తీర్పుల్లో సాహిత్య మెరుపులు

తీర్పులు రాయడం ఓ కళ. అది సైన్స్ కాదు. సాహిత్యంతో తీర్పులకి సంబంధం వుంది. కానీ చాలా మంది న్యాయమూర్తులు ఈ విషయాన్ని గుర్తించరు. చట్టం మాత్రమే తెలిస్తే సరిపోదు. న్యాయమూర్తికి సాహిత్యం తెలియాలి. సాహిత్యంలో జీవితం వుంటుంది. మనుషుల భావోద్వేగాలు వుంటాయి. ఈ విషయాన్ని కొంత మంది న్యాయమూర్తులు గుర్తించారు. అందుకే వాళ్ళు సాహిత్యాన్ని చదువుతూ వుంటారు. తమ తీర్పుల్లో ఉదహరిస్తూ వుంటారు.
‘లా’కి సాహిత్యానికి మధ్య వున్న పరస్పర సంబంధాన్ని 2000 సంవత్సరాల క్రితమే గ్రీకు తత్వవేత్త ప్లేటో గుర్తించారు. ఒక విషయాన్ని విశ్వసించడానికి సాహిత్య ఉపయోగపడాలి అని ప్లేటో అనేవాడు. ఒక విషయం విశ్వసించాలన్నా, రుజువు కావాలన్నా దానికి సాక్ష్యాలు కావాలి. అయితే సాక్ష్యాలని ప్రశంసించడానికి సాహిత్యం ఉపయోగపడుతుంది. లాజిక్‍గా బోధపడుతుంది.


మన దేశంలోని తీర్పుల్లో న్యాయమూర్తులు ఎక్కువగా ఉపయోగించే సాహిత్యం ఉర్దూ సాహిత్యమే. ఆ తరువాతి స్థానం ఇంగ్లీషు సాహిత్యానిది. న్యాయమూర్తులు తీర్పుల్లో వీటిని తరుచూ ఉపయోగిస్తున్నారు. న్యాయవాదులు తమ వాదనలని చెప్పే ముందు కూడా ఈ సాహిత్యాన్ని మరీ ముఖ్యంగా కవితా చరణాలని ఉదహరించి న్యాయమూర్తులని ఆకర్షిస్తూ వుంటారు. ఈ విధంగా వాటిని ఉపయోగించడం వల్ల కోర్టుల్లో ఓ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.


బొంబాయిలో వున్న ఎడ్వర్డ్ మెమోరియల్‍ హాస్పిటల్లో అరుణా శాన్‍బాగ్‍ నర్స్గా పని చేసేది. ఆమె స్వస్థలం కర్నాటక. ఆ హాస్పిటల్‍లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఆమె మీద లైంగిక దాడి చేస్తాడు. అదే విధంగా ఆమె గొంతుని గట్టిగా పట్టుకుంటాడు. ఫలితంగా ఆమె అచేతన స్థితిలోకి నెట్టబడుతుంది. 37 సంవత్సరాలు ఆమె అచేతన స్థితిలోనే వుండిపోయింది. లైంగిక దాడికి గురైన స్త్రీల పేర్లని ప్రకటించడానికి వీల్లేదు. అయితే ఈ కేసు మినహాయింపు. సుప్రీంకోర్టు ఈమె పేరుని ఉదహరించింది. ఈ కేసులో తీర్పుని ప్రశ్నించడం అంత సులువైన విషయం కాదు. షాన్‍బాగ్‍ ఇన్ని సంవత్సరాల బాధని, వేదనని డాలియ చేయడానికి జస్టిస్‍ కట్టూ నేతృత్వంలోని బెంచి గాలిబ్‍ కవితని ఉదహరించారు. అది 141 పేజీల తీర్పు ఆ కవిత ఇలా వుంటుంది.
‘మర్తే హై ఈ ఆర్జూ మే మర్నేకీ,
మౌత్‍ ఆతీహై పర్‍ నహీం ఆతీ’
దాన్ని తెలుగులో ఈ విధంగా అనువాదం చేయవచ్చు. ‘ఒకరు మరణం కాంక్షిస్తూ చనిపోతారు. కానీ మరణం చుట్టూ వున్నప్పటికీ అంతు చిక్కనిది’.
గాలిబ్‍ తరువాత న్యాయమూర్తులు ఎక్కువగా ఉదహరించిన పంక్తులు ఎక్కువగా షేక్స్పియర్‍వి ఇప్పటికీ షేక్స్పియర్‍ని ఎక్కువగా కోట్‍ చేస్తూ వుంటారు.
పెబమ్‍ నింగోల్‍ మిడోమ్‍ దేవి వర్సిస్‍ స్టేట్‍ ఆఫ్‍ మణిపూర్‍ అండ్‍ ఆదర్స్ (2010) కేసులో న్యాయమూర్తులు హెచ్‍ఎల్‍ దత్తు, డి.కె. జైన్‍లో షేక్స్పియర్‍ మాటలని సహాయంగా తీసుకున్నారు. స్వేచ్ఛ గురించి ఒక పాయింట్‍ను బలంగా చెప్పడానికి షేక్స్పియర్‍• మాటలని
వాళ్ళు ఉదహరించారు.


‘వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రతిష్ఠాత్మకమైన హక్కు. ఈ దేశ పౌరులకే కాదు, ఈ దేశంలోకి వచ్చిన విదేశీయాలకు (కొన్ని మాత్రమే) రాజ్యాంగం ఇచ్చిన హామీ. ఇది అత్యంత విలువైన ప్రాథమిక హక్కు. షేక్స్పియర్‍ గొప్ప నాటక రయిత స్వేచ్ఛ గురించి ఈ విధంగా అభిప్రాయపడ్డారు. మనిషి తన స్వేచ్ఛకు యజమాని. ఈ మాటలని సూటిగా న్యాయమూర్తి దత్తూ ఉదహరించారు.


2000వ సంవత్సరంలో కలకత్తా హైకోర్టు ఓ ఆసక్తికరమైన మలుపుని తీసుకొని షేక్స్పియర్‍ నా•కంలోని కొన్ని వాక్యాల్ని మెజిస్ట్రేట్‍ ఓ ఉత్తుర్వు రాశారు. దాన్ని షేక్స్పియర్‍ రాసిన నాటకం ‘మర్చంట్‍ ఆఫ్‍ వెనీస్‍’తో పోల్చినారు.
జస్టిస్‍ ఎ. బాలుక్దార్‍ రాసిన ఉత్తర్వులు ఇలా వున్నాయి.


‘‘ఈ ఉత్తర్వులు రాస్తున్నప్పుడు నాకు షేక్స్పియర్‍ నాటకం ‘మర్చంట్‍ ఆఫ్‍ వెనీస్‍’ గుర్తుకు వచ్చింది. ఆ నాటకాన్ని షేక్స్పియర్‍• మూడు దశలుగా చెప్పాడు. అవి. 1. రింగ్‍ సన్నివేశం 2. కాస్కెట్‍ సన్ని వేశం 3. కోర్టు సన్నివేశం. ఈ సన్నివేశాలను దృష్టిలో పెట్టుకొని మెజిస్ట్రేట్‍ తన ఉత్తర్వుని మూడు భాగాలుగా విభజించాడు.
మొదటి సన్నివేశం : వివాహం తరువాత పార్టీలు జి.ఐ.పి. ప్రాంతంలో నివశించిన విషయం. ప్రతివాది అయిన ఆమె భర్తకి వేరే స్త్రీతో వున్న అక్రమ సంబంధం ఆమెకు తెలిసింది.


రెండవ సన్నివేశం : ఆ జి.ఐ.పి. ప్రాంతం నుంచి వారు డస్లా ప్రాంతానికి మారినారు. ఇది రెండవ సన్నివేశం. ఆనాడు ఆమెను బంధించి దాడి చేసారు.
చివరి సన్నివేశం : ఎవరో అపరిచిత వ్యక్తికి, అతను మానసిక వైద్యుడని ఆమెను మానసిక రోగి అని అప్పగించిన సన్నివేశం.
ఆ తరువాత ఆ ఉత్తర్వులో ఏమి జరిగిందీ, హైకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నది అన్న విషయం ఇక్కడ అప్రస్తుతం. మేజిస్ట్రేట్‍ విభజించిన మూడు భాగాలని చూసి న్యాయమూర్తికి షేక్షిపియర్‍ నాటకం గుర్తుకొచ్చిందన్న విషయం. దాన్ని తన ఉత్తర్వులలో పేర్కొన్నాడన్న విషయం ముఖ్యమైనది. ఈ వ్యాసానికి అవసరమైనది.


కేరళా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మద్యపాన విధానానికి వ్యతిరేకంగా దాఖలైన దరఖాస్తులో, నోబెల్‍ బహుమతి గ్రహీత లాన్‍ కవితా పంక్తులని కేరళా హైకోర్టు ఉదహరించింది. ఆ చరణాలు ఇలా వుంటాయి.
‘త్వరగా మాట్లాడకండి
ఎందు••ంటే చక్రం ఇంకా తిరుగుతూనే వుంది.
ఎవరు గెలుస్తారో చెప్పలేం
ఈ రోజు ఓడిన వ్యక్తి
రేపు గెలవవచ్చు’
ఇవి మారుతున్న సమయాలకు కారణం. తుపాకీని త్వరగా పట్టుకోవద్దని ఆ కవి చెప్పాడు.


మధ్యపాన విధానం అనేది వ్యక్తిగత అభిరుచులకి లోబడి వుండదని, సమూహ సంక్షేమం కోసం ఉద్దేశించినదని కోర్టు పేర్కొనటం అతని రిట్‍ పిటీషన్ని త్రోసి పుచ్చింది. అయితే బాబ్‍ డిలాన్‍ కవితా పంక్తులని ఉదహరిస్తూ కోర్టు ఇలా అభిప్రాయపడింది.
ఈ రోజు నైతికంగా ఖండించదగినది, సామాజికంగా ఆమోదమోర్చే కానిది రేపు ఆ విధంగా వుండకపోవచ్చు. ఈ తీర్పు రామచంద్రమీనన్‍, దామా శేషాద్రి నాయుడు వెలువరించారు.


మన దేశంలో న్యాయమూర్తులు ఏదైనా విషయాన్ని బలంగా చెప్పడానికి, అదే విధంగా చట్టపరమైన భాష సరిపోదని భావించినప్పుడు సాహిత్యాన్ని కవితా చరణాలని తమ తీర్పుల్లో ఉదహరిస్తూ వుంటారు.
తీర్పుల్తో ఉత్తర్వుల్లో సాహిత్యాన్ని ఉదహరించడం ఓ గొప్ప టెక్నిక్‍. దాన్ని జాగ్రత్తగా ఉదహరించే ఆ తీర్పుకి అది అలంకార ప్రాయం అవుతుంది. కొంత వెలుగుని ప్రసరింప చేస్తుంది.


మంగారి రాజేందర్‍ (జింబో)
ఎ : 9440483001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *