హెచ్ఎండీఏ మాస్టర్‍ ప్లాన్‍ అమలు

సర్క్యులేషన్‍ నెట్‍ వర్క్, హైదరాబాద్‍ మెట్రోపాలిటన్‍ స్ట్రక్చర్‍ సరైన విధంగా తనకుతానుగా రీఅలైన్‍ అయ్యేలా జాగ్రత్త వహించాలి.

1.పరిచయం
ఏదైనా ప్రాంతాన్ని ఉపయోగించాలంటే దానికి ముఖ్యంగా కావాల్సింది యాక్సెస్‍ (చేరు కోవడం). మన జీవితంలో రవాణా అనేది ఒక అతిముఖ్యమైన భాగం. మహానగరాలకు సైతం అదే జీవం. మహానగరం అనేది రోడ్లు, మార్గాలు, రైళ్లు, వాయు మార్గాలు లాంటి వాటితో కూడుకున్న ఒక కమ్యూనికేషన్‍ అల్లిక. దాని ఆర్థిక, సాంస్కృతిక స్థాయి కొంత వరకు నేరుగా దాని సర్క్యులేషన్‍ నెట్‍ వర్క్పై ఆధారపడి ఉంటుంది. మహానగర రవాణా వ్యవస్థ విధి ఏంటంటే ప్రజల, సరుకుల రవాణా కదలికలకు మార్గం కల్పించడం. కాలినడకన వెళ్లే వ్యక్తి మొదలుకొని దూరప్రాంతాల నుంచి నగరానికి వచ్చిపోయేవారి ప్రయాణాల దాకా ఈ కదలికలు ఉంటాయి. వాహనాలు, బస్సులు, స్కూటర్లు, సైకిళ్లు, ట్రక్కులు, రైల్వేలు, విమానాలు లాంటివి వీటిలో ఉంటాయి. ఉపాధి, వినోదం, షాపింగ్‍, వస్తు రవాణా, చదువు, ఆహ్లాదం, ప్రభుత్వ పాలనా వ్యవహారాలు, చట్టాల అమలు…. ఇలా ఎన్నో కారణాలతో రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. రవాణా ప్రణాళిక అనేది ల్యాండ్‍ యూజ్‍ డెవలప్‍ మెంట్‍, నూతన ఏరియా పథకాలతో సమన్వయం చేసుకోవా ల్సి ఉంటుంది. మహానగర మాస్టర్‍ ప్లాన్‍ కు సంబంధించి ఒక ప్రధాన ఆందోళన ఏంటంటే, ఎప్పటికప్పుడు మారుతూ ఉండే పరిస్థితుల్లో సురక్షిత, సామర్థ్యం, సౌలభ్యంలతో చౌకగా ప్రజలకు, వస్తువులకు రోజులవారీ కదలిక లకు వీలు కల్పించడం.
పట్టణ ప్రాంతంలో రోడ్లు, హైవేలు, మాస్‍ ట్రాన్సిట్‍ సిస్టమ్‍, ఇతర రవాణా మార్గాలతో కూడిన నెట్‍ వర్క్ ప్రజలకు, వస్తువులకు సురక్షిత, సామర్థ్యం, సౌలభ్యంలను అందించేదిగా ఉండాలి. అర్బన్‍ రహదారులు, సర్య్కులేషన్‍ నెట్‍ వర్క్, ఇతర రవాణా సదుపాయాల ప్లానింగ్‍ అనేది ఒక ప్రత్యేక రంగమైనా, పట్టణ ప్రాంతానికి రూపొందించే ప్రతీ ఒక్క ప్రాథమిక సమగ్ర ప్రణాళికలో అది భాగంగానే ఉంటుంది. మాస్టర్‍ ప్లాన్‍లోని రవాణ ప్రణాళిక భాగం అనేది ల్యాండ్‍ యూజ్‍ డెవలప్‍ మెంట్‍తో, న్యూ ఏరియా స్కీమ్‍లతో సమ న్వయపూరితంగా ముందుకు సాగాల్సి ఉంటుంది.


అన్ని దేశీయ నగరాలకు మాదిరిగానే హైదరాబాద్‍ నగర నిర్మాణం కూడా నగర మధ్య భాగాన్ని (అబిడ్స్, కోఠి, నాంపల్లి) కేంద్రబిందువుగా వ•ద్ధి చేయడంగానే ఉండింది. 1970లలో ట్రాఫిక్‍లో అత్యధిక శాతం ఈ మధ్యభాగం గుండానే సాగేది. ట్రాఫిక్‍ ప్రధానంగా ఉత్తరం నుంచి దక్షిణానికి (పాత నగరం నుంచి కొత్తనగరం) సాగుతూ ఉండేది. 1980లలో నాటి హుడా ఆధ్వర్యంలో శివార్లలో ఇన్నర్‍ రింగ్‍ రోడ్డు (మొత్తం 51 కి.మీ., శివార్లలో 27 కి.మీ., ఎంసీహెచ్‍ ఏరియాలో 24 కి.మీ.) సకాలంలో పూర్తి కావడంతో, ప్రధాన ఆర్టెరియల్‍ రోడ్ల వెడల్పు కూడా జరగడంతో (1980-90లకు చెందిన అర్జున్‍ రావు శకం) ట్రాఫిక్‍ మూమెంట్‍ అనేది ప్రభావపూరితంగా పంపిణి చేయబడింది. ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండిన ట్రాఫిక్‍ రద్దీని, రోజువారీ ఉత్పన్నమయ్యే ట్రాఫిక్‍ను సమర్థంగా ఎదుర్కోవడానికి నగరంలోకి కీలకప్రాంతాల్లో పలు ఫ్లైఓవర్ల నిర్మాణం, తదనంతర కాలంలో హైదరాబాద్‍లో చోటు చేసుకున్న ఐటీ బూమ్‍ను సమర్థంగా నిర్వహించడంలో ఈ విధమైన సన్నద్ధత ఉపకరించింది. 158 కి.మీ. పొడుగునా అవుటర్‍ రింగ్‍రోడ్‍ను 150 మీటర్ల రైట్‍ ఆఫ్‍ వేను హెచ్‍ఎండీఏ వృద్ధి చేయడంతో హైదరాబాద్‍ మెట్రోపాలిటన్‍ రీజియన్‍ ఈ ప్రాంతంలో పెరిగిన ఆర్థిక కార్యకలాపాలను, జనాభా పంపిణిని సులభంగా మిళితం చేసుకోగలిగే శక్తిని సంపాదించుకుంది

2.హబ్‍ అండ్‍ స్పోక్స్ వ్యూహం
హైదరాబాద్‍ ఎంతో జాగరూకతతో హబ్‍ అండ్‍ స్పోక్స్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇక్కడ హబ్‍ అంటే గతకాలపు కేంద్రబిందువు (అబిడ్స్-కోఠి-నాంపల్లి) కాదు. ఇన్నర్‍ రింగ్‍ రోడ్‍ పరిధిలోని యావత్‍ సెంట్రల్‍ సిటీ. ఇక్కడ 34 ప్లాన్డ్ రేడియల్‍ రోడ్స్ స్పోక్స్ గా ఉంటాయి. అవుటర్‍ రోడ్‍ అనేది ‘చక్రం’గా ఉంటుంది. నేడు మనం హైదరాబాద్‍ మెట్రోపాలిటన్‍ ఏరియాగా మాట్లాడుతున్న ప్రాంతం అవుటర్‍ రింగ్‍ రోడ్డు లోపలే ఉంది. జీహెచ్‍ఎంసీ బౌండరీ, హెచ్‍ఎండబ్ల్యూఎస్‍ఎస్‍ – సేవలు అందే ప్రాంతం, టీఎస్‍ ట్రాన్స్కో పంపిణి ప్రాంతం, ఇతర ఫంక్షనల్‍ ఏజెన్సీల పరిధులు పై నిర్మాణానికి అనుగుణంగా రీఅలైన్‍ అయ్యాయి.
మరో వైపున హైదరాబాద్‍ మెట్రోపాలిటన్‍ ఏరియా కవల తోబుట్టువు, ప్రత్యర్థి అయిన బెంగళూరు కానర్బేషన్‍ (శివారు ప్రాంతాలతో కూడిన నగరం) అనేది మాత్రం ‘క్లియర్లీ స్ట్రక్చర్డ్’ కాదు. అంతే కాదు, ప్రాథమిక నిర్మాణం కూడా అక్కడ నిర్లక్ష్యానికి గురైంది.


బెంగళూరు విషయానికి వస్తే ప్రైమరీ సర్క్యులేషన్‍ నెట్‍ వర్క్ నష్టపోవడం అనేది సమస్యలను అధికం చేసింది. మరీ ముఖ్యంగా ట్రాఫిక్‍ సమస్య, నీటి సరఫరా సవాళ్లు, విద్యుత్‍ కోతలు, కనుమరుగై పోతున్న జలాశయాలు లాంటివెన్నో వీటిలో ఉన్నాయి. అదే సమయంలో ఆవాస ప్రాంతాల అభివృద్ధి నాణ్యత, గ్రీనరీ / ఓపెన్‍ స్పేస్‍లు, పార్కులు లాంటివి మాత్రం హైదరాబాద్‍ కంటే కూడా మెరుగ్గా ఉన్నాయి. మరో విధంగా చెప్పాలంటే, బెంగళూరు విషయంలో ప్రణాళిక రూపకర్తల్లో దీర్ఘకాలిక దృష్టి లోపించింది. బెంగళూరు అవుటర్‍ రింగ్‍ రోడ్‍ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. తాను అందించాల్సిన ప్రయోజనాన్ని అది విస్మరించింది. మధ్యలోనే నిలిచి పోయింది. పెరిఫెరల్‍ రింగ్‍ రోడ్‍ (హై దరాబాద్‍ అవుట్‍ రింగ్‍ రోడ్‍ లాంటిది) 15 ఏళ్లుగా డ్రాయింగ్‍ బోర్డ్లపై నుంచి బయట పడలేకపోయింది. అమల్లోకి రాలేకపోయింది. దాంతో సర్క్యులేషన్‍ నెట్‍వర్క్ క్రమానుగతం ఎంతగానో తప్పిపోయింది. అప్పటికే బెంగళూరు సెంట్రల్‍ కోర్‍ చిక్కుల్లో చిక్కుకు పోగా, ఉత్తరం- దక్షిణం, తూర్పు-పడమర రోజువారీ ప్రయాణ ప్రవాహాలు అధికమై పోయాయి. దీంతో ఉపశమన చర్యగా 80 శాతానికి పైగా రోడ్లను వన్‍వే లుగా ప్రకటించారు.


ఫలితంగా బెంగళూరు ఇక ఎంత మాత్రం ‘రేడియల్‍ – కాన్సెంట్రిక్‍’ మహానగరం కాలేక పోయింది. అది తక్కువ యాక్సెసబిలిటీ రేషియోతో, మొత్తంమీద బలహీనమైన సర్క్యు లేషన్‍ నెట్‍ వర్క్ తో ‘సెక్టార్స్ మోడల్‍’లో వృద్ధి చెందుతోంది. భౌతికపరమైన మౌలిక వసతుల నెట్‍వర్క్, సేవలు వెన్నెముకగా ఉండాల్సిన చోట అవి బలహీనం కావడం మంచిది కాదు.
మరో వైపున హైదరాబాద్‍ తన సిటీ ప్లానింగ్‍ను ‘పౌడర్‍ డ్రై’ (అవసరం వచ్చినప్పుడు ప్రయోగించేందుకు వీలుగా అస్త్రాలను సన్నద్ధంగా ఉంచుకోవడం) విధానంలో ఉంచుకుంది. ఇన్నర్‍ రింగ్‍ రోడ్‍, 34 రేడియల్‍ రహదారులతో స్పష్టమైన క్రమానుగతంతో ప్రైమరీ సర్క్యులేషన్‍ సిస్టమ్‍ను మరింత జాగరూకతతో ఉంచుకుంది. అవుటర్‍ రింగ్‍ రోడ్‍ను రికార్డు సమయంలో పూర్తి చేసుకొంది. నీటి సరఫరా వ్యవస్థను కాలనుగుణంగా పెంచుకునే విధంగా ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్‍ వ్యవస్థను పూర్తి స్థాయిలో మెరుగు పర్చుకుంది. సరైన సమయంలో ఘనవ్యర్థాల వ్యవస్థను సమర్థంగా అమలు చేసేవిధంగా మరియు మరమ్మతు చేసేందుకు కూడా వీల్లేకుండా పరిస్థితి చేజారి పోకముందే ప్రధాన జలాశయాలను పునరుద్ధరణ, తమ ప్రాథమిక మాస్‍ ట్రాన్సిట్‍ సిస్టమ్‍ను (ఎంఎంటీఎస్‍ పాక్షికంగానే నడుస్తున్నా, బెంగళూరులో మాదిరిగా మెట్రో ఇంకా పూర్తిస్థాయిలో పని చేయకున్నా) మెరుగ్గా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్‍ చేసుకుంది.
ఏది ఏమైనా మహానగర ట్రాఫిక్‍ను పంపిణి చేయడంలో హైదరాబాద్‍ అవుటర్‍ రింగ్‍ రోడ్‍ తనకు తానుగా తోడ్పడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ అవుట్‍ రింగ్‍ రోడ్‍ను ఒక చక్రం అనుకుంటే… అందులో పుల్లలు (స్పోక్స్) మిస్‍ అవుతున్నాయి.


ఒఆర్‍ఆర్‍ పొడుగునా ప్లాన్‍ చేసిన 34 రేడియల్‍ రోడ్స్లో 17 లింకులు ఇంకా పూర్తి కా లేదు. ఈ 34 రోడ్లను కూడా పూర్తిస్థాయిలో అంటే యాక్సెస్‍ కంట్రోల్‍ తో వ•ద్ధి చేయా ల్సిన అవసరం ఉంది. ప్రధాన రహదారి (కనీసం 4 నుంచి 6 లేన్లు) ముందుగా నిర్ణ యించబడిన పాయింట్లు / జంక్షన్ల వద్ద వేరు చేయబడాలి. తద్వారా సిస్టమ్‍, దాంతో పాటుగా ట్రాఫిక్‍ పంపిణి, ఫ్లో ప్రభావవంతంగా ఉంటాయి. స్ట్రీమ్‍ లైన్‍ చేయబడుతాయి.
నిజం చెప్పాలంటే హైదరాబాద్‍ మెట్రో ఏరియాకు ఇన్నర్‍ రింగ్‍రోడ్‍, ఔటర్‍ రింగ్‍రోడ్‍ మధ్యలో మరిన్ని రేడియల్‍ రోడ్లు ప్లాన్‍ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే హైదరాబాద్‍ సైతం బెంగళూరుగా మారిపోతుంది. నిజానికి 15 కొత్త రేడియల్‍ రోడ్లను జోడించేందుకు హెచ్‍ ఎండీఏ అడ్వయిజర్‍ (ప్లానింగ్‍ అండ్‍ పాలసీస్‍) చే ప్రయత్నం కూడా జరిగింది. (అప్పుడు మొత్తం రోడ్ల సంఖ్య49 అయ్యేది). ప్రతిపాదించిన రోడ్లు ఇలా ఉన్నాయి.

  1. ప్రతిపాదిత నూతన రేడియల్‍ రోడ్‍ నెం.14ఎ – రైలునిలయం / మెట్టుగడ్డ దగ్గర ఇన్నర్‍ రింగ్‍ రోడ్డు మరియు లియో మెరిడియన్‍ వద్ద ఔటర్‍ రింగ్‍ రోడ్‍ను అనుసంధానం చేయడం – మెట్టుగడ్డ లోకో షెడ్స్ / రైల్‍ కళారంగ్‍ ఫంక్షన్‍ హాల్‍ సమీపంలో ఇన్నర్‍ రింగ్‍ రోడ్‍ను చేరుకునేందుకు (సికింద్రాబాద్‍ – తార్నాక ప్రధాన రహదారి)
  2. ప్రతిపాదిత నూతన రేడియల్‍ రోడ్‍ నెం. 11ఎ- దుండిగల్‍ వద్ద ఓఆర్‍ఆర్‍ నుంచి బేగంపేట హెచ్‍ పిఎస్‍ వద్ద ఇన్నర్‍ రింగ్‍ రోడ్డుకు. దుండిగల్‍లో 5 – ఆర్మ్డ్‍ జంక్షన్‍ నుంచి – హెచ్‍ఐటిఎఎం – బాసురగుడి – అపెరల్‍ పార్క్ పశ్చిమ హద్దు నుంచి హెచ్‍ పిఎస్‍ బేగంపేట్‍ జంక్షన్‍ వద్ద ఇన్నర్‍ రింగ్‍ రోడ్‍ ను చేరుకునేందుకు.
  3. ప్రతిపాదిత నూతన రేడియల్‍ రోడ్‍ నెం. 10ఎ – మల్లంపేట్‍ జంక్షన్‍ వద్ద ఓఆర్‍ఆర్‍ జంక్షన్‍ నుంచి గ్రీన్‍ లాండ్స్ జంక్షన్‍ వద్ద ఇన్నిర్‍ రింగ్‍ రోడ్‍ జంక్షన్‍ వరకు. ఆర్‍ఆర్‍ఆర్‍- వావిలాల గ్రామం వద్ద జిన్నారం జంక్షన్‍ వరకు పొడిగింపు.
  4. ప్రతిపాదిత నూతన రేడియల్‍ రోడ్‍- నాగులపల్లి స్టేషన్‍ నుంచి బేగంపేట్‍ స్టేషన్‍ వరకు – (ఉత్తర భాగంలో) ప్రస్తుత సికింద్రాబాద్‍ – వాడి – ముంబై రైల్వే లైన్‍ నుంచి హెచ్‍ పిఎస్‍ బేగంపేట్‍ జంక్షన్‍ వద్ద ఇన్నర్‍ రింగ్‍ రోడ్‍ను చేరుకునేందుకు.
  5. ప్రతిపాదిత నూతన రేడియల్‍ రోడ్‍ హిమాయత్‍ సాగర్‍ బండ్‍ నుంచి మైలార్‍ దేవ్‍ పల్లి జంక్షన్‍ వద్ద ఐఆర్‍ఆర్‍ చేరుకునేందుకు
  6. ప్రతిపాదిత రేడియల్‍ రోడ్‍- శ్రీశైలం హైవే- ఎన్‍ హెచ్‍ -44 మధ్య
  7. ప్రతిపాదిత రేడియల్‍ రోడ్‍- డీఆర్‍ డిఎల్‍ జంక్షన్‍ నుంచి ఆదిభట్ల
  8. ప్రతిపాదిత రేడియల్‍ రోడ్‍- సాగర్‍ రోడ్‍, ఎన్‍ హెచ్‍ -65 మధ్య
  9. ప్రతిపాదిత రేడియల్‍ రోడ్‍- వరంగల్‍ హైవే – కీసీర రోడ్డు మధ్య
  10. ప్రతిపాదిత రేడియల్‍ రోడ్‍- సికింద్రాబాద్‍ – నిజామాబాద్‍ బిజి రైల్వే లైన్‍కు సమాంతరంగా (రైల్వే లైన్‍కు తూర్పు వైపు)
  11. ప్రతిపాదిత రేడియల్‍ రోడ్‍- సికింద్రాబాద్‍ — నిజామాబాద్‍ బిజి రైల్వే లైన్‍ కు సమాంతరంగా (రైల్వే లైన్‍ కు పశ్చిమం వైపు)
  12. ప్రతిపాదిత రేడియల్‍ రోడ్‍- ఫలక్‍ నుమా – బెంగళూరు బిజి రైల్వే లైన్‍కు సమాంతరంగా (రైల్వే లైన్‍కు ఉత్తరం వైపు)
  13. ప్రతిపాదిత రేడియల్‍ రోడ్‍- ఫలక్‍ నుమా – బెంగళూరు బిజి రైల్వే లైన్‍కు సమాంతరంగా (రైల్వే లైన్‍కు దక్షిణం వైపు)
  14. ప్రతిపాదిత రేడియల్‍ రోడ్‍- సికింద్రాబాద్‍ – కాజీపేట్‍ బిజి రైల్వే లైన్‍కు సమాంతరంగా (రైల్వే లైన్‍కు ఉత్తరం వైపు)
  15. ప్రతిపాదిత రేడియల్‍ రోడ్‍- సికింద్రాబాద్‍ – కాజీపేట్‍ బిజి రైల్వే లైన్‍కు సమాంతరంగా (రైల్వే లైన్‍కు ఉత్తరం వైపు)


హెచ్‍ఎండీఏ, హైదరాబాద్‍ యూఎంటీఏ (యూనిఫైడ్‍ మెట్రోపాలిటన్‍ ట్రాన్స్ పోర్టేషన్‍ అథారిటీ) మొదటగా చేయాల్సింది ఏంటంటే ఈ 49 రేడియల్‍ రోడ్లు అన్నిటినీ, వాటితో పాటుగా దిగువ పేర్కొన్న ప్రతిపాదిత ఇంటర్మీడియేట్‍ రింగ్‍ రోడ్‍ (ఐఆర్‍ఆర్‍ఆర్‍)ను సైతం, రైట్స్ ఆఫ్‍ వే (30 మీ. మొదలుకొని 60 మీ. వరకు) అలైన్‍ మెంట్స్ తో పాటు గా డిజిగ్నేట్‍ చేయడం. అలాగే, మిస్సింగ్‍ లింక్స్ ను తక్షణం డెవలప్‍ చేయాలి. ఇది చూ సేందుకు అంత సహేతుకం అనిపించకపోవచ్చు లేదా అవతలి వారిని అంతగా ఒప్పిం చకపోవచ్చు. కానీ ఒకసారి వీటిని రేడియల్‍ రోడ్‍ గా, ఇంటర్మీడియెట్‍ రింగ్‍ రోడ్‍గా డిజిగ్నేట్‍ చేస్తే, రోడ్‍ అలైన్‍ మెంట్‍, దాని స్టేటస్‍ కచ్చితత్వంతో కూడుకొని ఉంటాయి. ఈ 49 రేడియల్‍ రోడ్లను, ఇంటర్మీడియెట్‍ రింగ్‍ రోడ్‍ను మధ్యలోనే వదిలేయకూడదు. కనీసం 18 మీటర్లు లేదా 60 అడుగుల వెడల్పుతో కూడిన విభజితమైన 4 లేన్ల క్యారేజ్‍వే మెట్రోపాలిటన్‍ ట్రాఫిక్‍ మూమెంట్‍కు ఎంతో మేలు చేస్తుంది. ఆ తరువాత రైట్‍ ఆఫ్‍ వేకు సంబంధించి ‘రోడ్‍ అలైన్‍ మెంట్‍ కోసం స్ట్రిప్‍ ల్యాండ్‍ పూలింగ్‍’ లేదా టీడీఆర్‍ లేదా నిర్బంధ భూ సేకరణ వంటివి చేయవచ్చు. రోడ్డు భౌగోళిక స్థితిగతులు, జంక్షన్‍ పాయిం ట్స్, సర్వీస్‍ రోడ్ల కోసం స్థలం వంటి వాటిని ఈ సందర్భంగా దృష్టిలో ఉంచుకోవాలి. (తద్వారా లోకల్‍ ట్రాఫిక్‍ మూమెంట్‍ క్లియర్‍గా ఉంటుంది). ట్రాఫిక్‍ ఫ్లో సజావుగా సాగేందుకు వీలు కల్పించేలా ఇన్నర్‍ రింగ్‍ రోడ్‍ జంక్షన్ల నుంచి రీజనల్‍ రింగ్‍ రోడ్‍ (ఆర్‍ఆర్‍ఆర్‍) దాకా ఇంటర్మీడియెట్‍ రింగ్‍ రోడ్‍, అన్ని రేడియల్‍ రోడ్ల ప్రధాన క్యారేజ్‍ వేలను గ్రేడ్ల వారీగా విభజించాలి.


ఇంటర్మీడియెట్‍ రింగ్‍ రోడ్‍ను ఎందుకు పట్టించుకోలేదు?
గతంలోని హుడా మాస్టర్‍ ప్లాన్‍లలో, జోనల్‍ డెవలప్‍ మెంట్‍ ప్లాన్‍ లలో ఇంటర్మీడియెట్‍ రింగ్‍రోడ్‍ ప్రతిపాదన ఉండింది. హైదరాబాద్‍ ఉత్తర సెక్టార్‍లో ఎన్‍ హెచ్‍ 9 ముంబై నేషనల్‍ హైవే (వె స్ట్) – విజయవాడ నేషనల్‍ హైవే (ఈస్ట్) మధ్య బైపాస్‍ గా దీన్ని అప్పట్లో ప్రతిపాదించారు. అయితే, ఆశ్చర్యకరంగా హెచ్‍ఎండీఏ మెట్రోపాలిటన్‍ డెవలప్‍ మెంట్‍ ప్లాన్‍ – 2031లో ఇది మాయమై పోయింది. నిజానికి 2000 మొదట్లో అవుటర్‍ రింగ్‍రోడ్‍ అలైన్‍ మెంట్‍ తుది ఖరారు దశలో
ఉన్నప్పుడు, దక్షిణ సెక్టార్‍లో ఈ రింగ్‍ను పూర్తి చేసేందుకు కసరత్తు పూర్తయింది. అ వుటర్‍ రింగ్‍ రోడ్‍ పై ప్రధానంగా దృష్టి పెట్టడంతో ఇంటర్మీడియెట్‍ రింగ్‍ రోడ్‍ను విస్మరించారు. క్లుప్తంగా చెప్పాలంటే, ఇంటర్మీ డియెట్‍ రింగ్‍ రోడ్‍ (ఐఆర్‍ఆర్‍ఆర్‍) అలైన్‍ మెంట్‍ ఇలా ఉండింది:

  • కొంపల్లి జంక్షన్‍ నుంచి బౌరాంపేట్‍ జంక్షన్‍ నుంచి బాచిపల్లి జంక్షన్‍ నుంచి మియాపూర్‍ జంక్షన్‍ మధ్యలో ఐఆర్‍ఆర్‍ఆర్‍ స్ట్రెచ్‍. ప్రస్తుత ఆర్‍ అండ్‍ బి రోడ్‍ను అనుసరిస్తుంది.
  • మియాపూర్‍ జంక్షన్‍ నుంచి గచ్చిబౌలి జంక్షన్‍ నుంచి నార్సింగి జంక్షన్‍ మధ్యలో ఐఆర్‍ఆర్‍ఆర్‍ స్ట్రెచ్‍. ప్రస్తుత ఆర్‍ అండ్‍ బి రోడ్‍ను అనుసరిస్తుంది.


ఆ తరువాత నార్సింగి నుంచి ఐఆర్‍ఆర్‍ఆర్‍ ఇక ఓఆర్‍ఆర్‍ అలైన్‍ మెంట్‍ను అనుసరిస్తుంది. నార్సింగి జంక్షన్‍ నుంచి మంచిరేవుల జంక్షన్‍ వరకు. ఆ తరువాత వెంకటాపూర్‍ – రేణుకాపూర్‍ – బాలాపూర్‍ – నాదర్‍ గుల్‍ (నార్త్) – గుర్రంగూడ – కమ్మగూడ – తొర్రూర్‍ – మంగనూర్‍ – ఇంజాపూర్‍ – బాగ్‍ హయత్‍నగర్‍ – కుంట్లూరు – హాథి గూడ – క్రాస్‍ రివర్‍ మూసి – పర్వతాపూర్‍ – నారపల్లి- బోడుప్పల్‍ – చెంగిచెర్ల – నాగారాం – దమ్మాయిగూడ – హకీంపేట్‍ – కొంపల్లి పాయింట్‍ మీదుగా జలపల్లికి అను సంధాన మవుతుంది.


మొత్తం పొడవు: రైట్‍ ఆఫ్‍ వే 60 మీటర్లు లేదా 200 అడుగులతో 96 కి.మీ. ఇందులో 80 ఫీట్లు 10 లేన్లతో మెయిన్‍ క్యారేజ్‍ వేగా ఉంటుంది. (రెండు పక్కలా ఐదేసి లైన్లు. షోల్డర్స్ / క్రాష్‍ బారియర్స్ గా మీడియన్‍ డివైడర్‍ 4 ఫీట్లుగా, 3 ఫీట్లుగా, గ్రేడ్‍ సెప రేటెడ్‍ గా ఉంటుంది. మిగితా 120 అడుగులు ఒక్కో వైపు 60 అడుగుల వెడల్పుతో ఒక్కో వైపున ఒక్కో సర్వీస్‍ రోడ్‍ ను కలిగి ఉంటుంది. ప్రధాన క్యారేజ్‍ వే కు యాక్సెస్‍ 15 జంక్షన్‍ పాయింట్ల వద్ద ఇవ్వబడుతుంది.
రింగు రోడ్లు, రేడియల్స్ సంఖ్య ఎక్కువయ్యే కొద్దీ ట్రాఫిక్‍, ఆర్థిక కార్యకలాపాల పంపిణి మరింతగా ఉంటుంది. ఏకకాలంలో ఆవాస, కమ్యూనిటీ అభివృద్ధి కార్యకలాపాలు చోటు చేసుకుంటాయి. ఇంటర్మీడియెట్‍ రింగ్‍ రోడ్‍ ను మర్చిపోవడం అంటే నిర్మాణపరంగా హైదరాబాద్‍ను రేడియల్‍- కాన్‍ సెంట్రిక్‍ మహానగరం నుంచి గ్రిడ్‍ ఆధారిత నిర్మాణానికి మార్చడమే అవుతుంది. సెకండరీ / మాస్టర్‍ ప్లాన్‍ రోడ్లు రేడియల్స్, రింగ్స్ మధ్య గ్రిడ్స్ను రూపొందిస్తాయి.


సీఎం కేసీఆర్‍ చెబుతున్నట్లుగా హైదరాబాద్‍కు 5 రింగ్‍ రోడ్లు ప్రతిపాదన సాధ్యపడుతుందా ?
అవును, కచ్చితంగా సాధ్యపడుతుంది. ఒకప్పటి ఎంసీహెచ్‍ ఏరియా కోసం రివైజ్డ్ డెవలప్‍మెంట్‍ ప్లాన్‍లో ఇన్నర్‍ సర్క్యులర్‍ రోడ్‍ ప్రతిపాదించబడిందనే విషయం ఎంతో మంది ప్లానర్లు,
ఉన్నతాధికారులకు తెలియదు. ఇది ఒరిజినల్‍ డెవలప్‍ మెంట్‍ ప్లాన్‍ (1975 డిపి గా వ్యవహరించే వారు)లో ఉన్న అప్పటి లూప్‍ రోడ్‍ పై ‘రీవర్కింగ్‍’ మినహా మరొకటి కాదు. ప్రస్తుత రోడ్ల అలైన్‍ మెంట్‍ పైనే సాగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, నిర్దిష్ట రోడ్లను సర్క్యులర్‍ రోడ్‍ గా ప్రకటిస్తారు. నిర్దిష్ట రోడ్డు భూ భౌగోళిక అంశాలు, యాక్సెస్‍ కంట్రోల్‍, అదే విధంగా గ్రేడ్‍ సెపరేటర్స్ (పీవీఎన్‍ఆర్‍ ఎక్స్ ప్రెస్‍ వే సూపర్‍ ఫ్లై ఓవర్‍ మాదిరిగా) పాటిస్తారు. తద్వారా హైదరాబాద్‍ కోర్‍ సిటీ ట్రాఫిక్‍ ను స్ట్రీమ్‍ లైన్‍ చేయడం లాంటివి ఉంటాయి.


హైదరాబాద్‍ కోర్‍ సిటీ కోసం ఇన్నర్‍ సర్క్యులర్‍ రోడ్‍ (ఐసీఆర్‍ 1) ప్రతిపాదిత అలైన్‍ మెంట్‍
(డైరెక్షన్లు సవ్యదిశలో)
పశ్చిమం నుంచి తూర్పు
ప్రారంభం – బీఆర్‍ కేఆర్‍ భవన్‍ – జీహెచ్‍ఎంసీ మెయిన్‍ ఆఫీస్‍ ట్యాంక్‍ బండ్‍ రోడ్‍ – లిబర్టీ జంక్షన్‍ – హిమాయత్‍నగర్‍ రోడ్‍ – నారాయణగూడ
ఉత్తరం నుంచి దక్షిణం
నారాయణగూడ – ఆంధ్ర యువతీ మండలి టర్నింగ్‍ – బర్కత్‍ పురా చమన్‍ – టూరిస్ట్ హోటల్‍ సైడ్‍ రోడ్‍- నింబోలి అడ్డ- చాదర్‍ ఘాట్‍ బ్రిడ్జి – మలక్‍ పేట్‍ మెయిన్‍ రోడ్‍ – నల్గొండ ఎక్స్ రోడ్స్ – గవర్నమెంట్‍ డిస్పెన్సరీ రోడ్‍ – చంచల్‍ గూడ జైల్‍ సైడ్‍ రోడ్‍ – చంచల్‍ గూడ ఎక్స్ రోడ్స్ – సైదాబాద్‍ జంక్షన్‍ – దోభీఘాట్‍
తూర్పు నుంచి పడమర
దోభిఘాట్‍ – ఐఎస్‍ సదన్‍ జంక్షన్‍ – క్రీడా – ఉప్పుగూడ – భవానీ నగర్‍ – సుల్తాన్‍ షాహి (నార్త్ సైడ్‍), మొఘల్‍ పురా (సౌత్‍ సైడ్‍) – క్వాజీ పురా – బహద్దూర్‍ పురా – కిషన్‍ బాగ్‍ జంక్షన్‍
దక్షిణం నుంచి ఉత్తరం
బహదూర్‍ పురా జంక్షన్‍ – పురానా పూల్‍
తూర్పు నుంచి పశ్చిమం
జియాగూడ – కాగజ్‍గూడ – యూసుఫ్‍ నగర్‍ – టప్పాచబుత్రా – ఎస్బీఐ కాలనీ
దక్షిణం నుంచి ఉత్తరం
ఎస్బీఐ కాలనీ – ఉషోదయ కాలనీ – ఆసిఫ్‍ నగర్‍ – హుమాయున్‍ నగర్‍ (మిలిటరీ ఏరియా సైడ్‍ రోడ్‍) – ఎన్‍ఎండీసీ – మాసాబ్‍ ట్యాంక్‍ – జేఎన్‍ టీయూ – లక్డీకాపూల్‍ – సెక్రటరియేట్‍ – బీఆర్‍ కేఆర్‍ భవన్‍ – ముగింపు
హైదరాబాద్‍ మెట్రో ఏరియా సర్క్యులేషన్‍ నెట్‍ వర్క్ కు మెరుగుదలలు


పార్ట్ 1
దిగువ రోడ్‍ అలైన్‍ మెంట్స్ ను అత్యంత ప్రాధాన్యపూరితంగా తక్షణం అమలు చేయాల్సిన అవసరం ఉంది:
(ఎ) సికింద్రాబాద్‍ ప్రాంతంలో మేజర్‍ నెట్‍వర్క్కు మెరుగుదలలు (ఉత్తర హైదరాబాద్‍)
(1) ఎన్టీఆర్‍ జంక్షన్‍ నుంచి లింక్‍ రోడ్‍ (ఎస్పీ రోడ్‍ – పట్టిగడ్డ జంక్షన్‍) – పోలీస్‍ హాకీ స్టేడియం (రసూల్‍ పురా)కు పక్కనే
ఉండే రోడ్డు పొడుగునా స్ట్రెయిట్‍ ఫ్లై ఓవర్‍, ఇందిరానగర్‍ స్లమ్‍ మీదుగా ఎయిర్‍ పోర్ట్ గోడకు ముందు దాకా. 40 అడుగుల వెడల్పు అండర్‍ పాస్‍ తో నాలా వెంట్‍ ను వెడల్పు చేయడం (300 మీటర్ల దాకా) ఉత్తరం చివర. ఆ తరువాత ఉత్తరం కొస నుంచి పాత ఎయిర్‍ పోర్ట్ రోడ్డు పొడుగునా బోయిన్‍ పల్లి జంక్షన్‍, బోయిన్‍ పల్లి పోలీస్‍ స్టేషన్‍, కంటోన్మెంట్‍ ఏరియా ద్వారా బోయిన్‍ పల్లి చెక్‍ పోస్ట్ అవతలి హద్దు దాకా ఫ్లై ఓవర్‍. (అక్కడి నుంచి 6 లేన్‍ డివైడెడ్‍ నేషనల్‍ హైవే ప్రారంభమవుతుంది).
(2) ప్రత్యామ్నాయంగా ఎన్టీఆర్‍ జంక్షన్‍ కు బదులుగా అలైన్‍ మెంట్‍ ను ఎయిర్‍ పోర్ట్ టర్మినల్‍ అప్రోచ్‍ మీదుగా తీసుకెళ్లి, టర్మినల్‍ కంటే ముందు, 3 ఎయిర్‍ పోర్ట్ హ్యాంగర్లకు కాస్తంత ముందుగా కుడి వైపు టర్న్ తీసుకోవాలి. నాలా వెంట్‍ తో జాయిన్‍ అవుతాం (విమానాశ్రయ స్థలంలోనే నూతన రోడ్‍ అలైన్‍ మెంట్‍ – ఎన్‍ఏఐతో చర్చల ద్వారా). ఆ తరువాత నాలా వెడల్పు చేయాలి (సుమారు 300 మీటర్ల దాకా, 40 అడుగుల అండర్‍ పాస్‍తో, నార్త్ ఎండ్‍). ఆ తరువాత నార్త్ ఎండ్‍ నుంచి ఓల్డ్ ఎయిర్‍ పోర్ట్ రోడ్‍ పొడుగునా బోయిన్‍ పల్లి జంక్షన్‍, కంటోన్మెంట్‍ ఏరియా నుంచి బోయిన్‍ పల్లి చెక్‍ పోస్ట్ వెలుపలి హద్దు దాకా ఫ్లై ఓవర్‍ (6 లేన్‍ డివైడెడ్‍ నేషనల్‍ హైవే మొదలయ్యే చోటు)
(3) పై వాటికి అదనంగా, ఎన్‍ హెచ్‍ 44 పొడుగునా, కొంపల్లి జంక్షన్‍ నుంచి ఆర్‍ అండ్‍ బి రోడ్‍ (కొంపల్లి – బొల్లారం రైల్వే స్టేషన్‍ రోడ్‍) 1 కి.మీ. రాయి వరకు, ఆ తరువాత అక్కడి నుంచి ఒక కొత్త రోడ్‍ అలైన్‍ మెంట్‍ (హకీంపేట్‍ ఎయిర్‍ ఫోర్స్ జంక్షన్‍ కంటే ముందు, షామీర్‍ పేట్‍ హైవే వరకు స్ట్రెయిట్‍ లైన్‍ రోడ్‍), కంటోన్మెంట్‍ ఏరియా కొద్దిపాటి భాగం వద్ద ఫ్లై ఓవర్‍తో. ఇది ఇప్పటికే ఎంతో ఇరుగ్గా మారిపోయిన కరీంనగర్‍ స్టేట్‍ హైవే కు వెళ్లేందుకు, అక్కడి నుంచి వచ్చేందుకు ఎన్‍ హెచ్‍ 44, బేగంపేట్‍ ద్వారా ఎంతగానో ట్రాఫిక్‍ మళ్లింపు ను అందిస్తుంది. (సీఎం కేసీఆర్‍ గారికి సైతం చక్కటి రాచ మార్గంగా ఉంటుంది).
(బి) కూకట్‍పల్లి నాలా పొడుగునా నూతన రోడ్డు పశ్చిమ దిశ ఓపెనింగ్‍:
పైన పేర్కొన్న 2వ అంశానికి సంబంధించి నా సూచనలు పాటించాలి –
రన్‍ వే కింద ఉన్న నాలా వెంట్‍ ను 40 అడుగులకు వెడల్పు చేసిన తరువాత శోభనా టాకీస్‍ జంక్షన్‍ (బాలానగర్‍ వై జంక్షన్‍) వద్ద ఓల్డ్ ఎయిర్‍ పోర్ట్ రోడ్‍ ను చేరుకునేందుకు వీలుగా ఎయిర్‍ పోర్ట్ కాంపౌండ్‍ వాల్‍ పక్క నుంచి ఫ్లై ఓవర్‍ నిర్మించాలి.
(ii) హచ్‍ పి స్కూల్‍ సమీపంలో ప్రస్తత ఫ్లై ఓవర్‍ ఒక విభాగాన్ని బేగంపేట్‍ స్టేషన్‍ ఫ్లైఓవర్‍ కిందుగా అండర్‍ పాస్‍ గా కూకట్‍ పల్లి నాలాకు సమాంతరంగా తీసుకెళ్లాలి. అది పీవీ నరసింహా రావు స్మారకం కంటే ముందు నెక్లెస్‍ రోడ్‍ ను చేరుకుంటుంది.
(సి) మూడో అంశం వద్ద నా సలహా…. గ్రీన్‍ ల్యాండ్స్ టి జంక్షన్‍ నుంచి నెక్లెస్‍ రోడ్‍కు లింక్‍ ఇవ్వడం. జల విహార్‍ సమీపంలో నెక్లెస్‍ రోడ్‍ను చేరుకునేందుకు… జంక్షన్‍తో సహా.
(డి) తారకరామ అమెరికన్‍ కేన్సర్‍ హాస్పిటల్‍ వద్ద జంక్షన్‍గా చేసేందుకు రేతి బౌలి వద్ద ఐఆర్‍ఆర్‍ను లింక్‍ చేయడం:
తారకరామ అమెరికన్‍ కేన్సర్‍ హాస్పిటల్‍ వద్ద రోడ్‍ నెం.10, రోడ్‍ నెం.12 ను చేరుకునేందుకు వీలుగా రేతిబౌలి జంక్షన్‍ (ఇన్నర్‍ రింగ్‍ రోడ్‍, మెహిదీపట్నం రోడ్‍ జంక్షన్‍) ముందు ఉన్న కంటోన్మెంట్‍ స్థలం నుంచి 2 కి.మీ. పొడవైన ఫ్లై ఓవర్‍ ను నిర్మించడం
(ఇ) ఇన్నర్‍ సర్క్యులర్‍ రోడ్‍ ను తిరుగులేనిదిగా మార్చడం:
దయచేసి స్టేట్‍ మెంట్‍ రూపంలో, మ్యాప్‍ రూపంలో ఉన్న అలైన్‍ మెంట్‍ చూడగలరు. ఈ అలైన్‍ మెంట్‍ను 100 అడుగులతో చేయడం (4 లేన్ల డివైడెడ్‍ క్యారేజ్‍ వే, రెండు పక్కలా సర్వీస్‍ రోడ్లతో) కోర్‍ హైదరాబాద్‍ సిటీ లో మూమెంట్‍ ను మరింత స్ట్రీమ్‍ లైన్‍ చేస్తుంది.
(ఎఫ్‍) వరంగల్‍ నేషనల్‍ హైవేను చేరుకునేందుకు వీలుగా కాచిగూడ స్టేషన్‍ వద్ద ఫ్లైఓవర్‍
ప్రస్తుత కాచిగూడ స్టేషన్‍ రోడ్డు లో స్టేషన్‍ దక్షిణం వైపు నుంచి వరంగల్‍ నేషనల్‍ హైవే -202 కు లింక్‍ ఏర్పాటు ట్రాఫిక్‍ మూమెంట్‍ ను మరింత సరళతరం చేస్తుంది.
(జి) ఒకప్పటి ఎంసీహెచ్‍ పరిధిలో ఇన్నర్‍ రింగ్‍ రోడ్‍కు వీలు కల్పించడం అంటే మాస్టర్‍ ప్లాన్‍ ప్రకారం తగు రోడ్‍ జియోమెట్రిక్స్ తో 6 లేన్స్ డివైడెడ్‍ క్యారేజ్‍ వే, రెండు పక్కలా సర్వీస్‍ రోడ్లతో 150 అడుగుల (45 మీటర్లు)కు వెడల్పు చేయడం. ఇది ట్రాఫిక్‍ రాకపోకలు సజావుగా ఉండేలా చేస్తుంది.
ఈ విధంగా హైదరాబాకు ఉండే 5 రింగు రోడ్లు:
(1) 100 ఫీట్ల రైట్‍ ఆఫ్‍ వే, 26 కి.మీ. పొడవు తో కూడిన ది ఇన్నర్‍ సర్క్యులర్‍ రోడ్‍
(2) 45 మీటర్ల రైట్‍ ఆఫ్‍ వే, 52 కి.మీ. పొడవైన ఇన్నర్‍ రింగ్‍ రోడ్‍
(3) 60 మీటర్ల రైట్‍ ఆఫ్‍ వే, 96 కి.మీ. పొడవైన ఇంటర్మీడియెట్‍ రింగ్‍ రోడ్డు
(4) 150 మీటర్ల రైట్‍ ఆఫ్‍ వే, 158 కి.మీ. పొడవుతో అవుటర్‍ రింగ్‍ రోడ్డు
(5) 90 మీటర్ల రైట్‍ ఆఫ్‍ వే, 290 కి.మీ. పొడవుతో రీజనల్‍ రింగ్‍ రోడ్‍
పై అంశాలను పూర్తి అలైన్‍ మెంట్‍ ఆర్‍ఓడబ్ల్యూ, స్టేటస్‍తో ముందుకు తీసుకెళ్లి అమలు చేయాలి. అప్పుడు మాత్రమే మెట్రోపాలిటన్‍ ట్రాఫిక్‍ నెట్‍ వర్క్ స్ట్రీమ్‍ లైన్‍ అవుతుంది. ఇది ఇతర కార్యకలాపాలకు (జనాభా, ఆర్థిక కార్యకలాపాల పంపిణి రెండింటి కీ) సైతం తగిన నిర్మాణాన్ని ఏర్పరచగలుగుతుంది. తద్వారా హైదరాబాద్‍ మెట్రోపాలిటన్‍ ఏరియాను దేశంలోనే ప్రీమియర్‍ వాటిల్లో ఒకటిగా చేయడం సాధ్యపడుతుంది.

  • విశ్వనాథ్‍ శిష్టా
    మాజీ సభ్యులు (ప్లానర్‍), హెచ్‍ఎండీ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *