యమునా నది కేంద్రబిందువుగా తాజ్‍ మహల్‍ అందాలు 1983లో UNESCO చే గుర్తింపు

రాష్ట్రం: ఉత్తర ప్రదేశ్‍, భారతదేశం
ప్రకటన తేదీ: 1983
వర్గం: సాంస్క•తికం (స్మారక చిహ్నం)


అత్యుత్తమ సార్వత్రిక విలువ
తాజ్‍ మహల్‍ను మొఘల్‍ చక్రవర్తి షాజహాన్‍ తన భార్య ముంతాజ్‍ మహల్‍ జ్ఞాపకార్థం నిర్మించాడు. దీని నిర్మాణం 1632లో ప్రారంభమై 1648లో ముగిసింది. మసీదు, గెస్ట్ హౌస్‍, ప్రధాన దక్షిణ ద్వారం, బయటి ప్రాంగణం, దాని క్లోయిస్టర్‍లు తదనంతర కాలంలో జోడించబడ్డాయి. తాజ్‍ మహల్‍ విశిష్టతను చాటిచెప్పే నిర్మాణ వినూత్నతలలో తోటల ఉద్యాన ప్రణాళిక, సమాధుల కచ్చితమైన రేఖాగణిత సమరూపత, రాతి అలంకరణ కళ, నాలుగు ఫ్రీ-స్టాండింగ్‍ మినార్లు, గంభీరమైన ప్రధాన ద్వారం ఉన్నాయి. తాజ్‍ మహల్‍ ఒక పరిపూర్ణమైన, సౌష్టవంగా ప్రణాళికాబద్ధంగా రూపొందించబడిన భవనం. ప్రధాన విశిష్టతలు నెలకొన్న కేంద్ర అక్షంతో పాటు ద్వైపాక్షిక సారూప్యతకు కూడా ఇది ప్రాధాన్యం ఇస్తుంది.


ప్రమాణాలు: (1)
(1) పరిపూర్ణ సామరస్యం, అద్భుతమైన శిల్పకళ ద్వారా, ఇండో-ఇస్లామిక్‍ సమాధి ఆర్కిటెక్చర్‍ ఈ మొత్తం శ్రేణిలో, సమతుల్యత, సమరూపత, వివిధ అంశాల సామరస్య సమ్మేళనంలో ప్రత్యేకమైన సౌందర్య లక్షణాలతో అత్యుత్తమ నిర్మాణ, కళాత్మక సాధనను తాజ్‍ మహల్‍ సూచిస్తుంది.
శతాబ్దాలుగా కవులు, యాత్రికులతో ఎంతగానో ప్రశంసించబడిన తాజ్‍ మహల్‍ నిస్సందేహంగా భారతదేశ అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నం. తెల్లని పాలరాతి వైభవంతో తాజ్‍ మహల్‍ నేడు ప్రేమకు చిహ్నంగా నిలుస్తోంది. సామాన్య శకం 1632లో మరణించిన తన ప్రియమైన భార్య ముంతాజ్‍ మహల్‍ కోసం మొఘల్‍ చక్రవర్తి షాజహాన్‍ దీనిని పవిత్ర సమాధిగా నిర్మించాడు.


షాజహాన్‍ ఎల్లప్పుడూ ఆగ్రా కోట నుండి యమునా నది వెంట పొడవైన పడవలో తాజ్‍ నిర్మాణ ప్రదేశానికి ప్రయాణించే వారు. అందువల్ల, ఆయన ఈ స్మారక చిహ్నాన్ని నదీతీరం నుండి… దాని ‘‘స్వర్గానికి ఎగురు తున్న గోపురం’’ పొగమంచు కన్నా పైకి లేచింది, హిమాలయాల తాజా జలాలు కట్టడం అంచున ఉన్నాయి… అని ఊహించడం సహజం. నగరం వైపు నుండి సైట్‍ను సందర్శించే ప్రస్తుత సందర్శకులకు ఈ భావన తరచుగా కనిపించదు. రివర్‍ ఫ్రంట్‍ గోడ, ఒకప్పుడు గొప్పగా అలంకరించబడి, చెక్కబడింది. ఇప్పుడు మారుతున్న స్థితిగతులతో ఆనాటి అందం కోల్పోయింది.
షాజహాన్‍ రాతి ఛాంబర్‍ లోకి ప్రవేశించి ప్రార్థనలు చేయడానికి పాలరాతి మెట్లతో ఒక చిన్న తలుపు కూడా ఉంది. వేగంగా ప్రవహించే నదిని ఆయన తన గొప్ప ప్రణాళికకు కేంద్రంగా చేసుకున్నాడు. నదికి కుడి వైపున నిజమైన పవిత్ర స్థలంగా సమాధి, మరొక వైపు మెహతాబ్‍ బాగ్‍ లేదా మూన్‍లైట్‍ గార్డెన్‍ను ఆనంద ఉద్యానవనంగా కేటాయించి ఉండవచ్చు. ఇది ఖురాన్‍ గ్రంథాలకు అనుగుణంగా కచ్చితమైన సరైన దిశలో నిర్దేశించబడి ఉంది. సమాధులు దోషరహిత అమరికలో ఉన్నాయి. ప్రవేశద్వారం పిష్తాక్‍ (వంపుతో కూడిన ఓపెనింగ్‍ చుట్టూ ఉన్న దీర్ఘచతురస్రాకార ఫ్రేమ్‍)పై నగీషీ రాత కూడా దీన్ని ధ్రువపరిచేలా ‘‘ఎంటర్‍ థౌ మై ప్యారడైజ్‍’’ అని ఉంటుంది.


ఈ కళాఖండం నిర్మాణానికి ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది. ఇది భారతదేశంలో అత్యున్నత మొఘల్‍ వాస్తుశిల్పంగా గుర్తించబడింది. తాజ్‍ మహల్‍ ప్రకాశం దాని స్వచ్ఛమైన, ప్రకాశించే తెల్లని పాలరాతి ముఖ భాగం, దానిపై చెక్కబడి, పొదిగిన అతి సూక్ష్మ డిజైన్లలోనే ఉంది. దీని కోసం 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్రానా నుండి ఎంపిక చేసిన పాలరాయిని ఎడ్ల బండ్ల వరుసల్లో రవాణా చేశారు. లాపిస్‍ లాజులి (అందమైన నీలం రాయి), అగేట్‍ (ఒక రకం విలువైన రాయి), కార్నెలియన్‍ (ఒక రకం రాయి) ఆఫ్ఘనిస్తాన్‍, అంతకంటే దూరంలో ఉన్న దేశాల నుండి తెప్పించారు. 20,000 మందికి పైగా కార్మికులు ఈ భవనాన్ని నిర్మించారు. వారితో పాటు ఎంతో మంది నిపుణులు, మేస్త్రీలు, శిల్పులు దీని నిర్మాణంలో పాలుపంచు కున్నారు. ఈ అత్యుత్తమ భవనాన్ని నిర్మించడానికి వారిని ఆగ్రాకు పిలిపించడంతో నగరం ఎంతో అభివ•ద్ధి చెందిందని చెప్పవచ్చు.


ఈ మొత్తం నిర్మాణంలో మధ్యలో ముంతాజ్‍ మహల్‍ సమాధి ఉంది. అది అల్లా తొంభై పేర్లతో పాటు పుష్పాలు, అరబెస్క్ కళాత్మక అలంకరణలతో కూడా చెక్కబడి ఉంది. దాని కింద రాతిగదిలో అసలు సమా ధులు (ముంతాజ్‍ మహల్‍, షాజహాన్‍) ఒకేలా ఉంటాయి. ఇవి పూర్తిగా సాదా, ఎలాంటి ప్రత్యేకతలు లేని గదిలో ఉన్నాయి. ఇక్కడే ఒక మిస్టరీ ఉంది. షాజహాన్‍ తన కోసం ఏం ప్లాన్‍ చేసుకున్నాడు? నిశ్చయంగా అది ఆయన సమాధి మాత్రం కాదు. ఆయన సమాధి కూడా ముంతాజ్‍ మహల్‍ సమాధి పక్కన ఉంచబడి నప్పటికీ, వాస్తవానికి మొత్తం సముదాయంలో అది ఒక సరితూగని అంశంగా ఉందా? తాజ్‍లో ఇప్పటికీ ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. వాటి లోతుల్లోకి వెళ్లేవారిని అవి ఆహ్వానిస్తూనే ఉంటాయి.


గత శతాబ్దంలో, తాజ్‍ మహల్‍ను రక్షించడానికి, పునరుద్ధరించడానికి గణనీయమైన క•షి జరిగింది. దాదాపు వంద సంవత్సరాల క్రితం చార్‍బాగ్‍ పూర్తిగా చదును చేయబడింది. కానీ దాని రూపకల్పన స్ఫూర్తిని అలాగే ఉంచారు. 1996లో ఒక చారిత్రాత్మక సుప్రీంకోర్టు తీర్పులో, పర్యావరణ కాలుష్యం ప్రభావం నుండి పాలరాయిని రక్షించడానికి కాంప్లెక్స్ చుట్టూ 500 మీటర్ల గ్రీన్‍ బెల్ట్ నిర్మించాల్సిందిగా ఆదేశించారు. నేడు, ఏఎస్‍ఐ దీన్ని నిర్వహిస్తోంది. నిరంతరం పెరుగుతున్న సందర్శకులకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తోంది. అయినప్పటికీ, ప్రాముఖ్యత కలిగిన ఈ సైట్‍ నిర్వహణ ఇప్పటికీ ఆందోళన కలిగించే విధంగానే ఉంది.

  • అమితా బేగ్‍
    అనువాదం : ఎన్‍. వంశీ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *