మానవుడు ప్రకృతితో సహజీవనం చేయాలి : వి.ప్రకాశ్‍

వి. ప్రకాశ్‍గారితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వాటర్‍ రిసోర్స్ డెవలప్‍మెంట్‍ కార్పొరేషన్‍ ఛైర్మన్‍ వి.ప్రకాశ్‍ గారితో ‘దక్కన్‍ ఛానెల్‍’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
లాక్‍డౌన్‍ పిరియడ్‍లో మీకు కలిగిన ఆలోచనలు, అంతర్మథనాలు ఏమిటి?
లాక్‍డౌన్‍ అనేది ఒకరకంగా మంచిదేనని అనిపించింది. ఎందుకంటే బయటికి వెళ్ళక పోవడం వల్ల ఎక్కువ సమయం మన గురించి ఆలోచించుకోవడానికి, చాలా కాలం నుంచి పెండింగ్‍లో ఉన్న పనులు చేయడానికి ఒక అవకాశాన్ని ఇచ్చింది. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనుషుల లోపల చాలా ఆలోచనలు రేకిత్తించింది. ఈ లాక్‍డౌన్‍ అనేది దాదాపు 182 దేశాలల్లో పాక్షికంగా, పూర్తిగా అమలయింది. మనిషి తన ఆరోగ్యం గురించి ఆలోచించడం మొదలైంది. ఈ ఉరుకుల పరుగుల జీవితాలల్లో ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని పట్టించు కోక పోవడం, కనీసం అయిదు నిమిషాలు స్నానం చేయడం కూడా మరిచి పోయాడు. అదేవిధంగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోయినాయి. శరీరం గురించి పూర్తిగా విస్మరించాడు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నాడు. వీటన్నిటి మీద అంతర్మథనం అనేది ప్రతి ఒక్కరికి మొదలైంది. కొందరికి ఎక్కువగా ఉండచ్చు, కొందరు పైపై ఆలోచించ వచ్చు. కానీ ఒక చర్చ మాత్రం ప్రారంభమైంది. కనుక వాళ్లు భవిష్యత్తులో చేయాల్సిన పనులు ఏంటి? కంటికి కనబడని సూక్ష్మ జీవి ఈ రకంగా మన మీద దాడి చేస్తునప్పుడు, జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి మొదలైనప్పుడు మనిషిలో వేదాంత ధోరణి మొదలవుతుంది. వైరాగ్యం వస్తది. అదంతా ఇప్పుడు మనం చూస్తున్నాం.
భూతాపం పెరుగుట వల్ల ఓజోన్‍ పొర, పర్యావరణం దెబ్బ తింటుందని అంటున్నారు కదా? ఒకవేళ దీన్ని ఏ విధంగా నియంత్రించ వచ్చు?
మనం వెనుకటి మూలాల్లోకి వెళ్ళాలి. గతమంతా చెడుకాదు. గతంలో మంచే ఎక్కువ ఉంది. సనాతన జీవన విధానంలో ప్రకృతితో కలిసి మనిషి సహ జీవనం చేసినాడు. మనం ప్రకృతికి దూరంగా వెళ్లుతున్నాం. ఎంత దూరం వెళ్ళితే అంత సమస్యలు మనిషికి ఎదురవుతాయి. నేడు పర్యావరణాన్ని అనుక్షణం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. తరువాత మన ఆహారపు అలవాట్లను మార్చు కోవాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనా ధోరణిని కూడా మార్చుకోవాలి.
ప్రజలు, ప్రభుత్వాలు ఏ మేరకు ఈ విపత్కర పరిస్థితులను తట్టుకోగల్గుతాయి?
ప్రజలకు మరో మార్గం లేదు, లాక్‍డౌన్‍ చేశారు. కాబట్టి ఎలాంటి వారైనా కూడా నాలుగు గోడల మధ్య బందీ కావాల్సి పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ ప్రభుత్వాలే కొంత మంది విషయాల్లో చేయాల్సినంత చేయలేదని అనిపిస్తుంది. తెలంగాణాకు సంబంధించినంత వరకు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా సంతృప్తికరంగానే ఉన్నాయని కేంద్ర బృందం కూడా నివేదిక ఇస్తుంది. ఉదాహరణకు ఆర్ధిక సమస్యలున్నాయి. ముఖ్యమంత్రిగారు అడిగిన హెలికాప్టర్‍ మనీగానీ, క్వాటిడెటింగ్‍ ఈజింగ్‍ మనీ గాని ఏదీ కూడా మనకు రాలేదు. ఆర్థికంగా చూసినట్లైయితే మనకు కేంద్రం నుండి పెద్దగా సహాయం రాకపోగా మన బడ్జెట్‍లో కూడా ఇదివరకే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి చూశాం. ఒక పక్కన గ్రోత్‍ రేట్‍ తగ్గింది. ఇంకో పక్క కేంద్ర సాయం కూడా తగ్గింది. మరి ఈ పరిస్థితులల్లో చేయగల్గినంతా ఈ ప్రభుత్వం చేస్తున్నది.
ప్రభుత్వాలు వైద్యరంగంలోనూ, శాస్త్ర సాంకేతిక రంగంలోను అనుసరించవలసిన ప్రణాళికలు ఏమిటి?
ప్రభుత్వాల విషయానికి వచ్చినప్పుడు శాస్త్ర విజ్ఞాన రంగంలో పరిశోధనలకు భారతదేశంలో అసలు ఫండింగ్‍ లేదు. వాస్తవానికి గొప్ప గొప్ప సైంటిస్ట్లంతా విసిగిపోయి ప్రభుత్వాలకు అప్పీలు చేసి, చివరకు వేరే దేశాలకు పోయి అక్కడ ప్రభుత్వాలతోని ఫండింగ్‍ తీసుకొని అక్కడ నోబుల్‍ ప్రైజ్‍ తెచ్చుకుంటున్నారు. అక్కడ గొప్ప సైంటిస్ట్గా వాళ్ల ఇన్నోవేషన్స్ అన్ని కూడా ప్రపంచానికి ఇస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వం, ఏ ప్రధాని కూడా పరిశోధన, అభివృద్ధి విషయంలో చూపెట్టాల్సినంత శ్రద్ధ చూపెట్టలేదు.


కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయంగా విద్యాసంస్థలు ఎలా ఉండబోతున్నాయి? ప్రైవేటు పరంగా ఎలా ఉండబోతున్నాయి? మన ప్రభుత్వాలు విద్యా సంస్థలకి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది?
ఒకటి డిజిటల్‍ ఎడ్యుకేషన్‍ పెంచాల్సిన అవసరం ఉంది. రెండోవది టెక్నికల్‍ వైపు. రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలోనే గొప్ప పారిశ్రామిక దేశంగా తయారు కాబోతుంది. ఇవాళ చైనాకు పోయే పెట్టుబడులు చాలా వరకు భారతదేశం వైపుకు మళ్ళే అవకాశం ఉంది. అదే విధంగా చైనా నుండి విత్‍డ్రా చేసుకునే పెట్టుబడులు కూడా భారతదేశంకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా స్మాల్‍ స్కేల్‍ ఇండ్రస్టీ, మైక్రో ఇండ్రస్టీస్‍ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. విద్య, వైద్యం మీద ఎక్కువ బడ్జెట్‍ కేటాయించాల్సిన పరిస్థితి మాత్రం ఉంది.
తరగతి గదులు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు డిజిటల్‍ విద్యా అనేది ప్రారంభిస్తే సామాన్య ప్రజలకు ఇది అందుబాటులో ఉంటుందా?
ఇరవై సంవత్సరాల క్రితమే మన ప్రభుత్వాలు ప్రారంభించాయి. ఇప్పటికీ డిజిటల్‍ ఎడ్యుకేషన్‍ తీసుకురాకపోతే ప్రపంచానికి మనం చాలా దూరంగా ఉండాల్సి వస్తది. అందరూ భారతదేశం వైపు చూస్తున్నప్పుడు వాళ్ల అవసరాలకు తగ్గట్టు మనం తయారు కావాల్సిన అవసరంముంది. మన అస్థిత్వాన్ని కాపాడుకుంటునే మన వాళ్లను మంచి టెక్నీషియన్స్గా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఉన్న విద్యా విధానం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇది గుమస్తాలను తయారు చేసే విద్యా విధానమే. ఏదో సిలబస్‍లో తెలంగాణ వచ్చిన తరువాత కొన్ని మార్పులైతే వచ్చిన మాట వాస్తవం. కానీ ఆశించిన మేరకు ఒక శాస్త్రీయ విజ్ఞానాన్ని ఇచ్చేది గానీ, తరువాత ఇక్కడ భారతీయ సంసృతిని ప్రతిబింబించేది గానీ, ప్రజలకు అవసరమైన విద్యావిధానం గానీ ఇప్పటికీ రాలేదు. రావాల్సిన అవసరం అయితే ఉంది.
కరోనావైరస్‍ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైద్య రంగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్‍ ఇంకా తయారు కాలేదు? వ్యాక్సిన్‍ తయారు కావడానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు? ఆ సమయంలో లాక్‍డౌన్‍ ఎత్తేస్తే దీన్ని ఏ విధంగా ఎదుర్కోగల్గుతాం?
వ్యాక్సిన్‍ వచ్చినా, రాకున్నా ఇమ్యూనిటీ ఉన్నవాడు బతుకుతున్నాడు. ఇమ్యూనిటీ లేనివాడు మరణిస్తున్నాడు. కావున వ్యాక్సిన్‍ మీదా ఆధారపడకుండా రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండాలి? సేంద్రీయ ఎరువులు, సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలా లేకపోతే ఇప్పుడున్నటువంటి ఫెస్టిసైడ్స్ ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాలా?
బతకాలనుకుంటే మంచి అలవాట్లు తెచ్చుకోవాలి. వ్యాపారస్తులకు మనుషుల ప్రాణాల గురించి పట్టింపు ఉండదు. అందుకే ఇవాళ ఈ ఎరువులను, పురుగుమందులను ఇష్టం వచ్చినటుగా వ్యవసాయంలో వినియోగిస్తున్నారు. ఇవాళ మట్టిని చంపేసారు. మెల్లిమెల్లగా మనం ప్రకృతి వ్యవసాయానికి రాకపోతే ఇక దేవుడు కూడా మనల్ని కాపాడలేడు.
కరోనా వ్యాప్తి వైరస్‍ ప్రపంచ వ్యాప్తంగా 33 లక్షలకు చేరింది? అదే విధంగా భారతదేశంలో 35 వేలకు పైగా చేరింది? ఒక వేళ లాక్‍డౌన్‍ ఎత్తివేస్తే ఈ వైరస్‍ చనిపోతుందా? ఇదే వైరస్‍ కంటిన్యూ అవుతుందా?
ఇప్పుడు హెరిడీ ఇమ్యూనిటీ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఏందంటే ఎక్కువ మందిని ఓపెన్‍గా పంపించినటైయితే వైరస్‍ వాళ్ల శరీరాల్లోకి వచ్చి ఆ శరీరాలల్లో ఆ ఇమ్యూనిటీ వల్ల దాని చైన్‍ తెగిపోతుంది. తెగిపోవడం వల్ల స్లోగా వైరస్‍ అంతరిస్తదని. కానీ ఆ ప్రయోగం లండన్‍లో విఫలం అయింది. మళ్లీ అది మన దగ్గర ప్రయోగించడం అన్నది మంచిది కాదు. సరే ఏది ఏమైనా కూడా ఈ లాక్‍డౌన్‍ అనేది కండీషన్‍గా ఉండాలి.
ఇప్పుడైతే కరోనా వైరస్‍ వచ్చింది? మున్ముందు ఏ వైరస్‍లు రాకుండా ఉండడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. మళ్లీ వాతావరణంలో వేడిని తగ్గించాలి. గ్లోబల్‍ వార్మింగ్‍ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ గానీ, ప్రపంచ పర్యావరణ సంస్థలు గానీ, లేదా నిపుణులుగానీ ఏదయితే చెబుతున్నారో అది అనుసరించాలి. తెలంగాణ ప్రభుత్వం చాలా వరకు ఆ దిశలో ప్రయత్నిస్తున్నది. 230 కోట్ల మొక్కలు పెట్టాలన్న ఒక సంకల్పంతో హరితహారాలు చాలా విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి.
కరోనాని ఎదుర్కోవడంలో వైద్యరంగంలోను, శాస్త్ర సాంకేతిక రంగంలోనూ జరగవలసిన కృషి ఏమిటి?
రీసెర్చ్ అండ్‍ డెవలప్‍ మీద బాగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. వైద్యరంగంలో కేవలం అలోపతి మీద ఆధారపడకుండా మన దేశీయ వైద్య విధానాలు, ఆయుష్‍ ద్వారా హొమియో, యూనానీ, ఆయుర్వేదం, సిద్దవైద్యం ఇలాంటివన్నింటికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరముంది. ఎలాంటి వైరస్‍లు వచ్చిన కూడా తట్టుకొనే విధంగా తన శరీరాన్ని నిర్మాణం చేసుకోగల్గుతాడు.
రేపటి ప్రపంచం ఎలా ఉండబోతున్నది? ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి?
రేపటి ప్రపంచం ఎలా ఉండబోతున్నది అనేది ప్రభుత్వాలు అనుసరించే విధానాల మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు కరోనా వల్ల మనుషుల లోపల ఒక చర్చ అయితే మొదలైంది.
ప్రైవేటురంగ ఉద్యోగస్తులపై కరోనా ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది?
అన్‍ ఎంప్లాయ్‍మెంట్‍ అనేది చాలా ఎక్కువైతది. రాబోయే రెండు మూడు సంవత్సరాలు భారతదేశంలోని ఏ రాష్ట్రానికైనా కూడా ఈ అన్‍ ఎంప్లాయ్‍మెంట్‍ సమస్య చాలా తీవ్రంగా ఉంటది. ప్రైవేటురంగం కూడా చాలా వరకు నష్టాల్లోకి నెట్టబడింది. విదేశాలల్లో ఉన్న మన వాళ్లు కూడా మనదేశంకు తిరిగి వచ్చే పరిస్థితి ఉన్నది. తెలంగాణలో ఇవాళ సాగు భూమి పెరుగుతున్నది.


ఐటి ఎంప్లాయ్స్ టీ- అబ్ అనేది గవర్నమెంట్‍ ప్రొవైడ్‍ చేసింది. మీరు చెప్పినట్లు బీటెక్‍, ఎంటెక్‍ చేసిన వాళ్లు కూడా వ్యవసాయ రంగంలోకి వెళ్లితే వాళ్లకు ఏ విధమైన ప్లాట్‍ఫాం ఇవాల్సిన బాధ్యత గవర్నమెంట్‍ మీద ఉండబోతున్నది?
ఆ రకమైన ఒత్తిడి అనేది ప్రభుత్వం మీద వచ్చినప్పుడు తప్పకుండా టీఆఫ్‍ లాగా వ్యవసాయ రంగంలోను ట్రైనింగ్‍ క్లాసులు ప్రారంభమవుతాయి. ఇప్పుడు నేను ఛైర్మన్‍గా ఉన్న వాలంటరీ వాటర్‍ అండ్‍ ల్యాండ్‍ మేనేజ్‍మెంట్‍ ట్రైనింగ్‍ అండ్‍ రీసెర్చ్ సెంటర్‍. నేను ఒక మూడు నెలల కోర్సు కండక్ట్ చేస్తున్నా. ఇంటర్మీడియేట్‍ ఫెయిల్‍ అయిన వాళ్లను తీసుకుంటున్నా. ఎందుకంటే వాళ్లకు జాబ్స్ వచ్చే పరిస్థితి లేదు. కనుక ఒకసారి ట్రైనింగ్‍ ఇస్తే వాళ్లు లైఫ్‍ అంతా వ్యవసాయ రంగ నిపుణులుగా సేవలు అందిస్తారనే ఉద్దేశ్యంతో. ఇంటర్మీడియేట్‍ ఫెయిల్‍ అయిన వాళ్లను మేము ట్రైనీలుగా పెట్టుకున్నాం. రెండు బ్యాచ్‍లలో నలభై, నలభై మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. మూడో బ్యాచ్‍ కూడా స్టార్ట్ అయ్యింది. ఇలాంటి వాళ్లు ఎవరైతే ఐటి నిపుణులు వ్యవసాయ రంగంలోకి రావాలనుకుంటారో వాళ్లు కన్సల్‍టెన్సీల ద్వారా వాళ్లు సేవలు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా ఆర్గానిక్‍ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్లకు చాలామందికి ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఎలా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు, ఎలా లాభాలు ఆర్జించవచ్చు అనేది కూడా వాళ్లు ట్రైనింగ్‍ ఇస్తున్నారు. చాలా మంది రైతులు వాళ్ల పొలాల్లో ప్రాక్టికల్‍గా కూడా శిక్షణ ఇస్తున్నారు. ఇటువంటి ఎడ్యుకేటర్స్కి ఒక నెల రోజులుగానీ, వారం గానీ ఉండి నేర్చుకొని మీరు కూడా ఆ రంగంలో అడుగుపెడితే బాగుంటుందని ఐటి నిపుణులకు చెబుతాఉన్నాం. ఎవరైతే ఉద్యోగం లేదో వాళ్లు నిరుత్సాహ పడకుండా, ఆఫీసుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా జాబ్‍ కోసం చేసే ప్రయత్నాలు ఆన్‍లైన్‍ ద్వారా చేసు కుంటూనే ఏమన్నా ఇంటర్య్యూలు వచ్చినప్పుడు హాజరవుతూనే వాళ్లు వ్యవసాయం మీద దృష్టిపెడితే దేశంలో, రాష్ట్రంలో కూడా ఆహార కొరత తీర్చిన వాళ్లం అవుతాం. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల నష్టమైతే రాదు. ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు తక్కువగా ఉంటాయి. కాబట్టి అమెరికా నుంచి వచ్చే ఐటి నిపుణులు కావొచ్చు, ఇక్కడున్న వాళ్లు కావొచ్చు, జాబ్‍ లేని వాళ్లకు వ్యవసాయరంగం మాత్రం మంచి ఉపాధిని చూపెడుతుంది.
మన దేశ ఫెడరల్‍ వ్యవస్థ ఎలా ఉండబోతుంది?
ఫెడరల్‍ వ్యవస్థలో పెద్ద తేడా ఏం ఉండదు. ఇది ఫెడరల్‍ వ్యవస్థ కానే కాదు. మీరు అర్థం చేసుకోవలసినది ఏందంటే ఇందులో ఫెడరల్‍ స్వభావమే లేదు. ఇదంతా కూడా రాష్ట్రాలకు ఉన్న పరిమిత హక్కులు ఏవైతే అంబేద్కర్‍ రాజ్యాంగంలో రాసిండో మోదీ గారు ఒకటొకటి హరించికుంటా పోతున్నారు. రాష్ట్రాలకు ఉన్న స్వేచ్ఛను హరించే ప్రభుత్వమే మన మోదీ ప్రభుత్వం. గతంలో నీటి మీద హక్కు రాష్ట్రాలకు ఉండేది. ఇవాళ ఏం చేశారు డ్యామ్‍ల మీద, రిజర్వాయర్‍ మీద ఇంటర్‍ స్టేట్‍ రివర్స్ మీద అన్నింటి మీద మాకే హక్కులు ఉండాలని చెప్పి బిల్లులను పెడుతున్నారు పార్లమెంట్‍లో. ఏ విషయంలో చూసినా కూడా రాష్ట్రాలకు ఫెడరల్‍ విధానం లేదు. ఇవాళ అన్ని కూడా కేంద్రం మీద ఆధారపడే స్థితికి నెట్టబడ్డాయి. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటదనే విషయాన్ని అమిత్‍ షా, మోదీ, ఆర్‍ఎస్‍ఎస్‍ తెలుసుకోవలసి ఉన్నది. ఆఖండ భారత్‍ పేరుతో వాళ్లు మొత్తం ఢిల్లీలో కూర్చుని చక్రం తిప్పాలి, డామినేట్‍ చేయాలి అని చూస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఫెడరల్‍ స్ఫూర్తితో నడిచే దేశం మనది. ఆ స్ఫూర్తికి కూడా గండి కొట్టారు. ఆ ఫెడరల్‍ స్వభావమే లేకుండా పోయింది.
అన్ని రాష్ట్రాల సీఎంలు ఏమని చెబుతున్నారంటే కరోనా వైరస్‍ వ్యాప్తి చెందుతున్న నేపథ్యం కాబట్టి మా దగ్గర ఫైనాన్షియల్‍గా బడ్జెట్‍ లేదు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో 69 వేల కోట్ల రూపాయల బకాయిలు ఏవిధంగా రద్దుచేసింది ప్రభుత్వం. అది దేని కొరకు?
రద్దు చేయాల్సిన స్థితికి నెట్టబడ్డారు. భవిష్యత్తులో ఇట్లాంటి తప్పులు చేయకుండా ఉంటే రాబోయే రోజుల్లో మన ఎకానమీ అనేది ప్రపంచంలోనే నంబర్‍ వన్‍ ఎకానమీ అయ్యే అవకాశం ఉంటది.
ఆధునిక వ్యవసాయరంగాన్ని ప్రవేశపెడితే ప్రభుత్వాలు ప్రైవేటురంగ సంస్థలతోని ఏ విధంగా మనీని రోటేట్‍ చేస్తది?
ఇప్పుడు ఆధునిక పద్ధతుల్లో రైతులు వాళ్ల పద్ధతుల్లో వాళ్లు నిర్వహించుకుంటున్నారు. కొంత ప్రభుత్వం వాళ్లకు సపోర్టు ఇస్తున్నది. వ్యవసాయంలో మన తెలంగాణలో జరుగుతున్న కృషి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదు.
లాక్‍డౌన్‍ పిరియడ్‍ను పొడిగిస్తే ఆకలి మరణాల రేటు పెరుగుతుందా?
లాక్‍డౌన్‍ల్లో కూడా ప్రతి ఒక్కరికి ఆహారం అందుతా ఉన్నది రెండు కోట్ల మందికి హరేరామ హరేకృష్ణ మిషన్‍ ఆహారం అందిస్తుందని చెప్పారు. తరువాత మన దగ్గరున్న స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా ముందుకు వచ్చాయి. కేవలం స్వచ్ఛంద సంస్థల ద్వారానే హైదరాబాద్‍ సిటీలో రోజుకు లక్ష మందికి పైగా ఆహారం అందుతా ఉన్నది. దీర్ఘకాలికంగా లాక్‍డౌన్‍ ఉంటే కొంత ఇబ్బంది ఎదురౌతది.
ప్రైవేట్‍ పాఠశాలల్లో విద్యారంగంలోని స్కూలల్లో పిల్లలు ఒకే తరగతి గదిలో కూర్చుంటారా? ఏ విధంగా విద్యార్థుల మీద ఒత్తిడి ఉంటది?
వాళ్లకు వైరస్‍ ఎఫెక్ట్ లేనప్పుడు ఒకే దగ్గర కూర్చొంటారు. ఒక దగ్గర కూర్చోకుండా ఎలా ఉంటారు. కాకుంటే ఇప్పుడు అవైర్‍నెస్‍ వచ్చింది. కాబట్టి పిల్లలు కొంచెం ఎక్కువ కేర్‍ తీసుకుంటారు. పెద్ద వాళ్లు పట్టించుకోక పోవచ్చుగానీ, పిల్లలు మైండ్‍లో ఇది కూర్చున్నది. మనం షేక్‍హ్యాండ్‍ తీసుకోవద్దు, ఒకరి కొకరు అంటుకొని కూర్చొవద్దు, ఇట్లాంటివన్నీ వచ్చినాయి. కానీ సహజంగా ఆడుకునేటప్పుడు కలిసే వాళ్లు ఉంటారు. కాబట్టి క్లాస్‍ రూంలల్లో కలిసి కూర్చున్నంత మాత్రనా పిల్లలకు ఇబ్బంది రాదు.
మున్ముందు మానవ సంబంధాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది?
ఖచ్చితంగా పాజిటివ్‍ ఉంటది. మానవ సంబం ధాలన్ని కూడా ఇప్పటికి లాగా, ఇంతకు ముందు లాగా ఉండవు. చాలా మార్పు వస్తది. ఆ మార్పుకు ఈ అనుభవం చాలా బాగా తోడ్పతది.                      (సచిన్‍, మల్లేష్‍ – దక్కన్‍ ఛానల్‍ ఇంటర్వ్యూ ఆధారంగా)


– కట్టా ప్రభాకర్‍, ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *