సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా శిలాజ రహిత ఇంధనాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి మరియు జీవ ఇంధన రంగంలో ప్రభుత్వం చేస్తున్న వివిధ ప్రయత్నాలను హైలైట్ చేయడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తేదీన ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని జరుపుకుంటారు.
1893వ సంవత్సరంలో వేరుశెనగ నూనెతో ఇంజిన్ను నడిపిన సర్ రుడాల్ఫ్ డీజిల్ పరిశోధనా ప్రయోగాలను కూడా ఈ రోజు గౌరవిస్తుంది. అతని పరిశోధనా ప్రయోగంలో వివిధ మెకానికల్ ఇంజిన్లకు ఇంధనం అందించేందుకు వచ్చే శతాబ్దంలో శిలాజ ఇంధనాల స్థానంలో కూరగాయల నూనె రాబోతోందని అంచనా వేసింది.
ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని 2015 నుండి పాటిస్తున్న పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ
జీవ ఇంధనాల అభివ•ద్ధి స్వచ్ఛ భారత్ అభియాన్ మరియు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ వంటి పథకాలతో సమకాలీకరించ బడింది. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని మొట్టమొదట ఆగస్టు 2015లో పెట్రోలియం మరియు గ్యాస్ మంత్రిత్వ శాఖ నిర్వహించింది.
జీవ ఇంధనాలు పర్యావరణ అనుకూల ఇంధనాలు మరియు వాటి వినియోగం కార్బన్ ఉద్గారాల నియంత్రణ గురించి ప్రపంచ ఆందోళనలను పరిష్కరిస్తుంది. జీవ ఇంధనాలు పునరుత్పాదక బయో-మాస్ వనరుల నుండి తీసుకోబడ్డాయి. అందువల్ల, అధిక ఆర్థిక వ•ద్ధికి సంబంధించిన రవాణా ఇంధనాల కోసం వేగంగా పెరుగుతున్న అవసరాలను తీర్చడంలో స్థిరమైన అభివ•ద్ధిని ప్రోత్సహించడానికి, సాంప్రదాయ ఇంధన వనరులకు అనుబంధంగా వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తాయి.
జీవ ఇంధనాలు ముడి చమురుపై దిగుమతి ఆధారపడటం, పరిశుభ్రమైన వాతావరణం, రైతులకు అదనపు ఆదాయం మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన వంటి ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ మరియు రైతుల ఆదాయాన్ని పెంపొందించడం కోసం భారత ప్రభుత్వ కార్యక్రమాలతో జీవ ఇంధనాల కార్యక్రమం కూడా సమన్వయంతో ఉంది.
జీవ ఇంధనం అంటే ఏమిటి?
జీవ ఇంధనాలు పర్యావరణ అనుకూల ఇంధనాలు, ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. అవి స్థిరమైన అభివ•ద్ధికై పునరుత్పాదక బయోమాస్ వనరుల ద్వారా స•ష్టించబడ్డాయి. 21వ శతాబ్దపు ప్రపంచంలోని శక్తి అవసరాలను తీర్చడంలో జీవ ఇంధనాలు సహాయపడతాయి.ఈ పక్రియలో పర్యావరణానికి నష్టం జరగకుండా సహాయపడతాయి.
- శ్రీలత,