ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

విశ్వంలో జీవరాశుల మనుగడకు మూలాధారం అయిన భూమి, గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాలను ప్రకృతే ఈ విశ్వానికి అందించింది. పంచ భూతాల నిష్పత్తిలో సమతుల్యత లోపించి మానవ జీవనం అస్తవ్యస్తమౌతుంది. మానవాళి పలు విపత్తులకు గురవుతుంది. ప్రకృతి వాతావరణ పర్యావరణ సమతుల్యత మానవ మనుగడకు అవసరం. ఆధునికీకరణ ‘పారిశ్రామికీకరణ, పట్టణీకరణ’ శీఘ్రంగా విస్తరిస్తున్న కార్పొటీకరణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంభవిస్తున్న పరిణామాలు మానవుని స్వార్థపరత్వం ప్రకృతి విధ్వంసం దిశగా కొనసాగడం శోచనీయం.
ప్రకృతి విధ్వంసం
మానవుడు తన భౌతిక అవసరాల కోసం తరతరాల ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు. ప్రకృతి మీద ఆధిపత్యం సాదిస్తున్నాననే మాయలో పడి మానవ మనుగడకు ఆధారమైన ప్రకృతిని రక్షిస్తే అది మనలను రక్షిస్తుంది అన్న వాస్తవాన్ని మరిచిపోవడం వల్ల మానవ జాతి అనేక విపత్తులు ఎదుర్కోవడం గమనార్హం. ప్రకృతి రక్షితే మానవ రక్షిత అన్న సత్యాన్ని మరువ కూడదు. మానవుడు చేసే చర్యలు భవిష్యత్‍ తరాలకు శాపంగా పరిణమించే ప్రమాదాన్ని గుర్తించకపోవడం శోచనీయం.


మానవ తప్పిదాలు ప్రకృతివిధ్వంసం
మానవ తప్పిదాల వల్ల ప్రకృతి విధ్వంసానికి గురౌతుంది. ప్రకృతిలో మానవుడు తప్ప మిగతా జీవరాశి (జీవులు) ప్రకృతిచెప్పినట్లు ప్రవర్తిస్తు న్నాయి. ప్రకృతికి భిన్నంగా నడిచే మానవుడు చేసే ప్రతి కూల చర్యల వలన ఏపాపం ఎరుగని మూగ జీవాలు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. మానవుడు సాధించిన శాస్త్ర సాంకేతిక ప్రగతి, జీవావరణ రంగాల్లో సాధించిన ప్రగతి దానివల్ల కలిగిన మార్పులు మాత్రం ప్రకృతి స్వచ్ఛతకు ఉనికికి ముప్పుగా పరిమించాయి. ఒక పక్క వ్యవసాయ రంగములో హరిత విప్లవం తర్వాత అధిక దిగుబడులు పెంచేందుకు అధిక ఉత్పాదకత పేరున విచ్ఛల విడిగా వినియోగించిన రసాయనిక ఎరువులు, క్రిమిసంహరక మందుల వాడకం ఎక్కువైంది దీనివల్ల పంట దిగుబడి పెరిగింది కాని గాలి, నీరు, నేల కలుషితమైనాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తున్న క్రిమిసంహారక మందులు (అనేక వ్యాధులకు) రోగ కారకాలు అవుతూ ప్రజారోగ్యనికి ప్రమాదకరంగా పరిణమించింది. మరోపక్క అతి నీల లోహిత కిరణాల నుండి మానవులను కాపాడే ‘ఓజోన్‍ పొరలో’ మానవాళి స్వార్థం వల్ల ఏర్పడిన రంధ్రాలు రాను రాను విస్తరిస్తున్నాయి. వీటికి తోడు పట్టణీకరణ ‘పారిశ్రామిక విప్లవం జనాభా పెరుగుదల’- ‘రియల్‍ ఎస్టేట్‍ వ్యాపారం’ అడవుల నరికివేత, సహజ వనరుల విధ్వంసం, ఇసుక మాఫియా, మితిమీరిన ప్లాస్టిక్‍ వాడకం ప్రకృతి ని నాశనం చేస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు అభివ•ద్ధి పేరున భారీ ప్రాజెక్టులను కాలుష్య కారక పరిశ్రమలను స్థాపిస్తు పర్యావరణం జీవావరణం ప్రకృతి విధ్వంసానికి పాల్పడడం గమనార్హం. దీనివల్ల అనేక సంఖ్యలో వృక్ష జాతులు, జంతు జాతులు అంతరించాయి. మరికొన్ని అంతరించిపోతున్న జాబితాలోకి చేరాయి.
ప్రకృతి రక్షణ సుస్థిరాభివృద్ధి
మానవుడు ఉన్నన్ని రోజులు ప్రకృతి వనరులను ఉపయోగించుకోవాలి. తర్వాత తరానికి అందించాలి. ప్రకృతి వనరులు తరతరాల వారసత్వ సంపద వాటిని రక్షించాలి. భావి తరాల కోసం వీటిని భద్రపరచాలి. విద్వంసం చేయకూడదు. వనరులను అనుభవించే హక్కు మాత్రమే వుంది. సమస్త జీవకోటితో నిండిన ప్రకృతిని సమిష్టిగా పంచుకోవాలి. గడచిన తరాలు ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకున్నారు. ప్రకృతి పర్యావరణాన్ని సంతులిన పద్ధతిలో ఉపయోగించారు.


ప్రకృతి దేవత
భారతదేశములో ప్రకృతిని దేవతగా ఆరాధించే సంస్క•తి వుందన్న చారిత్రిక సత్యాన్ని మరువకూడదు. ఆధునికీకరణ పేరు మీద ప్రకృతి సహజ వనరులను విచక్షణారహితంగా అపరిమితంగా వినియోగిస్తూ పరిమిత వనరులను కాలుష్యం చేస్తూ భావితరాల వారికి ఆర్థిక, ఆరోగ్య సమస్యలను కానుకగా ఇస్తున్నాం. వారసులకు సంపద ఇవ్వాలని పోటీ పడుతున్న సమాజంలో స్వచ్ఛత గల ప్రకృతి పర్యావరణాన్ని ఇవ్వాలన్న స్ప•హ లోపించింది. సుస్థిరాభివృద్ధి కి తీవ్ర విఘాతం కలిగించే ధోరిణిని సమాజం విడనాడాలి.
అటవీ క్షీణత పెరుగుతున్న కాలుష్యం
విచక్షణా రహితంగా అటవీ సందను ధ్వంసం చేయడం కొల్లగొట్టడం వల్ల 33 శాతం వుండాల్సిన అడవులు నేడు దేశములో 21 శాతానికి మించి లేవు. సగటున రోజుకు 333 ఎకరాల అటవీ భూమి అద•శ్యమై పోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. విచక్షణ రహితంగా అటవీ సంపదను విధ్వంసం చేయటం వల్ల ప్రకృతి విపత్తులు అకాల వర్షాలు వరదలు వచ్చి అపారమైన ఆస్తినష్టం ప్రాణ నష్టం సంభవిస్తుంది. మానవ చర్యల వల్ల గాలి కాలుష్యం అవుతుంది. గాలి కాలుష్యం వల్ల ప్రతి యేటా 70 లక్షల మంది మ•త్యువాత పడుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‍ తన నివేదికలో వెల్లడించింది. వరదలు వానల వల్ల కలుషితమైన నీరుతాగి రోగాల బారినపడి యేటా 2లక్షల మంది చనిపోతున్నారని నీతి ఆయోగ్‍ గణాంకాలు తెలియచేస్తున్నాయి. వ్యవసాయ పారిశ్రామిక రంగాల విస్తరణ వల్ల 85 శాతం చిత్తడి నేలలను ప్రపంచం కోల్పోయింది. 75 శాతం భూఉపరితలం మార్పుకు లోనయ్యింది. 66 శాతం సముద్ర విస్తీర్ణం ప్రభావితమైందన్న అద్యయనాంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆధునిక సౌకర్యాల పేరు మీద మానవుడు విలాస జీవితానికి అలవాటుపడి కాలుష్య కారకమైన వస్తువులను ఉపయోగిస్తూ పర్యావరణానికి హాని చేస్తున్నాడు. పారిశ్రామికీకరణ పట్టణీకరణ విస్తరణ ఫలితంగా వాతావరణంలోకి అపరిమిత కర్భన ఉద్గారాలు విడిచి పెట్టడంవల్ల భూగోళం అగ్నిగోళంగా మారి గ్లోబల్‍ వార్మింగ్‍ కారణమై ఓజోన్‍ పొర క్షీణతకు మానవ చర్యలే ప్రత్యక్షంగా కారణం కావడం అంతే గాకుండా మనకు ఊపిరిని ఇచ్చే వాయువును కూడ కాలుష్య భరితం చేశాం.
వాయు జల కాలుష్యం
మనం పీల్చుకునే వాయువు కాలుష్య భరితమయింది. నదీ జలాలు కలుషితమై తాగునీటి కొరత ఏర్పడింది. పంటల దిగుబడిలో కీలకపాత్ర పోషించే తేనెటీగలు.. ఊరపిచ్చుకలు అంతరించి పోతున్నాయి. పంటల దిగుబడి తగ్గి ఆహారోత్పత్తి కొరత ఏర్పడి ఆహార విపత్తు ఏర్పడే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన ఇంటర్నేషనల్‍ యూని యన్‍ ఫర్‍ కన్సర్వేషన్‍ ఆఫ్‍ నేచర్‍ అనే అంతర్జాతీయ సంస్థ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యతులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రకృతి పర్యావరణం పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం విధ్వంసం. ఇలాగే కొనసాగితే ప్రపంచము లోని ప్రతి నాలుగు జీవ జాతుల్లో ఒకటి అంతరించిపోయే దశలో ఉన్నట్లు అభిప్రాయపడింది.
మానవుడు తన మేధస్సు ద్వారా అనేక పరిశోధనలు చేశాడు. ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ద్వారా అనేక ఆవిష్కరణలు చేశాడు. ఆధునిక టెక్నాలజీ వల్ల ఎంతో ప్రగతి పురోగతి అభివృద్ధి సాధించాడు. సాధించిన ప్రగతి ప్రకృతి పర్యావరణ వినాశనకరంగా పరిణమించింది. ప్రకృతిని రక్షించుకునే స్థితి రోజు రోజుకూ క్షీణిస్తుంది. దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ఋతువులు గతి మారుతున్నాయి.
ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. వరదలు తుఫానులు భూకంపాలు అగ్నిపర్వతాలు, సునామీలు మానవ జాతిని భయపెడుతున్నాయి. కరోనా లాంటి ప్రాణాంతక వైరస్‍లు సులువుగా విజ•ంభించి మానవ జాతిని మ•త్యు కుహరంలోకి నెట్టినప్పటికి ప్రకృతి విధ్వంసాన్ని అదుపు చేయకపోవడం శోచనీయం.


ప్రకృతి ఉపద్రవాలు మానవ దోషాలు ఒకదానికి ఒకటి తోడై ప్రపంచ మానవాళి నేడు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ప్రకృతి పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి. సహజ వనరుల సంరక్షణ ఉపయోగం గురించి అవగాహన కలిగించడానికి ప్రకృతి పరిరక్షణ పద్ధతుల పట్ల ప్రజలకు అవగాహన చైతన్యము శిక్షణా కార్యక్రమాలను సదస్సులను ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ప్రతి యేటా జూలై 28 నాడు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు.

  • ఎసికె. శ్రీహరి
    ఎ : 9849930145

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *