ఆంధప్రదేశ్‍ రాష్ట్రం యొక్క శిలా మరియు ఖనిజ సంపద

ఆంధప్రదేశ్‍ రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయిన తరువాత ఇప్పుడున్న భూభాగం 1,60,205 చదరపు కిలోమీటర్లలో విస్తరించి వున్నది. ఈ రాష్ట్రానికి ఉత్తరాన తెలంగాణ, ఒడిస్సా, తూర్పులో బంగాళాఖాతం, తమిళనాడు, దక్షిణ దిశలో మరియు పశ్చిమ దిశలో కర్ణాటక ఉన్నది. పుదుచ్చేరి యొక్క చిన్న ప్రాంతమైన యానం జిల్లా (30 చ.కి.మీ) గోదావరి డెల్టాలో ఉండడం విశేషం.


ఈ రాష్ట్రానికి 972 కి.మీ. పొడువైన సముద్ర తీరం ఉండటం, దీని వైశాల్యం 40 కి.మీ. ప్రాంతం కావడం, మరియు దేశంలోని రెండు పెద్ద నదులు కృష్ణా, గోదావరి ఈ ప్రాంతంలో పారడమే కాకుండా పెద్ద డెల్టాలుగా విస్తరించడం రాష్ట్రానికి చాలా ఉపయోగకరంగా మారింది. చాలా నదులు ఈ రాష్ట్రంలో
ఉన్నవి. అందులో ప్రముఖమైనవి నాగవల్లి, వంశధారా ఉత్తర కోస్తాలో వున్నవి. పెన్నేర్‍ నది దక్షిణ ప్రాంతమైన నెల్లూరు వద్ద కలదు. ఈ రాష్ట్రంలోని పర్వత / కొండ ప్రాంతాలు రెండు ప్రముఖమైనవి. అవి ఈస్ట్ర్న్ ఘాట్స్ మరియు నల్లమలై రేంజ్‍ ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని భూభాగం చాలా వరకు ధార్వర్‍ క్రేటాన్‍ ఈస్ట్ర్న్ షాట్‍ మొబైల్‍ బెల్ట్, ఇంటాక్రేటానిక్‍ కడప బేసిన్‍ మరియు క్వాటర్‍ నెరికి చెందిన శిలా నిక్షేపాలు ఉండడం విశేషం. ధార్‍వార్‍ క్రేటాన్‍లో ఆర్‍క్యన్‍ నుండి పేలియొ ప్రొటిరోజోయిక్‍ పిరియడ్‍కు చెందిన శిలలు ఉన్నవి. అవి శిస్ట్ బెల్ట్లుగా గుర్తించబడినవి. వీటిలో రకరకాల శిస్టోస్‍ శిలలతో కూడి వున్నవి. వీటి ట్రెండ్‍ను ధార్వర్‍ యన్‍ ట్రెండ్‍ అని అందురు. ఇవి NNW-SSE పొడువుగా విస్తరించడం వలన వీటిని శిస్ట్ బెల్ట్ అని నామకరణం చేశారు. చాలా వరకు బంగారు నిక్షేపాలు ఈ శిస్ట్ బెల్ట్లలో వున్నవి.
ఉదాహరణకు రామగిరి, కోలార్‍, జొన్నగిరి, భద్రంపల్లి శిస్‍బెల్ట్లు. ఇవి కాకుండా కదిరి, పెనకచెర్ల, వెలిగల్లు, సుందుపల్లి, నెల్లూరు, పెద్దవోరా శిస్ట్ బెల్ట్లు. వీటిలో శిలలు, మెటాబెసాల్ట్ క్లోరైట్‍. ఏక్టినోలైట్‍ శిస్ట్, ఏంఫిబలైట్‍, క్వార్ట్జ్‍ క్లోరైట్‍ శిస్ట్, బ్యాండెడ్‍ ఐరన్‍ ఫోర్మెశన్‍ మరియు కొంత కేల్‍కేరియస్‍ శిలలు, చెర్ట్తో కూడి వున్నది.


ఈ శిస్ట్ బెల్ట్లు పెనిస్‍సులర్‍ నైసిక్‍ కాంప్లెక్స్లో అక్కడక్కడా చూడగలము. పెనిన్‍సులర్‍ నైసిక్‍ కాంప్లెక్స్లో రకరకాల నైస్‍లు మరియు గ్రానైట్‍ శిలలతో కూడి వున్నవి. ఈ నైస్‍-గ్రానైట్‍ టేరేన్‍లో పేలియో ప్రోటిరోజోయిక్‍కు చెందిన బేసిక్‍ గ్యాబ్రో, డోలరైట డైక్‍లు N-S,NW-SE,E-W దిశలలో లీనియర్‍గా విస్తరించి ఉన్నవి. అదే విధంగా ఏసిడ్‍ ఇన్‍ట్రూసిస్‍ క్వార్ట్జ మరియు పెగ్మటైటీను చూడగలం. మీసో ప్రోటిరోజోయిక్‍ చెందిన కీమ్‍బర్‍లైట్స్, లాంప్రొయిట్స్, సైనైట్స్, డ్యూనైట్‍లని చూడగలము. ఈస్ట్రన్‍ ఘాట్‍ మొబైల్‍ బెల్ట్లో శిలలు గ్రానులైట్‍ మెటమార్ఫిక్‍ ఫేసిన్‍కు చెందిన శిలలు అనగా చార్నొకైట్‍, కొండలైట్‍, సూట్స్కు చెందినవి. వాటి మిగ్నటైట్స్తో కూడి ఉన్నవి. ఈస్ట్రన్‍ ఘాట్స్ రాష్ట్రానికి ఈశాన్యంలో ఉన్నది. ఈ ఘాట్స్ ఒడిస్సాలోకి ఎక్స్టెండ్‍ అయినవి. ఇంటాక్రేటానిక్‍ కడప బేసిన్‍లో సెడిమెంటరి శిలలు అనగా కంగ్లామరేట్‍, డొలమైట్‍, శేల్‍ లైమ్‍స్టోన్‍, ఫిల్లైట్‍, క్వార్ట్జైట్‍తో కూడి వున్నవి. ఈ బేసిన్‍లో కర్నూలు, పల్నాడ్‍ సబ్‍ బేసిన్స్ ఉన్నవి. ఈ బేసిన్‍లోని శిలలను కడప సూపర్‍ గ్రూప్‍ మరియు కర్నూల్‍ గ్రూప్‍గా విభజించారు. కడప సూపర్‍ గ్రూప్‍ శిలలు మీసోప్రోటి రోజోయిక్‍ పీరియడ్‍కు చెందినవి కాగా కర్నూల్‍ గ్రూప్‍కు చెందిన శిలలు నియొప్రోటిరోజోయిక్‍ పీరియడ్‍కు చెందినవి. ఇవి కాకుండా రాజమండ్రి ప్రాంతంలో డెక్కన్‍ ట్రాప్‍కు చెందిన బసాల్టిక్‍ ఫ్లోలు, మైయొసీన్‍ పీరియడ్‍కు చెందిన సాండ్‍స్టోన్‍, కోస్తా ప్రాంతంలో దేశంలోనే పెద్ద కృష్ణా, గోదావరి డెల్టాలు, పెన్నెర్‍ డెల్టా వీటిలో ఘ్లవియల్‍, మెరైన్‍, సెడిమెంట్స్ మరియు వంశధారా, నాగావలి, శారదా, గోస్తని, తమ్మిలేరు, గుండ్లకమ్మ స్వర్ణముఖి నదుల ఫ్లడ్‍ ప్లేన్‍ సెడిమెంట్స్ కలవు. ఈ క్వాటర్‍ నరీ సెడిమెంట్స్ సాండ్‍, సిల్ట్, క్లే యొక్క అడ్‍మిక్షేచర్‍లలో ఉన్నవి. అన్ని నదులలో ఇన్‍లాండ్‍ వ్యాలిలలో తోబా వల్కానిసమ్‍కు చెందిన వల్కానిక్‍ యాశ్‍ని రిపోర్ట్ చేసారు. దీని వయస్సు 75,000 సంవత్సరాలు అనగా ప్లీస్టోసిన్‍కు చెందినది.


ఖనిజ సంపద :
ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో అపార ఖనిజ సంపద కలదు. ప్రముఖమైన ఖనిజ వనరులు అనగా ఫెర్రస్‍, నాన్‍ఫెర్రస్‍, నోబుల్‍ మెటల్స్, ప్రీశియస్‍ మరియు సెమిప్రీశియస్‍ శిలలు స్ట్రాటజిక్‍ ఖనిజాలు. ఫాసిల్‍ ప్యూయల్స్ మరియు ఇండస్ట్రియల్‍ ఖనిజాలు రకరకాల జియోలాజికల్‍ ఫార్మేషన్స్లో ఆర్కయన్‍ నుండి క్వాటర్‍నెరి పిరియడ్‍ వరకు ఉన్నవి.
ఈ రాష్ట్రంలో 20 మినరల్‍ బెల్ట్లు జియోలాజికల్‍ స్టడీస్‍ ద్వారా గుర్తించబడినవి. ఇవి కాకుండా ఎన్నో మైనర్‍ మినరల్స్ను గుర్తించినారు. ఈ రాష్ట్రంలో బంగారం, వజ్రాలు, ఇనుము, అలుమీనియమ్‍, బేస్‍మెటల్స్, గ్రాఫైట్‍, టంగ్స్టన్‍, లైమ్‍స్టోన్‍, మాంగనీస్‍, మైకా, బెరైట్‍, క్లే, సిలికా సాండ్‍, టైటానియమ్‍, వల్కానిక్‍ ఏష, యురేనియమ్‍, క్రూడ్‍ అయిల్‍ మరియు గ్యాస్‍, కమర్షియల్‍ గ్రానైట్స్, క్వార్ట్జ్‍ లాంటి ఎన్నో వనరులు కలిగి యున్నవి.
మినరల్‍ బెల్ట్లు వాటి లిస్ట్ క్రింద ఇవ్వబడినవి. వీటి గురించి ఉమ్మడి జిల్లాల వారిగా ప్రతి మాసం ఒక జిల్లా గురించి విశ్లేషణ చేయడం జరుగుతుంది. అందులో విస్తారంగా వ్రాయడం జరుగుతుంది. రాష్ట్రంలోని మినరల్‍ బెల్ట్లు ఇరవై. అవి క్రింద ఇవ్వబడినవి.

  1. రామగిరి గోల్డ్బెల్ట్, అనంతపురం జిల్లా
  2. భద్రంపల్లి మినరల్‍ బెల్ట్ అనంతపురం జిల్లా
  3. జొన్నగిరి గోల్డ్ బెల్ట్ కర్నూల్‍ జిల్లా
  4. కోలార్‍ గోల్డ్ బెల్ట్, అనంతపురం జిల్లాలో, కర్ణాటక బార్డర్‍
  5. జంగంరాజుపల్లి బేస్‍ మెటల్‍ బెల్ట్, కడప జిల్లా
  6. ఘనికాల్వ్ బేస్‍ మెటల్‍ బెల్ట్, కర్నూల్‍ జిల్లా
  7. బనగానపల్లి డైమండ్‍ బెల్ట్, కర్నూల్‍ జిల్లా
  8. వజ్రకరూర్‍ డైమండ్‍ బెల్ట్, అనంతపురం జిల్లా
  9. చిగిచెర్ల డైమండ్‍ బెల్ట్, అనంతపురం జిల్లా
  10. చంద్రాలపాడు డైమండ్‍ బెల్ట్, కృష్ణాజిల్లా
  11. అగ్నిగుండాల బేస్‍మెటల్‍ బెల్ట్, గుంటూరు, ప్రకాశం జిల్లాలు
  12. గరివిడి – గర్భం మాంగనీస్‍ బెల్ట్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు
  13. భూరుగు బండ టంగ్సటన్‍ బెల్ట్ : తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు
  14. భూరుగుబండ గ్రాఫైట్‍ బెల్ట్ : తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు
  15. నెల్లూరు మైకా బెల్ట్, నెల్లూరు జిల్లా
  16. మంగంపేట బెరైటిస్‍ బెల్ట్, కడప జిల్లా
  17. చింతపల్లి బాక్‍నైట్‍ బెల్ట్, విశాఖపట్నం జిల్లా
  18. గుర్తేడు బాక్‍సైట్‍ బెల్ట్, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలు
  19. కాశీపట్నం అపటైట్‍ బెల్ట్, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు

పులివెందుల ఆన్‍బెస్టోస్‍ బెల్ట్, కడప జిల్లా ఇవి కాకుండా ఈ రాష్ట్రంలో కడప బేసిన్‍లో ట్రేస్‍ ఫాసిల్స్, అప్పర్‍ గోండవానా ఫార్మేషన్స్లో ప్లాంట్‍ ఫాసిల్‍, క్వాటర్‍నేరి సెడిమెంట్స్లో ఫోరమెనిఫెరా, గ్యాస్ట్రోపాడ్‍, పెలిసిపోడా, ఎఖినోడర్మేటా, పేలియొలితిక్‍ స్టోన్‍ ఇంప్లిమెంట్స్, ఇక్వన్‍, ఎలిఫస్‍ యొక్క మొలార్స్, ప్రీమొలార్స్, ఫాసిలైస్‍డ్‍ జాస్‍, ఆదిమానవుని ఫాసిలిలైసీడ్‍ జాస్‍ గుండ్లకమ్మ బేసిన్‍లో కనుగొన్నారు.
వీటన్నిటి గురించి విస్తారంగా విశ్లేషిచుకుందాం. ఉమ్మడి జిల్లాల వారిగా వచ్చే సంచిక నుండి.

  • కమతం మహేందర్‍ రెడ్డి
    ఎ : 90320 12955

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *