క్రిటికల్‍ ఖనిజాల అన్వేషణ దృష్టి కేంద్రీకరించిన జియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా, కేంద్ర గనుల శాఖ

జియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా మరియు కేంద్ర ఘనుల శాఖ క్రిటికల్‍ ఖనిజాల అన్వేషణపై దృష్టి కేంద్రీకరించింది. క్రిటికల్‍ ఖనిజాలు అనేవి దేశ అవసరాలను బట్టి, అవసరాల కన్నా నిక్షేపాలు తక్కువగాని, అసలు లేకపోవడం వల్ల దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి రావడం, ఆర్థికంగా దేశంపై భారం కావడం వల్ల అలాంటి ఖనిజాలను క్రిటికల్‍గా నిర్ధారించి త్వరితగతిలో అన్వేషించడం జరుగుతుంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో మనకు రైలు, బస్సులు, రోడ్లు కరెంటు నెట్‍వర్క్, స్కూళ్లు, కాలేజీలు, ఇరిగేషన్‍ ప్రాజెక్టులు మరియు ఎన్నో ఇండస్ట్రీస్‍, ఇన్‍పాస్ట్రక్చర్‍ కోసం అప్పటి అవసరాలను బట్టి క్రిటికల్‍ ఖనిజాలుగా నిర్ధారించినవి ఇనుము, రాగి, బొగ్గు, సిమెంట్‍ గ్రేడ్‍ లైమ్‍ స్టోన్‍, అలుమినియమ్‍ లెడ్‍, జింక్‍, క్రోమియమ్‍, మాంగనీస్‍, బెరైటీస్‍, బంగారమైతే అతి తక్కువ మొత్తంలో దొరుకుతుంది. కావున అది ఎప్పటికీ విలువైనదే. తరువాత టిన్‍, టంగ్‍స్టన్‍, గ్రాఫైట్‍. ఇవి పోతే డైమండ్‍ మరియు ఇతర ప్రీ పియస్‍ స్టోన్స్ ఎప్పటికీ డిమాండ్‍లో ఉంటాయి. ఎందుకంటే అవి చాలా తక్కువ మొత్తంలో దొరుకుతాయి.


ప్రస్తుత పరిస్థితులలో కేంద్ర గనుల శాఖ మరియు జియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా 30 ఎలిమెంట్స్తో కూడిన ఖనిజాలను గుర్తించి వాటిని క్రిటికల్‍ ఖనిజాలు / ఎలిమెంట్స్గా నోటిఫై చేయడం జరిగినది. మన రాజధాని ఢిల్లీలో ఖనిజ యంత్రాలయంలో జిఎస్‍ఐ ఆధ్వర్యంలో NMET (నేషనల్‍ మినరల్‍ ఎక్స్ప్లోరేషన్‍ ట్రస్ట్) అనే విభాగం ఏర్పరిచారు. ఈ విభాగం ద్వారా ఖనిజాల బ్లాక్‍లు ఆక్షన్‍ చేయడం, కొత్త ఖనిజాల అన్వేషణ జరపడానికి ఫండింగ్‍ చేయడం జరుగుతున్నది. ఈ ఖనిజాల ఆక్షన్‍ గాని అత్యవసరమైన ఖనిజాల అన్వేషణ ఈ NMET ద్వారా జరుపుతున్నారు. ఈ పక్రియలో ప్రభుత్వ సంస్థలే కాకుండా గుర్తింపు పొందిన ప్రైవేటు ఏజెన్సీలకు కూడా అలాట్‍ చేయడం జరుగుతున్నది. త్వరతగతిలో అన్వేషణ జరిపించి, గుర్తింపబడ్డ ఖనిజ సంపదను ఆక్షన్‍ చేసి మన దేశ అవసరాలను తీర్చుకొని, దిగుమతిని తగ్గించి, ఆర్థికంగా బలపడటానికి ఈ పక్రియ ఇప్పటి అత్యవసరాలను దృష్టిలో వుంచుకొని 30 ఎలిమెంట్స్తో కూడిన ఖనిజాలను నోటిఫై చేశారు. జిఎస్‍ఐ 1:50,000 స్కేల్‍ మ్యాపింగ్‍ ద్వారా చాలా ఖనిజాలని గుర్తించారు. వీటిని మైనింగ్‍ కూడా చేశారు. అయితే ఇప్పుడు ప్రైవేటు ఏజెన్సీలను కూడా బరిలోకి దింపారు. కానీ అప్పుడు చాలా వరకు మేజర్‍ ఖనిజాలకు మాత్రమే ప్రాముఖ్యతను ఇచ్చారు. ఆ రోజుల్లో కూడా కొంతమంది జియాలజిస్టులు వారి సొంత ఇంట్రెస్ట్తో కొన్ని రేర్‍ ఖనిజాలను కనుగొన్నారు. వెలికి తీసేందుకు టెక్నాలజీ కూడా లేదు. జి.ఎస్‍.ఐ జియోలాజికల్‍ మ్యాపింగ్‍ తరువాత నేషనల్‍ జియో కెమికల్‍ మ్యాపింగ్‍ మొదలు పెట్టింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు దీనిని కొనసాగించింది. ఈ మ్యాపింగ్‍లో స్ట్రీమెస్‍దిమెంట్‍ సాంపుల్స్ ఫస్ట్ ఆర్డర్‍, సెకండ్‍ ఆర్డర్‍ స్ట్రీమ్స్లో, రిగోలిత్‍లో ప్రతి చదరపు కిలోమీటర్‍కు ఒక సాంపుల్‍ తీసి 66 ఎలిమెంట్స్ను కెమికల్‍ అనాలసీస్‍ చేశారు. ఈ ఎలిమెంట్స్ యొక్క డిస్ట్రిభ్యుశన్‍ ఫ్యాటర్న్ని రికార్డ్ చేసి ఇప్పుడు ఆ డేటాని ప్రభుత్వ ఏజెన్సీస్‍కి కాకుండా ప్రైవేటు ఏజేన్సీలకు కూడా ఫ్రీగా డౌన్‍లోడ్‍ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు నోటిఫై చేసిన క్రిటికల్‍ ఖనిజాలలో కొన్ని జియోలాజికల్‍ మ్యాపింగ్‍ ద్వారా గుర్తించినా వీటిని రిపోర్ట్లో పొందుపరిచారు. అది అందులోనే ఉండిపోయాయి.
ఉదాహరణకు కశ్మీరులో ఈ మధ్య న్యూస్‍లో ఉన్న లీథియం డిపాజిట్‍. ఇది 1996లోనే గుర్తించి రిపోర్ట్లో పొందుపరిచారు. అయితే ఇప్పుడు లీథియం బ్యాటరీస్‍లో ఉపయోగపడటం, టెక్నాలజికల్‍ అడ్వాన్స్మెంట్‍తో ఆ రిపోర్ట్ను జిఎస్‍ఐ బయటికి తీసి 2018-19లో డిటైల్డ్ ఇన్వెస్టిగేషన్‍ చేసి, దానిని డిపాజిట్‍గా డిక్లేర్‍ చేసారు. అదే మాదిరిగా నేను 1988-89లో వరంగల్‍ – నర్సంపేట ప్రాంతంలో మ్యాపింగ్‍ చేసేటప్పుడు సీరియం, లాంతనంని పెద్దమొత్తంలో ఉన్నట్టు రిపోర్ట్ చేశాను. కాని అప్పుడు వీటికి ఉపయోగాలు లేవు. టెకాల్నజీ లేదు. ఇప్పుడు వీటికి చాలా ఉపయోగాలు రావడం, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్‍ వల్ల వాటికి గుర్తింపు వచ్చింది. NGCMడేటాలో కూడా ఈ ఎలిమెంట్స్ పెద్ద మొత్తంలో రిపోర్ట్ చేశారు.


అయితే ఇప్పుడు దేశంలో ఖనిజ మంత్రాలయం గుర్తించిన ప్రైవేటు ఏజెన్సీస్‍ ఇరవై రెండు (22), అందులో ఈ మధ్యలో గుర్తింపు పొందిన ఏజెన్సీ క్రిటికల్‍ మినరల్‍ ట్రాకర్స్ (CMT) ఇది హైదరాబాదు బేస్డ్ కంపెని. తెలుగు రాష్ట్రాలలో ఇది ఏకైక ఏజెన్సీ. ఈ ఎజెన్సీకి నాతోపాటు అనుభవజ్ఞులైన రిటైర్డ్ G.S.I. M.E.C.L, A.M.D., D.R.D.O. జియో సైంటిస్టులు టెక్నికల్‍ టీమ్‍తోఉన్నారు. ఇప్పుడు క్రిటికల్‍ ఖనిజాల అన్వేషణ కోసం తెలంగాణలో రెండు, ఆంధ్రాలో ఒక ప్రాజెక్టు సబ్‍మిట్‍ చేయడం జరిగింది.
క్రిటికల్‍ ఖనిజాల గురించి ఇంతగా ఇప్పటి వరకు విశ్లేషించటం జరిగింది. ఇప్పుడు నోటిఫై చేసిన ఎలిమెంట్స్ గల ఖనిజాలను అన్వేషించి వెలికి తీయడానికి నడుము కట్టారు. ఇతర ఎలిమెంట్స్ బేరిలియం లిస్ట్ క్రింద ఇవ్వబడినది.


రేర్‍ ఎర్త్ ఎలిమెంట్స్ (REE) : సీరియమ్‍, యురోపియమ్‍, నియో డి మి నియం, డిస్‍ప్రొసియమ్‍, ఎర్బియం, గ్వాడొలీనియం, లుటెటియం, ప్రసొడిమియం, సమారియం, టర్బియం, ఇట్రియం, లోపారైట్‍, మెటర్బియం, సీనియం, మొనజైట్‍ లాంతనం.
ఇతర ఎలిమెంట్స్
బెరిలియం, ఆక్యడ్‍ మియం, కోబాల్ట్, కాపర్‍, రాక్‍ ఫాస్‍ఫేట్‍, డైమండ్‍, గోల్డ్, గ్రాఫైట్‍, ఇండియం, లెడ్‍, లిథియం, మాలిబ్‍దినం, నియొభియం, నికల్‍ పోటాశ్‍, రీనియం, సెలీనియం, సిల్వర్‍, టాంటలం, టెలూరియం, టిన్‍, టైటోనియం, టంగ్స్టన్‍ వనీడియం, జింక్‍ మరియు జిర్కోనియం.
ప్లాటినం గ్రూఫ్‍ ఆప్‍ ఎలిమెంట్స్ (PGE):
ప్లాటినం, పల్లాడియం, రోడియం, రుతీనియం, ఇండియం మరియు ఆస్‍మియం. ప్రస్తుతం పైన ఇవ్వబడిన ఎలిమెంట్స్తో కూడిన ఖనిజాలపైన దృష్టి సారించిన జిఎస్‍ఐ, కేంద్ర ఘనుల శాఖ దీని వల్ల త్వరితగతిలో అన్వేషణ జరిపి మన దేశ ప్రగతికి తోడ్పడుతుందని ఆశిద్దాం.

  • కమతం మహేందర్‍ రెడ్డి
    90320 12955

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *