దక్కన్‍ ల్యాండ్‍ చర్చ మానవత్వం, మతసహనం, మర్యాద… వన్నె తెచ్చిన దక్కన్‍ సంస్కృతి


ఎంత చెప్పినా తరిగిపోని అంశాలు చరిత్రలో కొన్ని ఉంటాయి. ఆ జ్ఞాపకాల ఊటలు అలా ఊరుతూనే ఉంటాయి. దక్కన్‍ సంస్కృతి కూడా తెలంగాణలో ప్రధానంగా భాగ్యనగరంతో, దాని ఐదు శతాబ్దాల చరిత్రతో ముడిపడినప్పటికీ, అంతకు ముందు కొన్ని వేల ఏళ్ళ చరిత్ర కూడా దానిలో అంతర్భాగంగానే ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఇందులో కలగలసిపోయి దానికొక విశిష్టతను సంతరింపజేశాయి. ఒకటి కాదు, రెండు కాదు.. పదుల సంఖ్యలో నగరాల, దేశాల భిన్న సంస్కృతులు తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‍లో ఒకదానికొకటి పెనవేసుకుపోయి దక్కనీ సంస్కృతితో మమేకమయ్యాయి. అలాంటి మహత్తర సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నాలు గతంలో కొన్ని జరిగాయి. ఇటీవల తిరిగి అలాంటి ప్రయత్నాలు మొదలయ్యాయి. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ తీయాలన్న లక్ష్యంతోనే ఇలాంటి ప్రయత్నాలు జరుగు తున్నాయన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘దక్కన్‍ ప్రాంతం విభిన్న భాషలకు, సంస్కృతులకు నిలయం’ అనే అంశంపై జనవరి నెలలో తెలంగాణ రిసోర్స్ సెంటర్‍ ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ చర్చపై ‘దక్కన్‍ న్యూస్‍’ రిపోర్ట్.
తెలంగాణ రిసోర్స్ సెంటర్‍ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రంలో జనవరి 2014లో జరిగిన చర్చా కార్యక్రమాల్లో ‘దక్కన్‍ సంస్కృతి’పై జరిగిన చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది. జనవరి 26న జరిగిన ఈ చర్చలో ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త ఆనంద్‍ రాజ్‍ వర్మ, దక్కన్‍ స్టడీస్‍ కార్యదర్శి, ఇంటాక్‍ హైదరాబాద్‍ చాప్టర్‍ కో – కన్వీనర్‍, చరిత్రకారుడు సజ్జాద్‍ షాహిద్‍, ఇంటర్నేషనల్‍ సిఖ్‍ సెంటర్‍ ఫర్‍ ఇంటర్ఫెయిత్‍ రిలేషన్స్ డైరెక్టర్‍ నానక్‍ సింగ్‍ నిస్తేర్‍, మరాఠీ సాహిత్య పరిషత్‍ కార్యదర్శి, మరాఠీ విద్యాలయ ప్రిన్సిపాల్‍ విద్యా దియోధర్‍ సంఘమిత్ర మల్లిక్‍, అపనా వతన్‍, ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ జనరల్‍ సెక్రటరీ శ్రీ ఒమిమ్‍ మనేక్యా డబేరా ప్రధాన వక్తలుగా పాల్గొన్నారు. ఈ చర్చను టీఆర్‍సీ చైర్మన్‍ శ్రీ మణికొండ వేదకుమార్‍ పరిచయము చేసి ప్రారంభించారు.


చర్చ సారాంశం…
ఆనందరాజ్‍ వర్మ: దక్కనీ సంస్కృతి 500 ఏళ్ళుగా కొనసాగు తోంది. హైదరాబాద్‍ నగరం ఏర్పడేందుకు పూర్వం కూడా ఇక్కడ పల్లెలు ఉండేవి. జనావాసాలుండేవి. కుతుబ్‍షాహీల కాలం కంటే ముందు కూడా ఇక్కడ చిన్న చిన్న గ్రామాలు ఉండేవి. అందులో రెండు.. చిచిలం (చార్మినార్‍, షాలిబండ), రెండోది లక్ష్మీగూడెం (కర్మన్‍ఘాట్‍). ఇప్పటికీ రెవిన్యూ రికార్డుల్లో లక్ష్మీగూడెం అని ఉండడాన్ని చూడవచ్చు. అవన్నీ INCRETIC CULTURE OF 104 od toho, fot 655 RAJ ResounCE CENTE AND C CHA DECC h 54 GEOD దక్కన్‍ కలసి హైదరాబాద్‍గా మారాయి. ఇప్పటి కర్మన్‍ఘాట్‍ అప్పుడు లక్ష్మీ అనేవారు. ఉర్దూ, పార్శి, తెలుగు, మరాఠీ ఇలా ఎన్నో భిన్న సంస్కృతులు ఇక్కడ విలసిల్లుతున్నాయి. ఏ మతానికి చెందిన వారైనా కూడా దక్కనను తమ మాతృభూమిగా భావించారు. ఉప్పుగూడెం, బహద్దూరుపురా తదితరాల్లో ప్రాచీన గురుద్వారాలు ఉన్నాయి. హైదరాబాద్‍ కు వచ్చిన వారంతా తమ వెంట తమ సంస్కృతి, విలువలు, సంప్రదాయాలు తీసుకువచ్చారు. అవన్నీ కూడా దక్కన్లో సమ్మిళితమయ్యాయి. అదే హైదరాబాద్‍ సంస్కృతిగా మారింది. కులమతాలతో సంబంధం లేకుండా షేర్వానీలను అంతా ధరిస్తుంటారు. హైదరాబాద్‍, దక్కన్‍ రెండూ కూడా ఒకదానికొకటి మారుపేరుగా మారి పోయాయి. ఉర్దూ, పార్సీ, మరాఠీ, కన్నడ… వీటన్నింటి సంగమమే దక్కనీ, అది నేటికీ హైదరాబాద్‍లో కానవస్తోంది. దక్కన్‍ ముల్క్ బహుతీచ్‍ హై.. తెలంగాణ ఉస్కీ ఖులాసా హై… అంటూ 400 ఏళ్ళ క్రితమే కవిత్వం చెప్పారు. ఏ మతానికి చెందిన వారైనా, ప్రతి ఒక్కరూ దక్కను తమ మాతృభూమిగా భావిస్తుంటారని కవులు పేర్కొన్నారు. రెండు వందల ఏళ్ళ క్రితమే ఇక్కడ గురుద్వారాలు కూడా నెలకొన్నాయి. ఇక్కడ ఉత్తర భారతీయులు, వారెక్కడి నుంచి వచ్చిన వారైనా ఇక్కడి సంస్కృతితో కలిసిపోయారు. మహరాజా చందూలాల్‍ హయాంలో.


సజ్జద్‍ షాహిద్‍: శతాబ్దాలుగా విశిష్ట విలక్షణ ప్రత్యేక సంస్కృతిని తెలంగాణ కలిగి ఉంది. మొదటి నుంచి కూడా నర్మదకు అవతలి పరిణామాల ప్రభావం : దక్కన్‍పై ఉండేది కాదు. ఉత్తర భారతదేశానికి, దక్కన్‍కు మధ్య ఒకే రకమైన అంశాల్లోనూ ఎంతో తేడా ఉంటుంది. దక్కన్‍ షేర్వానీలకు ఆరు గుండీలు ఉంటే, ఉత్తర భారత షేర్వానీలకు ఏడు గుంటలు ఉంటాయి. మనం అసమర్థులమని, పాలన చేతకాదని కొందరు ఇప్పుడు విమర్శిస్తున్నారు. అప్పట్లో బ్రిటిష్‍ వారు కూడా భారతీయులను ఇలాగే విమర్శించారు. ఇప్పుడేమైంది.. భారత్‍ ఒక అగ్రశక్తిగా ఎదిగింది.
దక్కన్‍ ల్యాండ్‍ ప్రపంచంలో మరే ప్రాంతంతోనూ తకు సంస్కృతి ప్రజలు అంత్యక్ష విదేశీ గాంచింది. కోస్తా ప్రభావం కూడా ఉండేది. కుతుబ్‍ షాహీల కంటే ముందే హైదరాబాద్‍ నగరం ఉండింది. గుల్బర్గాలో అహ్మని కలి అక్కడ వేడుకలు హిందూ క్యాలెండర్‍ ప్రకారం జరుగుతాయి. లింగాయత్‍లు కూడా ఈ వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. జంగమయ్య సారథ్యంలోనే పెద్దలి పరస్పరం తలపాగాలు లాంటివి మార్చుకుంటారు. అక్కడ ఆయనను హిందువులు అల్లమ్మ, ప్రభు సింహస్వామి అవతారం పేరిట ఆరాధిస్తారు. ఇలాంటి ఉదాహరణలు చక్కనిలో కోకొల్లలుగా కనిపిస్తాయి. సూఫీల ప్రభావంతో భాను తెగ కూడా వచ్చింది. ప్రకారం కృష్ణుడు ఒక్కడే పురుషుడు. మిగతా వారంతా గోపికలే. ఈ నేపథ్యంలో ఇక్కడి బ్రాహ్మణ కుటుంబాలకు ముస్లిం రాజులు ఇచ్చిన కానుకనే కూచిపూడి గ్రామం. కూచిపూడి నర్తకులు దక్కన్లో కూడా ప్రదర్శనలిచ్చారు. మొగలుల ఉనికి తదితరాలు కూడా దక్కన సంస్కృతిపై ప్రభావం కనబర్చలేకపోయాయి. కూచిపూడిలో ఐదు కుటుంబాల మధ్య వచ్చిన వివాదం కూడా హైదరాబాద్‍ నవాబులే పరిష్కరించారు. మనం మన సంస్కృతిని మర్చిపోయాం. అందుకే ఇతరులు వచ్చి మనకు సంస్కృతిని నేర్పిస్తున్నామని అంటున్నారు.


మహరాజు కిషన్‍ ప్రసాద్‍:
పేరు ఏదైనా మతమేదైనా.. అంతా కోరుకునేది అజాదీ. నీవు నీ దేవుడితో, నేను నా డేవుడితో హ్యాపీగా ఉన్నాం. కొట్లాట ఎందుకు? సరోజిని నాయుడు కూడా దక్కన్‍ సంస్కృతి పై రెండు లేఖలు రాశారు. పబ్లిషరు ఒక లేఖ రాశారు… నిజాం మరణం తట్టుకోలేకపోయానని, పుస్తకరచన కొద్ది రోజులు జాప్యమవుతుందని, అందుకు ప్రతిగా పబ్లిషర్‍ ఓ లేఖ రాసి ఉండవచ్చు. అందుకు సరోజిని నాయుడు బదులిస్తూ నిజాం తనకు ఎంతో ఆరాధ్యుడనీ, ఆ వేదన తగ్గేందుకు సమయం పడుతుందని బదులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఇలాంటి సమ్మిళిత సంస్కృతిని కొనసాగించాల్సి ఉంది. ఉత్తర భారత దేశంలోని ఢిల్లీ, లాహోర్‍, లక్నో నగరాల నుండి దక్కన్‍ నగరాలైన బీదర్‍, బీజాపూర్‍, అహ్మద్నగర్‍ కు వచ్చే ముసాఫిర్లకు చక్కన్‍ పీఠభూమి ఒక ప్రవేశ మార్గంగా, ప్రధాన గవాక్షంగా వెలిసింది. అన్ని జాతులవారు వచ్చి స్థిరపడిన కారణంగా నూతన సంస్కృతి ఆవిర్భవించింది. జీవన వైవిధ్యంలో హైద్రాబాద్‍ తన ప్రత్యేకతను నిలుపుకుంది. కాని ఇక్కడికి వచ్చిన వాళ్ళు గానీ, ఇక్కడివాళ్ళుగానీ ఒకరి సంస్కృతిపై ఇంకొకరు దాడి చేయలేదు. అందరు కలసి కుటుంబంగా జీవించారు. కేవలం వ్యాపారం కోసం వచ్చిన ఆంధ్రులు మాత్రమే ఇక్కడి చరిత్రను, సంస్కృతిని విధ్వంసం చేశారు. ఇక్కడి భాష, యాసలను హేళన చేశారు. అందుకే దక్కన్‍ ప్రజలు సీమాంధ్ర ప్రజలు ఒకటి. కాలేకపోయారు.

  • దక్కన్‍న్యూస్‍,
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *