హైదరాబాద్‍ జిల్లా స్థల నామాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మరియు అతి చిన్న జిల్లా హైదరాబాద్‍. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ జిల్లాకు ఉన్న ప్రత్యేకత వేరుగా చెప్పనక్కర్లేదు. దేశంలోని వివిధ మతాల, ప్రాంతాల, భాషల ప్రజలు కలిసి నివసిస్తుండడం ఇక్కడి ప్రత్యేకత. గంగా జమునా తెహజీబ్‍ అనే మిశ్రమ సంస్క•తిని చాటుతూ అత్యధిక మానవ సాంధ్రతను కలిగి ఉన్న జిల్లా ఇది.1978లో రంగారెడ్డి జిల్లా నుండి విడిపోయి హైదరాబాద్‍ జిల్లాగా అవతరించింది. 66 గ్రామాలతో సుమారు 217చ.కి.మీటర్లు విస్తరించి ఉన్నది. జిల్లా మొత్తం పట్టణీకరణలో కలిసింది కావున ఆధునికతను అంది పుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఎక్కడ కూడా గ్రామం అనడానికి అవకాశం లేదు. స్థలం అంటే సమంజసంగా ఉంటుందని నా అభిప్రాయం. హైదరాబాద్‍ జిల్లా వ్యాప్తంగా ఉన్న కొన్ని స్థల నామాల ప్రత్యేకతలను చర్చించడం ఈ వ్యాసం ఉద్దేశం.


హైదరాబాదు:
హైదరాబాదు నగరమునకు భాగ్యనగరం అని మరో పేరు. గోల్కొండ రాజ్యాన్ని ఏలిన కుతుబ్‍ షాహీ సుల్తాన్లలో ఐదవ వాడైన మహమ్మద్‍ కులీ కుతుబ్‍ షా హైదరాబాద్‍ నగర నిర్మాత. అతడు తన ప్రియురాలు భాగామతిని పెళ్ళాడి ఆమె పేర భాగ్యనగరం నెలకొల్పాడని, ఆ తర్వాత భాగమతికే ‘‘హైదర్‍ మహల్‍’’ బిరుదునిచ్చి ఆ పేరుతో భాగ్యనగరమును నిర్మించారని, హైదరాబాదుగా మార్చారని ప్రఖ్యాత పర్షియన్‍ చరిత్రకారుడు ఫెరిస్తా పేర్కొన్నాడు. ఈతని కాలంలో హైందవ మహమ్మదీయ సంస్క•తులు సమ్మేళనమై దక్కన్‍ సంస్క•తిగా రూపు దాల్చాయి. (కుతుబ్‍ షాహీల తెలుగు సాహిత్య సేవ-ఆంధ్ర సారస్వత పరిషత్తు పుట 01, తెలంగాణ చరిత్ర సంస్క•తి వారసత్వం -వై.వై.రెడ్డి యానాల పుట-298,299) రెండో పులకేశి గుణగణాలను వర్ణించి, క్రీ.శ.610లో సింహాసనం ఎక్కాడన్న విషయాన్ని తెలిపిన శాసనం హైదరాబాద్‍ నగరం ద్వారానే వెలికి తీసిన తొలి కాలపు కన్నడ అక్షరాలలో రూపుదిద్దుకున్న శాసనం, ఆనాటి తెలంగాణ మేటి శాసనాల్లో ఒకటని డా. ఈమని శివనాగిరెడ్డి స్థపతి గారు హైదరాబాద్‍ ప్రాచీనత గురించి తెలిపారు. (మీరూ శాసనాలు చదువచ్చు పుట-215) హైదరాబాద్‍ నగరంలో నగరాన్ని పరివేష్టించి ఉద్యానవనాలు, వరి, గోధుమ, నువ్వులు, పత్తి, త•ణ ధాన్యాలతో పాటు తోటల పెంపకం కూడా కొనసాగింది. ఆ క్రమంలో బాగ్‍ల (తోటలు) కు నెలవైన నగరం కనుకనే హైదరాబాద్‍కి బాగ్‍ నగర్‍ అనే పేరు వచ్చిందని ప్రఖ్యాత పర్షియన్‍ చరిత్రకారుడు థేవ్‍ నట్‍ పేర్కొన్నాడు. బాగ్‍ నగర్‍ (ఉద్యాన వననగరం) భాగ్య నగర్‍ గా సంస్క•తీకరణ పొంది ఉండవచ్చును. (ఆంధ్రుల చరిత్ర -డా.బి.ఎస్‍.ఎల్‍ హనుమంతరావు పుట-447) హైదరాబాద్‍ రెండు మతాల మధ్య స్నేహానికి, ప్రేమకు సందేశంగా నిలబడింది. ప్రేయసి భాగమతి, అర్ధాంగి హైదర్‍ బేగంగా మారగానే బాగ్‍ నగర్‍ హైదరాబాద్‍గా మారింది. ఒక ప్రియుడు తన ప్రియురాలికి కానుకగా నిర్మించి ఇచ్చిన నగరమే హైదరాబాద్‍. ఇటువంటి ప్రేమ పురాణం ప్రపంచంలో ఏ నగరానికి లేదు (సలాం హైదరాబాద్‍-లోకేశ్వర్‍).


గోలకొండ:
గోల్కొండకు ప్రాచీనమైన చరిత్ర ఉంది చాళుక్య యుగంలో ఈ ప్రాంతాన్ని మంగళవరం/మంగళారం అనే వారని తెలుస్తుంది. ఇక్కడి కోట కాకతీయుల కాలంలోనే నిర్మించబడిందని చరిత్రకారుల అభిప్రాయం. ఈ కొండపై గోవులను మేపే వారని అందుకే దీనికి గోల్కొండ అనే పేరు వచ్చిందని మరో అభిప్రాయం.’’ (ఆంధ్రుల చరిత్ర -డా. బి.ఎస్‍.ఎల్‍ హనుమంతరావు, పుట-418) సుల్తాన్‍ కులీ కుతుబ్‍ ఉల్‍ ముల్క్ (రాజ్యానికి స్తంభం) బిరుదుతో పాటు ఖవాస్‍ ఖాన్‍ అను బిరుదు కూడా ఉంది. స్వతంత్రించిన సుల్తాన్‍ కులీ గోల్కొండకు మహమ్మద్‍ నగర్‍ పేరు పెట్టి రాజధానిగా పాలించాడు. ఇబ్రహీం కులీ కుతుబ్‍ షా భాగీరధీ అనే హిందూ యువతిని వివాహం చేసుకొని గోల్కొండకు ఆమె పేరున భాగీరధీ పురము అని పిలిచేవాడు. గోల్కొండ రాజ్యంలో గోల్కొండ, భువనగిరి, దేవరకొండ లాంటి 84 స్థల, గిరి, వన, జల దుర్గాలు ఉండేవి. సైనిక రంగంలో గిరిదుర్గాలు ప్రముఖ పాత్ర పోషించేవి. 1496 నుంచి 1687లో మొగలుల ఆధీనంలోకి వచ్చేవరకు గోల్కొండ కుతుబ్షాహీల అధికారానికి పాలనకు కేంద్రంగా ఉండి గొప్ప రాజధానిగా ప్రపంచ గుర్తింపు పొందింది. కుతుబ్‍ షాహీలు గోల్కొండ కోట గోడను బలిష్టంగా గ్రానైట్‍ రాతితో నిర్మించారు. 87 బురుజులు 69 అడుగులు పైబడిన బ్రహ్మాండమైన ద్వారాలు దర్వాజాలు ఈ కోట విశిష్ట అంశాలు. కోట సింహద్వారం వద్ద నిలబడి చప్పట్లు చరిస్తే/కొడితే దూరంగా 61 మీటర్ల ఎత్తున గల దుర్గంలో అవి ప్రతిధ్వనిస్తాయి. అపరిచితుల రాకను ముందుగానే పసిగట్టగల ఈ అద్భుత ఏర్పాటు నాటి మేస్త్రీల, ఇంజనీర్ల పనితనం చాటుతుంది. ఇక్కడి దర్వాజాల్లో ప్రధానమైన ఫతే దర్వాజా ఎత్తు 25 అడుగులు, వెడల్పు 13 అడుగులు. కోటలోపల బాలహిస్సార్‍, దివాన్‍ ప్యాలెస్‍, జామియా మసీద్‍, నగీనాబాగ్‍, సిల్హాఖానా మొదలైనవి కేంద్రీక•తమై ఉన్నవి. ఇవన్నీ వాస్తు ప్రతీకలు. కోట తెలంగాణ ప్రజల శౌర్యానికి త్యాగానికి ప్రతీక అనవచ్చు. (తెలంగాణ చరిత్ర సంస్క•తి వారసత్వం-వై.వై.రెడ్డి యానాల పుట-295, 297, 304, 314)


అంబర్‍ పేట:
దీనిని బాగ్‍ అంబర్‍ పేట అని కూడా పిలుస్తారు. నిజాం మీర్‍ మహబూబ్‍ అలీ ఖాన్‍ కాలంలో మొహరం పండుగ జరిగే సందర్భంలో లంగర్‍ ఊరేగింపు వైభవంగా జరిగేది. నగర కోత్వాల్‍ ఏనుగు అంబారీల కూర్చునేవాడు. తద్వారా అంబర్‍ పేట స్థల నామం ఏర్పడి ఉండవచ్చు.
అబిడ్స్:
నైజాం ఉల్‍ ముల్క్ పూర్వులు మధ్య ఆసియా నుంచి వలస వచ్చి మొగలాయి కొల్వులో ఉద్యోగులుగా చేరారు. తాము మొదటి ఖాలీఫా అబూబకర్‍ సంతతి వారమని వారి విశ్వాసం. వారి మూల పురుషుడు ఖ్వాజా అబిడ్‍. ఈ ఖ్వాజా అబిడ్‍ పేరు మీదుగా ఈ స్థల నామం ఏర్పడి ఉండవచ్చు.(ఆంధ్రుల చరిత్ర – డా. బి.ఎస్‍.ఎల్‍.హనుమంత రావు, పుట-467)
ఏ.సి.గార్డస్:
నైజాం ప్రత్యేక అశ్విక దళాన్ని ఏర్పాటు చేసి వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నివాస స్థలమే ఏ.సి.గార్డస్.
కోఠి:
కోఠి అసలు పేరు రెసిడెన్సీ. నైజాం రాజ్యంలో బ్రిటిష్‍ ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించే అధికార నివాసమే రెసిడెన్సి. కింగ్‍ కోఠి, రామ్‍ కోఠి సుల్తాన్‍ బజార్‍, బొగ్గులకుంట, హనుమాన్‍ టేక్డీ మొదలగు పరిసర ప్రాంతాలను కలిపి రెసిడెన్సీ బజార్‍ అని అంటారు. 1857 సిపాయిల తిరుగుబాటు హైదరాబాదులో కూడా జరిగినప్పుడు ఈ బ్రిటిష్‍ రెసిడెన్సి పై దాడి చేసిన తిరుగుబాటు నాయకుడు తుర్రే బాజ్‍ ఖాన్‍ రోహిల్లా జాతికి చెందినవాడు. కోఠి దగ్గర్లోని ఆంధ్ర బ్యాంకు నుండి సుల్తాన్‍ బజార్‍ కి పోయే గల్లీకి తుర్రేబాజ్‍ ఖాన్‍ రోడ్డు అని పేరు.(సలాం హైదరాబాద్‍-లోకేశ్వర్‍)
ఖైరతాబాద్‍:
క్రీ.శ.1612-1626 కాలంనాటి సుల్తాన్‍ మహమ్మద్‍ కుతుబ్షా కుమార్తె ఖైరతున్నీసా బేగం పేరుమీద ఆమె గురువు ముల్లా అబ్దుల్‍ మాలిక్‍ కోసం ఖైరతాబాద్‍ మసీదు నిర్మాణమైంది. ఖైరతున్నీసా పేరు మీదుగా ఖైరతా బాదు స్థల నామం ఏర్పడిందని స్పష్టమవుతున్నది.(తెలంగాణ సాయుధ పోరాటం – తెలుగు అకాడమీ హైదరాబాద్‍, పుట 49) ఖైరతున్నీసా బేగం పేరు మీదుగా బేగం పేట్‍ కూడా ఏర్పడి ఉండవచ్చును (నా అంచనా).


చార్‍ మినార్‍:
మహమ్మద్‍ కులీ కుతుబ్‍ షా ప్రశస్తమైన చార్మినార్‍ నిర్మాత. అనేక మంది ప్రజల ప్రాణాలను బలిగొన్న ప్లేగు వ్యాధి నిర్మూలన జ్ఞాపకార్థం 1591-94 కాలంలో చార్మినార్‍ను నిర్మించాడు.168 ఫీట్ల ఎత్తున్న నాలుగు మీనార్లు ఈ నిర్మాణానికి అందము. చార్‍ మినార్‍ అంటే నాలుగు మినార్‍ (స్తంభాలు)లు కలిగిన కట్టడము అని అర్థం. శతాబ్దాలు గడిచినా తరగని ఆకర్షణతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న అద్భుతమైన నిర్మాణమిది. ప్రపంచ వ్యాప్తంగా చార్‍ మినార్‍కి ప్రత్యేక గుర్తింపు ఉన్నది.
చైతన్య పురి:
క్రీ.శ.375-420 కాలం నాటి విష్ణుకుండిన రాజు మొదటి గోవింద వర్మ తన పేర గోవిందరాజు విహారాన్ని నిర్మించి అక్కడి ఎత్తైన కొండ లాంటి బండ పైన ప్రాక•త శాసనాన్ని చెక్కించాడు. బ్రాహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనంలో పాళీ, ప్రాక•త భాషా పదాల ప్రభావం ఉంది. సంస్క•తం, తెలుగు పదాలు కూడా ఇందులో ఉన్నవి. ఒకే శాసనంలో నాలుగు భాషల పదాలు ఉన్నాయి. అలాంటి మిశ్రమ సంస్క•తి మనకు వారసత్వంగా వచ్చింది. ఇక్కడ బౌద్ధ విహారం ఉండేదని ప్రముఖ శాసన పరిశోధకులు పి.వి. పరబ్రహ్మ శాస్త్రి గారు 1979-80 కాలంలో విష్ణుకుండి రాజ్య స్థాపకుడైన గోవింద వర్మ తన పేర నిర్మించిన బౌద్ధ విహార నిర్వహణకు కొన్ని దానాలను కూడా చేశాడని తెలిపారు. (మీరూ శాసనాలు చదువొచ్చు-కూర్పు ఈమని శివనాగి రెడ్డి స్థపతి పుట 156-157) చైత్యమనేది బౌద్ధ మత విషయకమైన సాధారణ పదంగా వ్యవహరింపబడుతున్నది కావున కాల క్రమంలో చైత్య అనుపదం నుండి చైతన్యపురి’గా మారి ఉండవచ్చును.


డబీర్‍ పుర:
డబీర్‍ అంటే ఉర్దూలో పాత దస్తావేజులు, ఫైళ్ళు భద్రపరిచే కార్యాలయము. అట్లాంటిది ఇక్కడ ఉండేదట. అందువల్ల డబీర్‍ పుర అనే స్థలనామం ఏర్పడినది. (సలాం హైదరాబాద్‍ – లోకేశ్వర్‍)
దూల్‍ పేట:
నైజాం కాలంలో లోథ్‍ క్షత్రియుల సైనిక కవాతులతో ఏనుగులు, ఒంటెలు,గుర్రాల డెక్కల చప్పుళ్ళతో ధూళితో పరిసరాలు నిండి ఉండేవి. కావున ధూళిపేట దూల్‍ పేటగా మారింది.
పురానా పూల్‍:
ఇబ్రాహీం కుతుబ్‍ షా కాలంలో నిర్మించబడిన అద్భుత నిర్మాణం పురానా పూల్‍. ఈ వంతెన నిర్మాణానికి కారణం సరసహ•దయం, రసికత ప్రేమోద్వేగంలో తన ప్రియురాలు భాగమతిని కలిసేందుకు, మూసీ నది పొంగిపొర్లుతున్నా గుర్రాన్ని దిగి నదిలో దూకి ఈదుకుంటూ వెళ్లిన తన కుమారుడు మహ్మద్‍ కులీ కుతుబ్షా నిర్మలమైన ప్రేమను, సాహసాన్ని అర్థం చేసుకొన్న ఇబ్రహీం కుతుబ్షా క్రీ.శ.1578లో మూసీ నదిపై వంతెన నిర్మించాడు. అదే నేడు పురానాపూల్‍ గా నిలిచి ఉన్నది.(తెలంగాణ చరిత్ర సంస్క•తి వారసత్వం – వై వై రెడ్డి యానాల, పుట-315)
మాదన్న పేట్‍:
గోల్కొండ రాజ్య రక్షణకు గట్టి చర్యలు తీసుకున్న మంత్రి మాదన్న పేరు మీదుగా ఈ నామం ఏర్పడి ఉండవచ్చు.
మాసబ్‍ టాంక్‍:
అబ్దుల్లా కుతుబ్షా తన తండ్రి మరణంతో 12 సంవత్సరాల ప్రాయంలోనే సింహాసనం అధిష్ఠించాడు. అప్పుడు రాజమాతగా తల్లి హయత్‍ భక్షీ బేగం చలాయించింది. ప్రజలు ఆమెను గౌరవించి మా సాహిబా అని పిలిచేటోళ్లు. ఆమె కట్టించిన మా సాహిబా టాంకు కాలక్రమంలో మాసబ్‍ టాంకు’గా మారింది. (సలాం హైదరాబాద్‍-లోకేశ్వర్‍)
మొగల్‍ పుర:
గోల్కొండ కోట మీద దండెత్తుకొచ్చిన ఔరంగజేబు సైన్యాలు విడిది చేసిన ప్రాంతం మొగల్‍ పుర.
శాలి బండ:
కాశీ యాత్ర చరిత్రలో ఏనుగుల వీరస్వామి శాలిబండ పురము అని ప్రస్తావించాడు. షాఅలీ – బందా బందా అంటే భక్తుడు. షా అలీ బందా ఒక సూఫీ యోగి. ఆ యోగి పేరు మీదుగా ఈ నామము ఏర్పడింది. అట్లాగే గాజుల బండ, పిసల్‍ బండ, మేకల బండ, రాంబక్షి బండ వంటి నామాలు కూడా
ఉండడం విశేషం.


సికింద్రాబాద్‍:
సికిందరాబాద్‍ పూర్వ నామం లష్కర్‍. లష్కర్‍ అనగా సైనికుల దండు. ఆంగ్లేయుల పటాలాలు ఉన్నందున లష్కర్‍ అని పేరు వచ్చింది. (సలాం హైదరాబాద్‍-లోకేశ్వర్‍) నిజాం అలీ ఖాన్‍ పెద్ద కుమారుడు సికిందర్‍ ఝా మూడవ అసఫ్‍ ఝా పేరుతో రాజ్యానికి వచ్చాడు. ఈతని పరిపాలనా కాలం 1803-1829. సికిందర్‍ ఝా పేరున సికింద్రాబాద్‍ నగర నిర్మాణం జరిగింది. తద్వారా సికింద్రాబాద్‍ స్థల నామం ఏర్పడిందని స్పష్టమవుతున్నది. (తెలంగాణ చరిత్ర సంస్క•తి వారసత్వం -వై.వై.రెడ్డి యానాల, పుట-324, 325)
హుస్సేన్‍ సాగర్‍:
క్రీ.శ 1562 కాలం నాటి పరిపాలకుడు సుల్తాన్‍ అల్లుడు సూఫీ సన్యాసి అయిన హుస్సేన్‍ షా వలి పర్యవేక్షణలో హుస్సేన్‍ సాగర్‍ నిర్మాణం జరిగింది. హుస్సేన్‍ షా వలి పేరు మీదుగా ఈ పేరు ఏర్పడినట్లు తెలుస్తుంది. (తెలంగాణ చరిత్ర సంస్క•తి వారసత్వం – వై.వై. రెడ్డి యానాల 316)


హైదరాబాద్‍ చారిత్రక వైభవాన్ని చాటే అసెంబ్లీ, ఉస్మానియా ఆర్టస్ కళాశాల, ఆసుపత్రి భవనాలు వంటి కట్టడాలు ఎన్నో ఉన్నాయి. బన్సీలాల్‍ పేట్‍, మౌలాలి, ఎల్బీనగర్లలో మెట్ల బావులున్నవి. చౌమ హల్లా ప్యాలస్‍, ఫలక్‍ నుమా ప్యాలెస్‍, మాల్వాల ప్యాలస్‍ లున్నవి. కుతుబ్షాహీలు, అసఫ్జాహీల కాలంలో హైదరాబాద్‍ నగరం నిర్మితమైనందున ఎక్కువగా స్థల నామాలలో వారి వంశనామ, వ్యక్తినామ, పరిపాలనా నామముద్రలు కనబడుతవి. అడిక్‍ మెట్‍-అధికమెట్ట, గన్‍ ఫౌండ్రి-తోపుల బట్టీ, జియాగూడ-జియ్యోరుగూడెం, త్రిమలగిరి-తిరుమలగిరి, దారుషపా-దారుల్‍ షిపా, దిల్‍ సుఖ్‍ నగర్‍-దిల్‍ ఖుష్‍ నగర్‍ ఫలక్‍ నుమా-ఆకాశ హర్మ్యం, బడేచౌడీ- బడేసాహెబ్‍కి కోఠి, బార్కాస్‍-బారకాసులు (సైనిక స్థావరాలు), బిర్లామందిర్‍-నౌబత్‍ పహాడ్‍, మణికొండ-మణిగిరి, మలక్‍ పేట్‍-మాలిక్‍ పేట్‍, హైదర్‍ గూడ-హైదర్‍ బేగం గూడ వంటి అనేక స్థల నామ రూపాలు కనబడుతవి. ఈ జిల్లాలో గ్రామ నామాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ అనేక కాలనీలుగా, నగర్‍ లుగా, బహుళ అంతస్తులలో, బహుళ రూపాలలో విస్తరించబడి ఉన్నది. ప్రాచీన కాలంలో బౌద్ధం ఆనవాళ్ల గురించి చైతన్యపురి చరిత్ర చెప్తున్నది. జైన మత పరమైన నామంగా నాంపల్లి కనబడుతున్నది.


-డా. మండల స్వామి
ఎ : 9177607603

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *