పచ్చ బంగారం-వెదురు సెప్టెంబర్‍ 18న ప్రపంచ వెదురు దినోత్సవం

వెదురు మానవ గ•హ అవసరాలకు నిర్మాణాలకు అత్యధికంగా ఉపయోగిస్తారు. అందుకే వెదురును ప్రజల స్నేహితుడు అని పేదవాడి కలప అని పిలుస్తారు. వెదురు నిర్మాణాలు భూకంపాన్ని తట్టుకోగలవు. ఈ చెట్టు ఆకులు రాలుస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ పచ్చగా ఉండి సతత హరితంగా ప్రసిద్ధమైంది. మిగిలిన చెట్లతో పోలిస్తే 35 శాతం అధికంగా ఆక్సిజన్‍ను వెదురు చెట్టు విడుదల చేస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది. వరద ప్రవాహాల నుంచి, నేలకోతను నివారిస్తుంది. 1945 సంవత్సరంలో హిరోషిమా విస్పోటనం తరువాత మళ్లీ ఆకుపచ్చగా మారిన మొదటి మొక్క వెదురు అని చెప్తారు. ఎంతటి అధునాతన గృహమైన, పాత గృహమైన వెదురు నుంచి తయారైన వస్తువులను వాడని ఇల్లు ఉండదు. చేట, బుట్ట రూపంలో ప్రతి ఇంటిలో మనకు వెదురు కనబడుతుంది. వెదురు వెయ్యి రకాలు అని చాలా రకాలుగా ఉపయోగిస్తారు. ఈ మధ్య చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్లలో టేబుల్‍ పై వెదురు ఉత్పత్తులను ఉపయోగించడం మనం చూస్తూనే ఉన్నాం. వెదురును అదృష్టానికి సంకేతంగా భావించి చాలామంది ఇళ్లలో వెదురు మొక్క నాటుతున్నారు. చిన్న మొక్కను ఇండోర్‍ ప్లాంట్‍గా పెంచుతున్నారు.


వెదురు తేమగల వాగుల పక్కన, కొండ, కొండవాలు, లోయ, పల్లపు ప్రాంతాలలో పెరుగుతుంది. ఉష్ణ సమశీతోష్ణ ఇంకా శీతల ప్రదేశాల్లో కూడా పెరుగుతుంది. ఇసుకతో కూడిన బంక మన్ను ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు వెదురుకు అనుకూలం. చౌడు, ఆమ్ల నేలలు వెదురు సాగుకు పనికిరావు. వెదురు ముళ్ళు కలిగిన రకము, ముళ్ళు లేని రకము అని రెండు విధాలుగా లభిస్తుంది.


మొక్కలు నాటే పద్ధతి:
మొదట భూమిని బాగా కలియదున్ని 5ఞ5 మీటర్లు ఎడంలో 60ఞ60సెంటీమీటర్ల గుంతలను తవ్వి వాటిలో బాగా చివికిన 25 కిలోల పశువుల ఎరువువేసి పై మట్టితో కలపాలి. ఈ విధంగా ఎకరాకు 160 మొక్కలు నాటవచ్చు. పంట పొలాల్లో గట్ల చుట్టూ 2 మీటర్ల ఎడంతో కూడా పెంచవచ్చు. దిగుబడి నాలుగు సంవత్సరాల తర్వాత నుంచి వస్తుంది. ఐదవ సంవత్సరం నుండి, ఎకరాకు 10 నుంచి 14టన్నుల వెదురు కర్ర దిగుబడి అవుతుంది. ప్రిసెషన్‍ ఫార్మింగ్‍ ద్వారా మూడు సంవత్సరాల నుండి ఎకరాకు 40టన్నుల దిగుబడి వస్తుంది. ఆరో సంవత్సరం నుండి పొదకు ఆరు నుండి పది బొంగుల చొప్పున పంట కోత చేయవచ్చును.
నేషనల్‍ బ్యాంబు మిషన్‍ (ఎన్‍.బి.ఎం) ఆధ్వర్యంలో స్టేట్‍ బ్యాంబు మిషన్‍ పనిచేస్తుంది. రాష్ట్ర వెదురు మిషన్‍ డైరెక్టర్‍గా రాష్ట్ర ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్‍ ఉంటారు. ప్రస్తుతం శ్రీమతి యాస్మిన్‍ భాష, ఐ.ఏ.ఎస్‍. ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ సంచాలకుల ఇంకా రాష్ట్ర బ్యాంబు మిషన్‍ డైరెక్టర్‍గా ఉన్నారు.


రాష్ట్ర వెదురు మిషన్‍ ద్వారా ప్రభుత్వ రాయితీని రైతులకు అందిస్తున్నారు. తెలంగాణాలోని ప్రభుత్వ / ప్రభుత్వ రంగ సంస్థల / గ్రామ కంఠం భూముల్లో 100% రాయితీ వెదురు సాగుకు ఇవ్వ బడుతుంది. మొదటి సంవత్సరం 20,000, రెండవ సంవత్సరం 12,000 మరియు మూడో సంవత్సరం 8,000 బ్రతికిన మొక్కల ఆధారంగా ఇవ్వబడుతుంది.
తెలంగాణలోని ప్రతి రైతుకు భూమిలో సాగుచేసిన వెదురు విస్తీర్ణం ఆధారంగా ఒక రైతుకు గరిష్టంగా ఐదు ఎకరాల వరకు రాయితీ ఇవ్వబడుతుంది. ఎకరానికి సాగుబడి ఖర్చు 40,000. దీనిలో 50 శాతం అనగా 20 వేల రూపాయలు 50:30:20 నిష్పత్తిలో మొదటి సంవత్సరం 10,000 రెండవ సంవత్సరం 6000 రూపాయలు మరియు మూడో సంవత్సరం 4000 రూపాయలు చొప్పున రాయితీగా రైతులకు ఇవ్వబడుతుంది.
ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయిల్‍ పామ్‍ విస్తరణ పథకంలో ఆయిల్‍ పామ్‍ మొక్కలు వేసుకున్న రైతులు తమ తోట చుట్టూ వెదురు మొక్కలు నాటుకొని అదనపు రాయితీలతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చు. పోలి హౌస్‍, నెట్‍ హౌస్‍ నిర్మాణాల చుట్టూ వెదురు మొక్కలు వేయడం వలన గాలి తీవ్రత తగ్గించి విండ్‍ బ్రేక్‍గా కూడా వెదురు ఉపయోగ పడుతుంది.
రైతులు రాష్ట్ర వెదురు మిషన్‍ ద్వారా లభించే రాయితీలను సద్వినియోగ పరచుకొని, ఆదాయాన్ని పెంచుకుంటారని ఆశిద్దాం.

  • సముద్రాల విజయ్‍కుమార్‍
    ఎ : 8374449922

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *