తన అద్భుతమైన పెయింటింగ్‍తో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ ఔరా అనిపిస్తున్నారు ఆర్టిస్టు చిలువేరు ఉదయలక్ష్మి.
విద్యాభ్యాసం :
- మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్టస్ (ఎంఎఫ్‍ఏ) పెయింటింగ్. సరోజిని నాయుడు స్కూల్ ఆఫ్ పెర్పామింగ్ ఆర్టస్, ఫైన్ ఆర్టస్ అండ్ కమ్యూనికేషన్, యూనివర్సిటీ ఆఫ్ హైద్రాబాద్, 2000- 2002
- బాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్టస్ (పెయింటింగ్). శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్టస్, ఉస్మానియా యూనివర్సిటీ, 1994- 99.
ఎగ్జిబిషన్స్
- గ్రూప్ ఎగ్జిబిషన్స్ నవదేవ్ 2017, అలయన్స్ ప్రాన్సెస్, హైదరాబాద్.
- సోలో షో ప్లోరల్, ఫీస్ట్, ఇకబానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్, ఆలంకృ త ఆర్ట్ గ్యాలరీ – 2016
- ఫెమిన్ డిసిల్లియన్స్ – ఫస్ట్ ఈవర్ గ్రూప్ విమెన్ ఆర్టిస్ట్ షో, హైదరాబాద్ 2011.
- సోలో షో, శ్రేష్ట ఆర్ట్ గ్యాలరీ, సెప్టెంబర్ 2011
- గ్రూప్ షో (ఆర్ట్ అండ్ తెలంగాణ) ఇండియా హ్యాబిటెట్ సెంటర్, న్యూ ఢిల్లీ. చావాలాల్ ఆర్ట్ గ్యాలరీ, 2010
- స్టూడియో నాపియన్ గ్రూప్ షో మే, 2009
- గ్రూప్ షో, సెంటర్ ఆర్ట్ గ్యాలరీ, చేర్రీ ఆర్చార్ట్, హయత్ హోటల్ కలకత్తా 2008.
- వన్ ఉమెన్ షో, సృష్టి ఆర్ట్ గ్యాలరీ, డిసెంబర్ 2007
- గ్రూప్ షో, చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్టస్, సెప్టెంబర్ 2007.
- గ్రూప్ షో, భారతీయ కళాభవన్, లండన్ 2007
- గ్రూప్ షో, హస్త ఆర్ట్ గ్యాలరీ 2007
- వన్ ఉమెన్ షో, సృష్టి ఆర్ట్ గ్యాలరీ 2005
- గ్రూప్ షో,సృష్టి ఆర్ట్ గ్యాలరీ 2002
- గ్రూప్ షో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 2000
- గ్రూప్ షో, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్టస్ 1998, 1999
అవార్డ్స్
- సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అండ్ క్యాష్ ప్రైజ్ రీజినల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ చిత్రకళ, సంసాద్, మచిలీపట్నం 1996
- హైలీ కమాండెడ్ సర్టిఫికెట్ క్యాష్ ప్రైజ్, ఆంధ్ర ప్రదేశ్ 50 ఇయర్స్ ఆర్ట్ ఇండిపెండెంట్ ఇండియా ఎగ్జిబిషన్ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, హైదరాబాద్ 1997
- సర్టిఫికెట్ ఆఫ్ హైలీ కమాండెడ్ 57 ఆలిండియా ఆర్ట్ ఎగ్జిబిషన్, ది హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ హైదరాబాద్ 1998
- హైలీ కమాండెడ్, స్టేట్ లెవెల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్.1998
- క్రియేట్ ఎంట్రీ, ఫస్ట్ ఆలిండియా ఎగ్జిబిషన్ ఆఫ్ ఆర్టస్ ఇన్ స్మాల్ ఫార్మల్ ఆర్ట్ అసోసియేషన్ హైదరాబాద్ 1998.
మహిళల కోసం హృదయ కళాకేంద్రం స్థాపన
భారతీయ సంప్రదాయ చిత్రకళ సారానికి తన ప్రత్యేక శైలిని జోడించి ఆమె అందమైన చిత్రాలను చిత్రిస్తున్నారు. విభిన్న కోణాలలో ప్రయోగాలు చేస్తూ తన పూర్తి సమయాన్ని చిత్రకళకు కేటాయిస్తున్నారు. ఆమె తన సృజనాత్మకత ప్రయాణంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూస్తున్నారు. ఉదయలక్ష్మి తన ప్రతి ప్రదర్శనలో వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటుంది. ఆ విధంగానే తన నాలుగో చిత్రకళ ప్రదర్శనలో పుష్పాలు, తంజావూరు చిత్రకళ సమ్మేళనం కనిపిస్తుంది. ఆమె మహిళల కోసం హృదయ కళా కేంద్రాన్ని స్థాపించి రెండు దశాబ్దాలుగా కొన్ని వందల మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. చిత్రకళలో మహిళలలకు సృజనాత్మకను పెంపొందించడమే ఉదయలక్ష్మి లక్ష్యంగా ఉంది. ప్రతి మహిళ ఒక కళాకారినిగా ఎదగాలనే సంకల్పంతో ఆమె కృషి చేస్తున్నారు. తన కుటుంబ బాధ్యతల పట్ల కొన్ని సందర్భాల్లో ఆసక్తి, సృజనాత్మకత పట్ల శ్రద్ధ వహించలేక పోయానని ఆమె అభిప్రాయం. మహిళలు తమ జీవితంలో ఏ దశలోనైనా సాధన చేసి ఉన్నత స్థానంలో నిలవాలంటున్నారు. ఇది మహిళల మానసిక శక్తిని పెంపొందించడంలో దోహద పడుతుందంటారు ఉదయ లక్ష్మీ.
– రామకృష్ణ కాంపాటి,
9866168863