనతో పాటు జీవన ప్రమా ణాలు మెరుగవుతాయి. చిన్న తరహా పరిశ్రమలు స్థాపించడానికి గొ ప్ప మేధస్సు అవసరం లేదు; కావలసిందల్లా విషయ పరిజ్ఞానం, నిరంతర అధ్యయనం, విశ్లేషణ, సాధించాలనే సంకల్పం, మానసిక పట్టుదల, కార్య నిర్వహణ సామర్ధ్యము, కృషి మిమ్మల్ని విజయ తీరాల వైపు తీసుకు వెళ్తాయి.
చట్ట ప్రకారం 18 సం।। దాటిన వారు ఎవరైనా స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే కంప్యూటర్ వంటి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో 18 సంవత్స రాల కంటే తక్కువ వయస్సు వారు కూడా స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకోవడం హర్షించదగ్గ పరిణామం.
ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు పరిశ్రమలు స్థాపించడం సులభ తరం అయింది. పరిశ్రమల ఏర్పాటుతో ఔత్సాహిక పారిశ్రామిక వే త్తలకు ఎదురౌతున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి సింగల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టాయి. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎటువంటి ఖర్చులు లేకుండా ఉచితంగా చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారు. కొత్త పరిశ్రమలు స్థాపించిన వారికి పెట్టుబడిలో 15 శాతం రాయితీ ఇస్తారు. స్థలం కొనుగోలుపై రి జిస్ట్రేషన్ ఛార్జీలను తిరిగి చెల్లిస్తారు. లీజ్‍కు తీసుకున్న స్థలంపై కూడా రిజిస్ట్రేషన్ ఉచితం. పరిశ్రమకు సంబంధించిన సేల్స్ ట్యాక్స్పై 5 సం।। వరకు రాయితీ, విద్యుత్తు ఛార్జీలపై రాయితీలను ఇస్తారు. ఈ రాయితీలను సద్వినియోగం చేసుకోవడానికి ఔత్సామిక పారిశ్రామిక వేత్తలకు ఇదొక మంచి అవకాశం.
స్వయం ఉపాధిని క్రింది విధంగా వర్గీకరించవచ్చు.
1) పరిశ్రమలు స్థాపించడం ద్వారా వస్తువుల ఉత్పత్తి చేయడం
2) సేవ సంబంధిత వ్యాపారం – వస్తువులను కొనడం లేదా అమ్మడం మరియు వినియోగదారులకు సేవలను అందించే రంగాన్ని ఎంచుకొని నాణ్యమైన వస్తువులు లేదా సేవలను అందించి లాభాలను ఆర్జించడం. ఉదా: కిరాణాషాప్‍లు, సూపర్ మార్కెట్లు, హోటల్స్, వాహన సంబంధిత సేవలు అనగా క్రయ, విక్రయ మరియు సర్వీసింగ్ వంటి సేవలు, కమిషన్ ఏజెంట్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్‍సేల్ డిస్ట్రి బ్యూటర్స్, హాస్పిటల్స్, కంప్యూటర్ సంబంధిత సేవలు, గార్మెంట్స్, టూరిజం సంబంధిత సేవలు వంటి మొదలగు సేవలు అందించడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు.
వ్యాపారం లేదా పరిశ్రమ స్థాపించాలంటే ప్రధాన వనరు – పెట్టుబడి. మీరు ఎంచుకున్న వ్యాపారం బట్టి పెట్టుబడి యొక్క పరి మాణం ఆధారపడి ఉంటుంది. అదే విధంగా మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం ఉండటం కూడా చాలా అవసరం, మీరు స్వయంగా అధ్యయనం చేయడంతోపాటు నిపుణుల సలహా మరియు సూచనలు తీసుకోవడం మంచిది.
ఆర్ధికంగా అవకాశం ఉన్నవారు బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థల నుండి రుణ సహాయం గురించి సమయం వృధా చేసుకునే కంటే తమ పరిధిలో స్వంత పెట్టుబడితో స్వయం ఉపాధిని పొందితే త్వరగా అభివృద్ధి చెందవచ్చు.
స్వంత పెట్టుబడి పెట్టే అవకాశం లేని వారు బంధువులు, స్నే హితులు లేదా వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి ఇ క్కట్ల పాలవకుండా ప్రభుత్వాలు లేదా బ్యాంకులు అందించే పధకాల గురించి తెలుసుకొని స్వంత పెట్టుబడిని బ్యాంకు రుణంలో మార్జిన్ మనీగా చూపించడం ద్వారా ప్రయత్నించి సాధించుకోవడం మేలు. ఈ విధానం కాస్త వ్యయ ప్రయాసతో కూడుకున్నదైనను అవలంబించడం మంచిది.
వ్యాపారంలో పెట్టుబడి అన్నది ఎప్పుడూ రిస్క్తో కూడుకున్న వ్యవహారం. వ్యాపారం లేదా పరిశ్రమ నష్టపోయినప్పుడు పెట్టుబడిలో కొంత శాతం లేదా మొత్తం కోల్పోవలసి రావచ్చు. అదే విధంగా వి జయం సాధిస్తే ఎన్నో రెట్లు లాభాన్ని ప్రతిఫలంగా పొందవచ్చు. ఒ క క్రమబద్ధమైన ప్రణాళికతో వృత్తి నిబద్ధతతో శ్రమిస్తే నష్టపోయే అ వకాశాలు చాలా తక్కువ.
ఏ పరిశ్రమ స్థాపించాలి అన్న విషయంపై సలహా మరియు సూచనలు మరియు వివిధ దశల్లో ఆ పరివ్రమకు కావాల్సిన విషయ పరిజ్ఞానాన్ని ప్రభుత్వ రంగంలో APITCO(www.apitco.org) మరియు ప్రైవేటు రంగంలో MIND CAPITAL(mindcapital.org.ph: 7032787 807) వంటి సంస్థలు అందచేస్తున్నాయి. మిమ్మల్ని కౌన్సిలింగ్ చేయడం ద్వారా మీకు తగిన వ్యాపారం లేదా పరిశ్రమలను మీకు సూచిస్తాయి. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా మార్గ నిర్దేశం చేస్తున్నా యి. అందులో ప్రముఖమైనవి ALEAP, COWE (confideration of women Enterpreneurs), BYST (Bharat Yuva Shakti Trust).
వివిధ పరిశ్రమలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలను నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ట్రైనింగ్ ఇన్‍స్టిట్యూట్, స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్‍స్టిట్యూట్, ALEAP, COWE మరియు BYST వంటి సంస్థలు నిర్వహిస్తున్నాయి. స్వయంఉపాధిని ప్రోత్సహించి, పెట్టుబడిని అం దించే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అనేక సంస్థలు పని చేస్తున్నాయి. ముఖ్యంగా స్టేట్ ఫైనాన్స్, కార్పొరేషన్, నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ఖాది అండ్ విలేజ్ బోర్డ్ కమీషన్, SIDBI తదితర సంస్థలు యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి కావాల్సిన ఆర్ధిక సహాయం అందచేస్తాయి.
కేంద్ర ప్రభుత్వం మరియు SIDBI సంయుక్తంగా ప్రవేశపెట్టిన Credit Guarantee Fund Trust for Micro and Small Enterprises (CGTMSE) స్కీమ్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయో గకరం. ఈ స్కీమ్‍లో ఎటువంటి సెక్యూరిటీ లేదా పూచీకత్తు లేకుండా కోటి రూపాయల వరకు బ్యాంకుల నుండి రుణం పొందవచ్చు. మీకు మంజూరు చేసిన రుణానికి CGTMSE సంస్థ పూచీకత్తుగా వ్యవహరిస్తుంది. ఇందుకుగాను కొంత రుసుమును సదరు సంస్థ వ సూలు చేస్తుంది. ఈ సంస్థ గురించి మరిన్ని వివరాలు www.cgtsi.org.in అనే వెబ్‍సైట్‍లో చూడవచ్చు.
పరిశ్రమ లేదా వ్యాపారానికి మూల పెట్టుబడితో పాటు వర్కింగ్ క్యాపిటల్ అన్నది చాలా అవసరం. వర్కింగ్ క్యాపిటల్ అంటే పరివ్రమ లేదా వ్యాపారానికి మూడు నెలలకు సంబంధించిన వ్యయాలు, ఈ వర్కింగ్ క్యాపిటల్‍ను వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు సమకూరు స్తాయి. పరిశ్రమ స్థాపనకు అవసరమైన భూమి, షెడ్ తదితరాలను ఇన్‍ఫాస్ట్రక్చరల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలో అయితే (www.telangana.apiic.in) సమకూరుస్తుంది.ఆంధప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఆంధప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‍ఫాస్ట్రక్చరల్ కార్పొరేషన్ ((www.appiic.in)) సమకూరుస్తుంది.
పరిశ్రమలు స్థాపించేవారికి ముడి సరుకుల కొనుగోలులో స్మాల్ స్కేల్ ఇండస్త్రీస్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ సహాయపడుతుంది. త యారైన ప్రొడక్ట్ని మార్కెటింగ్ చేయడంలో కూడా సహాయపడుతుంది.
తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాలు సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి నూతన పరిశ్రమలు ఏర్పడాల్సిన అవసరం చాలా ఉం ది. ‘శ్రమ ఏవ జయతే’ అనే సూత్రాన్ని నమ్మండి, విజయానికి అడ్డదారులు ఉండవనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.
-టి. త్రినాథ్