మానస్‍ వన్యప్రాణుల అభయారణ్యం 1985లో UNESCO చే గుర్తింపు

ప్రదేశం: అస్సాం
గుర్తింపు: 1985
విభాగం: నేచురల్‍


మానస్‍ వన్యప్రాణుల అభయారణ్యం మానస్‍-బెకి నదీ తీరంలో విస్తరించి ఉంది. భూటాన్‍లోని తూర్పు హిమాలయ పర్వత ప్రాంతాలలోని రక్షిత ప్రాంతాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంటుంది. ఈ సైట్‍ ప్రక•తి అందాల్లో పర్వత ప్రాంత అడవులు, ఒండ్రు గడ్డి భూములు, ఉష్ణమండల సతత హరిత అడవులు ఉన్నాయి. ఈ సైట్‍ లో అరుదైన, అంతరించిపోతున్న జాతుల ఆవాసాలు ఉన్నాయి. భారత ఉపఖండంలోని రక్షిత ప్రాంతాలలో ఇది అసాధారణమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.


ప్రాథమ్యాలు (vii) (ix) (x)
(vii) మానస్‍ దాని గొప్ప జీవవైవిధ్యానికి సంబంధించి మాత్రమే కాకుండా దాని అద్భుత ప్రక•తి రమణీ యత, అందమైన ల్యాండ్‍ స్కేప్స్కు సంబంధించి కూడా గుర్తించబడింది.
(ix) రుతుపవనాలు, నదీ వ్యవస్థ కలసి చలనశీలక జీవావరణ పక్రియలను ఏర్పరిచాయి. మూడు రకాల వ•క్షజాలాన్ని ఇక్కడ చూడవచ్చు. పాక్షిక-సతత హరిత అడవులు, మిశ్రమ తేమ- పొడి ఆకురాల్చే అడ వులు, ఒండ్రు గడ్డి భూములు. ఇది వ•క్షసంపదకు సంబంధించి అద్భుతమైన పునరుత్పత్తి, స్వీయ-మనుగడ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.
(x) మానస్‍ భారతదేశంలో అత్యంతగా అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న అనేక రకాల క్షీరదాలకు ఆవాసాన్ని అందిస్తుంది. ఆవాసాలు, వ•క్షసంపద కూడా మొక్కల అధిక వైవిధ్యానికి కారణమవుతుంది. ఇది భారీ సంఖ్యలో శాకాహార జీవులకు వాటి మనుగడకు అతి ముఖ్యమైన మేతను అందిస్తుంది.


అన్ని అసమానతలపై ప్రక•తి సాధించే స్థితిస్థాపకతను మానస్‍ వన్యప్రాణుల అభయారణ్యం వివరిస్తుంది. దీనికి 1985లో యునెస్కో నుంచి వరల్డ్ హెరిటేజ్‍ సైట్‍ గుర్తింపు లభించింది. 1992లో ఈ గుర్తింపు తొలగించబడింది. 2011లో ఇది తిరిగి యునెస్కో గుర్తింపు పొందగలిగింది. ఇది దశాబ్దాల తరబడి సామా జిక అల్లకల్లోలం చూసింది. ఈ ప్రాంతంలో వేట గణనీయంగా జరిగింది. ఇక దీని సరిహద్దుల్లో అటు రైతులు, భూమి లేని వర్గాల నుండి భూమి కోసం ఒత్తిడిని చూసింది. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ వాటి నుంచి జంతువులు బయటపడ్డాయి. పగటి కాంతిని, మనుషులను తప్పించుకునేందుకు వాటి ప్రవర్తనా విధానా లను మార్చుకున్నాయి. భూటాన్‍లోని రాయల్‍ మానస్‍ నేషనల్‍ పార్క్ లోని దట్టమైన అడవులు, వాగులు, వంకలు వివిధ జీవుల ఆవాసానికి, విశ్రాంతికి తగిన స్థలాన్ని అందించాయి.


మధ్య భూటాన్‍లో ఉద్భవించిన హిమాలయ నది మాంగ్డేచు నుండి మానస్‍కు ఆ పేరు వచ్చింది. అంతర్జాతీయ సరిహద్దులోకి ప్రవహించడానికి ముందు ఈ నదిని దీని సోదరి బెకి లేదా డాంగ్మేచు కలుస్తుంది. ఇక్కడి ప్రక•తి ఎంత అద్భుతమైన అందంతో, ప్రశాంతతతో ఉంటుందంటే గతంలో మాథంగురి ప్రాంతం రాజకుటుంబాలకు విహార విడిదిగా ఉండేది. నీళ్ళు నీలి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఎడ్మండ్‍ హిల్లరీ తాను మానస్‍కు చేసిన ‘‘ఓషన్‍ టు స్కై’’ యాత్ర సందర్భంగా హామిల్టన్‍ జెట్‍ బోట్‍ను మానస్‍కు అంకితం చేశారు.
మాథంగురి-బాన్స్ బరి రహదారి వెంబడి మరింత దక్షిణం వైపు, ఈ సైట్‍ అత్యుత్తమ సార్వత్రిక విలువ మరింతగా జీవం పోసుకుంది! గ్రేట్‍ హార్న్ బిల్‍ పక్షులు ఎగరడం, సెమల్‍ సిల్క్-కాటన్‍ ట్రీ మొగ్గలను తినే క్యాప్డ్ లంగూర్‍ లేదా అడవి వాగులలో చాలా అరుదైన తెల్లటి రెక్కల ఉడ్‍ డక్‍ (బాతు)లను చూడవచ్చు.


గడ్డిభూమి-అడవిప్రాంతం అంచున, సాంబర్‍ జింకలు, హిస్పిడ్‍ కుందేళ్ల సంచారాన్ని చూడవచ్చు. సీజన్‍లో ఉలు మోత్రా లేదా బెంగాల్‍ ఫ్లోరికాన్‍ పక్షులుబీ హాగ్‍ జింకల మంద తమకు మాత్రమే ప్రత్యేకంగా ఉండే ‘‘వైట్‍ సాక్స్’’లో అడవి బర్రెలు, ఏనుగుల గుంపు చూడవచ్చు. అద•ష్టం ఉంటే మెలనిస్టిక్‍ బ్లాక్‍ పాంథర్‍ కూడా ఎదురుపడుతుంది. అది నిజంగా ప్రక•తి అందించే అత్యుత్తమ బహుమతి! అరుదుగా పిగ్మీ హాగ్‍ (ఒక రకం అడవిపంది) లను చూడవచ్చు. అలాగే మానస్‍ నది ద్వారా భౌగోళికంగా ఒంటరి అయిపోయిన గోల్డెన్‍ లంగూర్‍లు కనిపించడం కూడా చాలా అరుదు. కానీ అవన్నీ కాలక్రమంలో వ•ద్ధి చెందుతాయి. ఈ సైట్‍ సహజ విలువలకు జోడించబడతాయి. బహుశా మొత్తం ఈశాన్య ప్రాంతంలో ఇక్కడే అవి అత్యధికం కావచ్చు కూడా.


మానస్‍ నేటి స్థితికి రావడం అంత సులభంగా జరిగిందేమీ కాదు. పునర్నిర్మాణం, పునరుద్ధరణలకు పంతొమ్మిదేళ్ల కంటే ఎక్కువ సమయమే పట్టింది. స్థానిక స్వపరిపాలన సుస్థిరత్వాన్ని తీసుకువచ్చింది. దానితో పాటు వన్యప్రాణుల నిర్వహణకు వివిధ భావనల అమలు కూడా తోడ్పడింది. ఖడ్గమ•గాలు, చిత్తడి జింకలకూ దీన్ని ఆవాసంగా మార్చేందుకు వీలుగా వాటి సంతతిని వ•ద్ధి చేసేందుకు పబిటోరా, కజిరంగా నుండి కొన్ని జీవులను విజయవంతంగా ఇక్కడికి మార్చారు.


ఇక్కడ ఉంటున్న పులులను లెక్కించారు. ఓ శుభవార్త ఏమిటంటే, వాటి సంఖ్య పెరుగుతోంది. అవి మానస్‍ అటవీ ప్రాంతాల్లో నిర్భయంగా తిరుగుతాయి. తద్వారా వాటి పరిరక్షణ అనేది రాజకీయ సరి హద్దులకు మించి విస్తరించాలి అనే సందేశాన్ని అందించింది. వరదల సమయంలో కజిరంగా నుండి రక్షించబడిన, అనాథ ఖడ్గమ•గం, ఏనుగు పిల్లలకు కూడా ఇది కొత్త ఆవాసాన్ని అందించింది. అడవిలో స్వేచ్ఛను పొందేందుకు రెండో అవకాశాన్ని పొందాయి.


ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం చేపట్టారు. వేట నిరోధక శిబిరాలు ఏర్పాటయ్యాయి. రోడ్లు వేశారు. పెట్రోలింగ్‍ వాహనాలను అందించారు. శిక్షణ పొందిన సిబ్బందిని సమకూర్చారు. రక్షణ, నిఘా అధికం చేశారు. వీటన్నింటికీ మించి అభయారణ్యం అభివ•ద్ధి కోసం పని చేయడానికి మాజీ వేటగాళ్లతో సహా స్థానిక యువతను ప్రోత్సహించే కమ్యూనిటీ పరిరక్షణ నమూనా ఒక కొత్త ప్రమాణాన్ని రూపొందించింది. ఇది మానస్‍ బఫర్‍ అడవులలో తిరిగి ఇదే నమూనాను అనుసరించారు. శాంతి పునరుద్ధరణతో, పర్యాటకులు తిరిగి వచ్చారు. కొత్తవారికి మానస్‍ నిజంగానే చక్కటి అడవి అనుభూతులను అందిస్తుంది.

  • సోనాలి ఘోశ్‍
    అనువాదం : ఎన్‍. వంశీ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *