ఓజారిలు, డోక్రా శిల్పకళ ఒక పరిశీలన


ఓజారీలు లేదా ఓటారిస్‍ అను జాతి వారు ఇత్తడిని ఉపయోగించి పనిచేయు వారు. గోండ్యానా మరియు మహా రాష్ట్ర ప్రాంతంలో కనపడతారు. కంచరి వారు అనబడతారు తెలుగులో కొన్ని కుటుంబాలు మాత్రం గోండుల ఊళ్ళలో శాశ్వతంగా ఉంటున్నారు. గోండుల వంశ నామాలనే వీరు వాడుకుంటున్నారు. అయితే ఖాతీలలాగ గోండు గ్రామాలల్లో నివాసముంటున్నా, గోండుల సంస్కృతి సంప్రదాయాలు బయటనే వీరి ఆచరణ. గోండుల మత పండుగల్లో కూడా వీరు పాల్గొనరు.
ఓజారీలే ఇత్తడి కంచులను ఉపయోగించి దేవాలయాల్లోని గంటలను తయారు చేస్తారు. ఇవి గోండుల పెర్సపెన్‍ దగ్గర యుంటాయి. వివిధ దేవతల గుళ్ళలో వీరు తయారు చేస్తారు. అట్లే పర్‍దాన్‍ల తోటీల బూరల భాగాలను వీరు తయారు చేస్తారు. గోండుల మతంలో వీటి పాత్ర ఎంత ప్రధానమైనదంటే వారిపురాణాల్లో ఓజరీల ప్రస్తావన ఉంటుంది. వీటిని వారి సంస్కృత కథానాయకుడు పహాండీ కూపర్‍ లింగల్‍ వీరి నుండే పొందినట్లు చెప్పబడుతుంది.


కొన్ని ఓజరి కుటుంబాలు గోండు గ్రామాలలో స్థిరపడినా వారు అక్కడే స్థిరంగా ఉంటారనలేము. వారి వర్తక అవసరాలకై నివాసాలు మార్చడం అనివార్యం. అయినను ఆ గ్రామస్థులతో సంబంధం కలిగేఉంటారు. వీరి సామాజిక హోదా ఖాతీలలాంటిది. వారు గోండుల ఇండ్లలోకి వచ్చినా పర్‍ధాన్‍లు, తోటీలలాగ భోజనం మాత్రం చేయరు. అయితే కొంత మంది గోండు వంశాల పేరు పెట్టుకున్నవారు లేకపోలేదు. అంతగా సంబంధాలు మాత్రం లేవు.
తక్కువ ఖరీదు ఆభరణాలు, ఇత్తడిని, తెల్లలోహాలవి (అల్యూమినియం), ఉంగరాలు, కాలిమట్టెలు, దండకడియాలు మొదలైనవి తయారు చేస్తారు. ఓజారీల చేత తయారైన ఆభరణాలకు గోండి స్త్రీల నుండి మార్కెటు అధికం. వోజారీలు వారి పనిలో మొదటగా ఆభరణాన్ని మైనంతో తయారు చేస్తారు. దానిని మట్టితో కప్పుతారు. దానివల్ల కొలిమిలో మట్టి నిర్దుష్ట ఆకారంలో తయారవుతుంది. కరిగిన లోహాలను పోతపోసి వీటిని తయారు చేస్తారు.


ఇది సింధునాగరికత నుంచి ఇప్పటికీ మరవలేనిది, మనకి గుర్తు వచ్చేది ఈ హస్తకళారూపం డోక్రకళ. ఇది లాస్ట్వ్యాక్స్ మెటల్‍ (ఇత్తడి) కాస్టింగ్‍ అందులో బెల్‍మెటల్‍ పద్దతిలో వాడుతారు. బెల్‍ మెటల్‍ అంటే మన గంటలకు తయారికి ఉపయోగించే మెటల్‍ (ఇత్తడి). ఇలా ఈ మెటల్‍తో వివిధ బొమ్మలు, నృత్యరూపాలు, వేట పనివిధానం, వారి ఆచారాలు, జీవనవిధానం ఆదివాసి ప్రజలు, కుటుంబ వ్యక్తులు, వారితో జీవించే జంతువులు, పక్షులు తయారు చేస్తారు. వీరి హస్తకళా విధానం. మొత్తం వర్క్ తీగలతోనే, లాస్ట్వ్యాక్స్తో పద్దతిలో నమూనాలు చేస్తారు. మెటల్‍ కాస్ట్లాగే చాలా రకాలు వచ్చాయి. టాక్రిట్‍ మెటల్స్ వంటివి అంటే పియోపితో ఉపయోగిస్తారు. అసలు, డోక్ర హస్తకళ వాళ్లు చుట్టు ప్రక్కల అందుబాటులో ఉండే ప్రకృతిలో సహజంగా దొరికే మట్టిని వాడుతారు. మూడు రకాల మట్టిని వాడుతారు. ఒకే రకం మట్టి మొదలైనవి వాడితే వాళ్ళు తయారు చేసే బొమ్మలు సరిగా తయారుకావు. అందుకే మూడు రకాల మట్టిని వాడుతారు. తయారీ విధానం అనేది ఒక గుర్తింపుగా ఉంటుంది. దీనినే ‘‘లాస్ట్ వాక్స్’’ పద్దతి అంటారు. ఆధునిక పద్దతుల్లో ఇప్పుడు సైన్స్ టెక్నాలజితో చాలా రకాల వస్తువులు (టూల్స్) ఉపయోగిస్తారు. అది బెల్‍ పద్దతి. వీరు తయారీకి వాడే మెటిరియల్‍ ఒటో ఫుట్‍ ప్లెస్స్ తీగలతో చేస్తారు. ఇవి రెండు విధాలుగా తయారు చేయడం వల్లన ఇది ప్రత్యేకంగా చేసే పద్ధతి అని చెప్పవచ్చు. ఇలా తీగలతో చేయడం, చుట్టు ప్రక్కల దొరికే మట్టితో చేయడం మరొక విశేషం. ఇది సింధునాగరికత కాలం నుంచే వచ్చిందని అనడానికి వాటి ఆనవాలు శిల్పాలు, బొమ్మలు చూస్తే తెలుస్తుంది. ఆదివాసీలు పూజించే బొమ్మలు (అమ్మతల్లి), నృత్య కారిణి (డాన్సింగ్‍ గార్ల్) ఇత్తడి బొమ్మలు చూడవచ్చు.


ఇది ప్రాచీన కాలంలో మట్టితోనే కొలిమిపొయ్యి చిన్న స్థలం ఏర్పరచుకొని అందులోనే మెటల్‍ చిన్న, చిన్న రేకులుగా పల్చటివి చేసేవారు. త్వరగా మెల్ట్ అయ్యేలాగా పల్చటి రేకులు తీగలు లాంటివి, మెత్తనివి అందులో ముందే పెట్టి కాల్చేస్తే అందులో ఉండే వ్యాక్స్ వచ్చేది మరియు మెటల్‍ కూడా మరిగిపోయే దాకా ఉండి మరిగిన తరువాత బొమ్మని తిరగల వేసే వారు. ఇది వరకు ఇదే పద్దతి ఉండేది. ఇప్పుడు వివిధ పరికరాలు రావడం వలన కళాకారులు వేరే విధంగా మరగపెడుతున్నారు.
ఆదివాసులకు సంబంధించిన వాళ్ళే గతంలో కొంత మంది హస్తకళారూపాలు చేసేవారు. ఇప్పుడు ఇలాంటి కళరూపాలు చేయడానికి ఇష్టపడకపోవచ్చు. దీనికి వివిధ కారణాలు ఉండవచ్చు, దేవతామూర్తుల శిల్పాలు తయారీ చేసి పూజిస్తారు. ప్రతి పండుగకి, పెళ్ళి సందర్భంలో కొలుస్తారు. అనారోగ్యం, కరువు వచ్చినప్పుడు వీరి వారసత్వంగా వచ్చిన దేవతా మూర్తులను కొలుచుకుంటారు. బాధకర విషయం ఏమంటే చాలా ఆధునిక పద్ధతుల్లో తొందరగా చేసే వారు టూల్స్ వాడుతున్నారు. దీని వలన అసలు ఓర్జిన్‍ ఆఫ్‍ ఓజా డొక్రా కళ పద్దతి మారుతున్నది.


శిల్ప సంప్రదాయాలు – డోక్రా కాస్టింగ్‍ :
మట్టి (టెర్రకోట), లోహం మరియు రాతితో శిల్పాలు చేసే ప్రసిద్ద సంప్రదాయాలను ఇవి సూచిస్తాయి. ఇలాంటి సంప్రదాయాలు దేశ వ్యాప్తంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ చూడవచ్చు.
డోక్రా తయారీ పద్దతి (కాస్టింగ్‍) :
ప్రసిద్ద శిల్ప సంప్రదాయాలలో, కోల్పోయిన మైనపు లేదా సిర్‍ పెర్డ్యూ టెక్నిక్‍ నుండి తయారైన డోక్రా లేదా లోహ శిల్పకళ పశ్చిమ బెంగాల్‍, బస్తర్‍, ఛత్తీస్‍గఢ్‍, మధ్యప్రదేశ్‍, ఓడిశా మరియు మిడ్నాపూర్‍, ఉమ్మడి ఆంధప్రదేశ్‍, ఆదిలాబాద్‍ ప్రాంతాలలో అత్యంత ముఖ్యమైన లోహ కళలలో ఒకటి. ఇది కోల్పోయిన మైనపు పద్దతి ద్వారా కాంస్య తారాగణాన్ని కలిగి ఉంటుంది. బస్తర్‍ లోహ హస్త కళాకారులను ‘గద్వ’ అని పిలుస్తారు. ప్రసిద్ద శబ్దవ్యుత్పత్తి శాస్త్రంలో, ‘‘ఘడ్వా’’ అనే పదానికి అర్థం రూపొందించడం. సాంప్రదాయకంగా, గద్వాల హస్తకళకారులు, గ్రామీణులకు రోజువారీ వినియోగ సామాగ్రిని సరఫరా చేయడంతో పాటు, నగలు, స్థానికంగా గౌరవించే దేవతల చిహ్నాలు, పాములు, ఏనుగులు, గుర్రాలు, కర్మకాండల రూపంలో ప్రతిజ్ఞ సమర్పించడం వంటివి చేసేవారు. తదనంతరం డిమాండ్‍ తగ్గడంతో ఈ హస్త కళాకారులు కొత్త (సాంప్రదాయేతర) రూపాలలో అనేక అలంకార వస్తువులను సృష్టించడం ప్రారంభించారు.


డోక్రా కాస్టింగ్‍ అనేది విస్తృతమైన పక్రియ:
ఒడ్డు నుండి నల్ల మట్టిని వరి పొట్టుతో కలిపి నీటితో కలుపుతారు. కోర్‍ ఫిగర్‍ లేదా అచ్చు దీని నుండి తయారు చేయబడింది. ఎండబెట్టడం, మట్టితో కలిపిన ఆవు పేడ యొక్క రెండవ పొరతో కప్పబడి ఉంటుంది. సాల్‍ట్రీ నుండి సేకరించిన రెసిన్‍ ఒకమట్టి పాత్రలో వేడెక్కుతుంది. అది ద్రవంగా మారే వరకు కొంత ఆవం నూనెకూడా వేసి మరిగించడానికి అనుమతించబడుతుంది. మరిగే ద్రవాన్ని ఒక వస్త్రం ద్వారా వడకట్టి, నీటి మీద మెటల్‍ పాత్రలో ఉంచుతారు. ఫలితంగా రెసిన్‍ ఘనీభవిస్తుంది కానీ మృదువుగా ఉంటుంది. ఇది చిన్న ముక్కలుగా తీసి, తక్కువ మండే బొగ్గుపై కొద్దిగా వేడి చేసి, చక్కటి దారాలు లేదా కాయిల్స్గా మారుస్తారు. అలాంటి దారాలు (థ్రెడ్స్) కలిపి స్ట్రిప్స్ని ఏర్పరుస్తాయి. ఎండిన మట్టి రూపం, ఈ రెసిన్‍ స్ట్రిప్‍లు లేదా కాయిల్స్తో కప్పబడి ఉంటుంది మరియు అన్ని అలంకార నమునాలు మరియు కళ్ళు, ముక్కు మొదలైనవి బొమ్మలకు జోడించబడ్డాయి. బంక మట్టి రూపం తరువాత పొరలతో కప్పబడి ఉంటుంది. ముందుగా మెత్తడి మట్టితో, తరువాత, మట్టి మరియు ఆవు పేడ మిశ్రమంతో చివరకు వరి పొట్టుతో కలిపిన చీమలు పుట్టల నుండి పొందిన మట్టితో చేయబడింది మరియు చిత్రం యొక్క దిగువ భాగానికి స్థిరంగా ఉంటుంది. మరొక వైపు, లోహపు ముక్కలతో నిండిన కప్పు మట్టి, బియ్యం పొట్టు మిశ్రమంతో మూసివేయ బడుతుంది. కొలిమిలో కాల్చడానికి సాల్‍ కలప లేదా దాని బొగ్గును ఇంధనంగా ఇష్టపడతారు. లోహాన్ని కలిగి ఉన్న కప్పు, దిగువన మట్టి అచ్చులతో ఉంచబడుతుంది మరియు కట్టెలు మరియు కుండలతో కప్పుబడి ఉంటుంది. లోహం కరిగిన స్థితికి మారే వరకు గాలిని 2 నుండి 3 గంటల పాటు కొలిమిలోకి నిరంతరం ఊదడం జరుగుతుంది. అచ్చులను,ఒక జత పట్టుకారుతో బయటకు తీసి తలక్రిందులుగా చేసి, చురుకైన, తెలివిగా అటూ, ఇటూ ఊపాలి (షేక్‍) చేయాలి మరియు మెటల్‍ రిసెప్టాకిల్‍ ద్వారా పోస్తారు. కరిగిన లోహం సరిగ్గా ఒకసారి రెసిన్‍ అక్రమించిన ప్రవేశంలోకి ప్రవహిస్తుంది. అది ఇప్పుడు అవిరైపోతుంది. అచ్చులను చల్లబరచడానికి నీటితో తడుపుతారు మరియు లోహ బొమ్మని బహిర్గతం చేయడానికి బంక మట్టి పొరను సుత్తితో పగల కొడుతారు. తర్వాత చివరగా ఫినిష్‍ కొరకు పేపర్‍తో రుద్దుతారు. ఎచ్చుతగ్గులకు నునుపుగా మలచి లోహబొమ్మలను చేస్తారు.


డాక్రా శిల్ప బొమ్మలకు రంగులు వాడడం:
డొక్రా మెటల్‍ కళకు అవసరం ఉన్న రంగులు వీరు వాడుతారు. ఈ మధ్యకాలంలో పాలిష్‍ ఎక్కువగా చేస్తున్నారు. ఇది వాతావరణంలో మార్పులకు రక్షణగా ఉంటుంది. అందువలన వీటికి పాలిష్‍ చేస్తారు. ఇప్పుడు చాలా రకాలు పాలిష్‍లు వచ్చాయి.
ఆదిలాబాద్‍ ఓజా డోక్రా కళరూపం తయారి పద్ధతి :
తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లా నుండి 25 కి.మీ. దూరం బిల్సారీ రాంపూర్‍ గ్రామంలో ఉలిక ఇంద్రజిత్తు (45 సం) తండ్రి పేరు లక్ష్మణ్‍, గొండియా కుటుంబం లేదా ఓజా గొండు కుటుంబం వారు ఈ లోహపు కళను చేస్తారు. ఇతని తండ్రి నుండి డోక్రా కళను నేర్చుకున్నారు. దీనిని ‘‘ఓజా కళ’’ అని కూడా అంటారు.
డోక్రాకళ అనేది ప్రాచీన సాంప్రదాయాల నుండి ఆదివాసిలు వారసత్వంగా చేస్తూ వస్తున్నారు. అసలు ఈ కళ హరప్పా, మొహంజదారొ నాగరికతలో కూడా మనం చూడవచ్చు. ఇది వారసత్వ వృత్తిగా 7 వేల సంవత్సరాలుగా వస్తున్నట్లు వీరు నమ్ముతున్నారు.
ఒక్కొక్క ఇత్తడి డోక్రా బొమ్మ ధర 2000 రూపాయల నుండి 6000 రూపాయల వరకు ఉంటుంది. కొన్నింటిని ముందుగానే ఆర్డర్‍ తీసుకున్న వారికి తయారు చేసి ఇస్తారు. ఈ విధంగా వారి జీవన విధానం కొనసాగుతుంది.


ముగింపు : ఎంతో నిబద్దత, సహనం, సృజనత్మకత ఉంటేనే ఈ కళపైన పట్టుదొరుకుతుంది. రాను రాను ఈ డోక్రా కళకు ఆదరణ తగ్గుతున్నది.
ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు ఈ కళను అభివృద్ధిలోకి తెచ్చుటకు ముందుకు రావాల్సిందిగా ఈ కళను నమ్మిన కుటుంబాలు కోరుకుంటున్నాయి. ఈ ప్రాచీన సాంప్రదాయ కళను కాపాడవల్సిన బాధ్యత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉన్నదని చెప్పవచ్చు. ఈ ఆధునిక సాంకేతికతను ఈ కళకు ఆపాదించి దీని నైపుణ్యాన్ని వస్తు ఉత్పత్తిని పెంచే విధంగా ప్రభుత్వం వీటి తయారు దారులకు సహకరించాలి. అలాగే ముఖ్యముగా యూనివర్సిటీలు కళల కోర్సుల్లో ఈ డోక్రా కళను ఒక అంశంగా సిలబస్‍లో పెట్టడం ద్వారా ఈ కళను ప్రోత్సహించి, కాపాడుకోవాలి.


ఆధార సూచికలు :

  1. ఓజా ఇంద్రజీత్‍, డోక్రా కళకారులు, క్షేత్ర పర్యటనల్లో, పరిశీలన, పరిశోధనల్లో సేకరణ అంశాలు, ఫిబ్రవరి 21.
  2. దుర్గప్రసాద్‍ – డోక్రా కళ ప్రత్యేక శిల్పకారుడు, క్షేత్ర పర్యటన పరిశోధన సేకరణ అంశాలు, జూన్‍ – 2021.
  3. టెక్టస్ బుక్‍ కమిటీ – శిల్ప సంప్రదాయం – డోక్రా కళ ఫైన్‍ ఆర్టస్ – 12 తరగతి, ఎన్‍సిఇఆర్‍టి పబ్లికేషన్స్, ఆగష్టు 2020 (పేజీలు 140-142).
  4. యస్‍. గంగాధర్‍, రాజ్‍గోండ్‍ల సంస్కృతి మూల్యం తెలంగాణ రాజ్‍గోండులు, నవ తెలంగాణ ప్రింటర్స్ ప్రై.లి. హైదారాబాద్‍. జూన్‍ – 2017 (పేజిలు 22-23)
  5. online link :- https://youtube./Gxtine pf 2021 on June 2021

నాగజాను సూరేపల్లి
ఎ : 9491437460

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *