ఉనికి: మధ్యప్రదేశ్ UNESCO SITE – 1986
గుర్తింపు: 1986
విభాగం: సాంస్క•తికం (MOUNUMENT)
ఖజురహోలోని దేవాలయాలు చండేలా రాజవంశం పాలనలో నిర్మించబడ్డాయి. అవి మూడు విభిన్న సమూహాలుగా విభజించబడ్డాయి. ఇవి రెండు వేర్వేరు మతాలకు చెందినవి. ఒకటి హిందూ మతం, మరొ కటి జైన మతం. వాస్తుశిల్పం, శిల్పకళల మధ్య సంపూర్ణ సమతుల్యతతో, అన్ని ఆలయ
ఉపరితలాలు బాగా చెక్కబడ్డాయి. ఆరాధనలు, వంశం, చిన్నచిన్న దేవతలు, సన్నిహిత జంటలను చెక్కారు. ఇవన్నీ పవిత్ర విశ్వాస వ్యవస్థను ప్రతిబింబిస్తాయి. అత్యంత నిపుణులైన శిల్పులు సాధించిన కూర్పు, వారి నైపుణ్యం ఖజురహో దేవాలయాల రాతి ఉపరితలాలకు అరుదైన చైతన్యాన్ని అందించింది. మానవ భావోద్వేగాల వెచ్చదనానికి సున్నితత్వాన్ని అందించింది.
ప్రాధాన్యం: (1) (ii)
(1): ఖజురహో సముదాయం ఒక ప్రత్యేకమైన కళాత్మక స•ష్టిని సూచిస్తుంది. దాని అత్యంత వాస్తవిక ఆర్కిటెక్చర్, అధిక నాణ్యమైన శిల్పాలు, అనేక పవిత్రమైన భావనలు లేదా దూషణ వివరణలకు తావిచ్చిన అనేక ద•శ్యాలతో రూపొందించబడ్డాయి.
(ఱఱ): సామాన్య శకం పదమూడవ శతాబ్దం ప్రారంభంలో ఢిల్లీ సుల్తానేట్ స్థాపనకు ముందు మధ్య భారతదేశంలో అభివ•ద్ధి చెందిన చండేలా సంస్క•తికి ఈ దేవాలయాలు అసాధారణ సాక్ష్యాన్ని ఇస్తున్నాయి.
ఖజురహో దేవాలయాలు సామాన్య శకం తొమ్మిదవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం వరకు మధ్య భారతదేశాన్ని పాలించిన శక్తివంతమైన చండేల రాజులచే నిర్మించబడినట్లుగా చెబుతారు. వారి పాలన అనేక కోటలు, రాజభవనాలు, దేవాలయాలు, చెరువుల నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. వారి రాజధాని నగరం ఖజురహోలో, చుట్టుపక్కల దాదాపు ఎనభై-ఐదు దేవాలయాల నిర్మాణానికి వారి పాలన ప్రఖ్యాతి చెందింది. వాటిలో ఇరవై ఐదు మాత్రమే నేటికి మనుగడలో ఉన్నాయి. చండేలా రాజులు నిర్మించిన చాలా దేవాలయాలు పదవ శతాబ్దం నుండి ఈ ప్రాంతంలో హిందూమతం పునరుజ్జీవనానికి సంబంధించినవి. నగర (ఉత్తర భారత దేవాలయ) నిర్మాణ శైలి వారి కాలంలో అత్యున్నత స్థాయికి చేరుకుంది.
ఖజురహో దేవాలయాలు – పశ్చిమ, తూర్పు, దక్షిణ అనే మూడు ప్రధాన సమూహాలుగా ఉన్నాయి. వీటిలో, ఒక పెద్ద జలాశయానికి ఆనుకుని ఉన్న పశ్చిమ దేవాలయాల సమూహంలో లక్ష్మణ, కందారియ మహాదేవ, విశ్వనాథ, చిత్రగుప్త దేవాలయాలు వంటి అత్యంత ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. తూర్పు సమూహంలో వామన, జవరి, ఆదినాథ దేవాలయాలు ఉన్నాయి. దక్షిణ సమూహంలో ప్రసిద్ధ దులాదియో, చతుర్భుజ ఆలయాలు
ఉన్నాయి.
World Heritage Series: ఖజురహో రచయిత క•ష్ణ దేవ కథనం ప్రకారం, సమిష్టిగా ఈ ఆలయాలు ‘‘విశిష్టమైన, ఏకీక•త నిర్మాణ కార్యక్రమ వ్యక్తీకరణలు. వివరాలలో మాత్రమే విభిన్నంగా ఉంటాయి’’. ఈ దేవాలయాలు ‘‘ప్రణాళిక మరియు ఎత్తులో కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉన్న మధ్య-భారతీయ నిర్మాణ శైలికి పరాకాష్టను సూచిస్తాయి’’.
మూడు సమూహాలలో చాలా దేవాలయాలు ప్రణాళిక, ఎత్తులో క్రమానుగత పురోగతిని కలిగి ఉంటాయి. ఎత్తైన పునాదిపై నిర్మించబడిన ఈ ఆలయాలు ఒక చిన్న వాకిలి ద్వారా ఆవరణల పురోగతితో ఉంటాయి. అర్ధ మండపం నుండి మహా మండపం (Grand Pavellion) (పెద్ద దేవాలయాలలో మాత్రమే) అంతరాలయం, చివరకు, గర్భగుడి ఉంటాయి. ఆలయాల ఎత్తులో సంబంధిత పురోగతిని గమనించవచ్చు, ఇందులో షిక్కార రూపురేఖలలో ఆరోహణ క్రమం స్పష్టంగా వ్యక్తీకరించబడుతోంది. ఈ ఆలయాల శిఖరాలు బహుళ అంచెలు, అందమైన Caseading Profileను కలిగి ఉంటాయి. సూక్ష్మ శిఖరాలు ప్రధాన శిఖరాన్ని క్రమంగా తగ్గుతున్న ఆక•తితో అలంకరిస్తాయి. దేవాలయాల గోడలు, ఇతర ప్రాంతాల దేవాలయాల వలె కాకుండా, పెద్ద బాల్కనీలను కలిగిఉంటాయి.
ఖజురహో దేవాలయాల ముఖ్య లక్షణం వాటి ఎలివేషన్ లలో శిల్పాలు అధికంగా ఉండటం. వీటిలో కల్ట్ చిత్రాలు, దేవుళ్లు, వారి కుటుంబాలు, అప్సరసలు, సురసుందరి లాంటివి ఉంటాయి. సన్యాసులు వంటి లౌకిక ఇతివ•త్తాలు గురు శిష్య సంప్రదాయం. న•త్యకారులు, సంగీతకారులు, శ•ంగార జంటలు లేదా సమూహాలు. పౌరాణిక వ్యాలాలు (రెండు జంతువుల లక్షణాలను కలపడం). దేవతలు లాంటి విగ్రహాలన్నీ కూడా కచ్చితమైన నియమానుగుణ నిష్పత్తులు, భంగిమలకు అనుగుణంగా ఉంటాయి. నిర్మాణ, కళ చారిత్రక ద•క్కోణాల నుండి చూస్తే ఖజురహో అనేది భారతీయ ఆలయ వాస్తుశిల్ప సారాంశం అని విశ్వసిస్తారు.
కందారియా మహాదేవ ఆలయం ఉత్తర భారతదేశంలోని ఆలయ నిర్మాణ శైలికి అత్యుత్తమ, అత్యంత అభివ•ద్ధి చెందిన ఉదాహరణగా పరిగణించబడుతుంది. దీని ప్రధాన శిఖరం ఎనభై-నాలుగు సూక్ష్మ శిఖరాల లయబద్ధమైన ఆరోహణను కలిగి ఉంది, అది బలమైన ద•శ్య వ్యక్తీకరణను ఇస్తుంది. ఈ ఆలయం వెలుపలి, లోపలి గోడలు, స్తంభాలు, పైకప్పులు శిల్పకళా సంపద పరంగా అత్యంతగా అలంకరించ బడ్డాయి. ASI ఈ సైట్ పరిరక్షణ, Land Scapingపై బాగా పనిచేసింది.
జాన్విజ్ శర్మ
అనువాదం : ఎన్. వంశీ