కేరళరాష్ట్రంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు

కేరళ రాష్ట్రం పశ్చిమ సముద్ర తీరాన్ని అంటుకుని యున్నది. ఈ రాష్ట్రానికి తూర్పులో తమిళనాడు మరియు ఈశాన్యంలో కర్నాటక రాష్ట్రాలు ఉన్నవి. ఈ రాష్ట్రంలో చాలా భూభాగంలో సదరన్‍ గ్రాన్యులైటు టెర్రేన్‍కు చెందిన చార్నోకైట్‍ మరియు కొండలైట్‍ గ్రూప్స్కు చెందిన శిలలు ఉన్నవి. తమిళనాడు, కర్నాటక బార్డర్‍ వద్ద పిజిసికి చెందిన నైస్‍ మరియు గ్రానైట్స్ కలవు. సముద్ర తీరానికి దగ్గరగా కన్నురూకు తూర్పులో వెంగడ్‍ గ్రూప్‍కు చెందిన మైకాశిస్ట్, క్వార్ట్జైడ్‍, కంగ్లామరేట్‍ శిలలు కలవు. కొన్ని యాసిడ్‍ మరియు బేసిక్‍ ఇంట్రూసిప్స్ అక్కడక్కడా కలవు. ఈ రాష్ట్రంలో పలు ప్రాంతాలలో లాటరైట్‍ డిపాజిట్స్ ఉన్నవి. ఈ రాష్ట్రం యొక్క కోస్టల్‍ ప్లేన్‍ చాలా న్యారోగా ఉంటుంది. దీనికి కారణం ఇది ఒక ఎరోషనల్‍ కోస్ట్ మరియు రాక్‍ ప్రోమాంటరీస్‍తో కూడి ఉంటుంది..


ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన జియో హెరిటేజ్‍ స్థలాలు రెండు (2)
1) వరకలా క్లిఫ్‍, తిరువనంతపురం జిల్లాలో
2) అంగడిపురం లాటరైట్‍, మల్లపురం జిల్లాలో


వరకలా క్లిఫ్‍ :
ఇది దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉన్న తిరువనంతపురం జిల్లాలో రాజదానికి 55 కి.మీ. ఈశాసన్యంలో ఉన్న ఒక అద్భుతమైన క్లిఫ్‍. సముద్ర అలలతో చెక్కబడిన 30 మీటర్ల ఎత్తుగల సెడిమెంటరీ శిలల క్లిఫ్‍. ఇది 7 కి.మీ. పొడవు గల ప్రకృతి చెక్కిన ఆకర్శవంతమైన జియో మార్ఫిక్‍ ఫీచర్‍. ఈ ఏడు కిలోమీటర్లలో మధ్య మధ్యలో గ్యాప్స్ కలవు. మరియు ఫ్రేజైల్‍ సెడిమెంటరీ శిలలు ప్రిసర్వ్ అయినవి. ఉదాహరణకి సాండ్‍ స్టోన్‍, వేరి గేటెడ్‍ క్లేస్‍, కర్బోనెశ్యస్‍ క్లేస్‍ ఏవైతే మైయొ-ప్లెయొసీన్‍ పీరియడ్‍ అనగా 2.3-1.5 మిలియన్‍ సంవత్సరాల క్రితం ఏర్పడినవి. ఈ స్థలం నియొటెక్‍టానిక్‍ యాక్టివిటి వల్ల అప్‍లిఫ్ట్ అయిన ప్రాంతంగా నిర్ధారించబడినది.


అంగడిపురం లాట రైట్‍ :
ఈ లాటరైట్‍ డిపాజిట్‍ మల్లపురం జిల్లాలోని అంగడిపురం గ్రామం వద్ద కలదు. కేంద్ర ప్రభుత్వం ఈ స్థలాన్ని 1979లో జియోహెరిటేజ్‍ సైట్‍గా గుర్తించింది. ఇదే సంవత్సరంలో లాటరైటైసెషన్‍ సబ్జెక్ట్ మీద అంతరాష్ట్రీయ సెమినార్‍ జరగడం అందులోనే ఈ స్థలాన్ని గుర్తించడం జరిగింది. అంగడిపురంలో మొట్టమొదట 1807లో లాటరైట్‍ను గుర్తించింది. ఫ్రాన్‍సియొస్‍ బుచనన్‍ అనే జియాలజిస్ట్. మొదట దీనిని ఇన్‍డురేటెడ్‍క్లే అని అనేవారు. లాటరైట్‍ ఏ శిలపైనైనా ఏర్పడవచ్చును. లాటరైట్‍ జనరల్‍గా పిట్టెడ్‍ మరియు పో రస్‍ స్ట్రక్చర్‍తో కూడి యుంటుంది. దీనినే పిసొలిటిక్‍ స్ట్రక్చర్‍ అని అందరు. లాటరైట్స్లో ఎక్కువ శాతం ఖీవ203 మరియు •శ్రీ203 కలదు. ఈ ప్రాంతంలో లాటరైట్‍ ఏసిడ్‍ చార్నొకైట్‍ శిల ద్వారా దానిపైన ఏర్పడినది. ఇది మీన్‍ సీ లెవల్‍ పైన 60 మీటర్ల ఎత్తులో కలదు. దీనికి ఎకొనామిక్‍ సిగ్నఫికెన్స్ ఉంది. ఎందుకంటే ఇది అలుమీనియమ్‍ ఓర్‍ (బాక్సైట్‍), ఐరన్‍ ఓర్‍ మరియు నికల్‍ ఓర్‍లతో అసొసియేట్‍ అయినందు వల్ల. అంగడిపురం మల్లపురం నుండి 15 కి.మీ. ల దూరంలో పాలక్కాడ్‍ – కొజికోడ్‍ రహదారి ఈ ప్రాంతం గుండా వెళ్తుంది.

  • కమతం మహేందర్‍ రెడ్డి
    ఎ : 91 90320 12955

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *