సామలు (little millets) చిరు ధాన్యాలలో ప్రత్యేకమైనవి. ఎందుకంటే అవి పోషకమైనవి. గ్లూటెన్ ఫ్రీ, మరియు నాన్ స్టిక్కీ, నాన్ యాసిడ్-ఫార్మింగ్. ఆరోగ్య నియమాలు పాటించే వారికి సామలను రోజువారి ఆహార దినచర్యలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఆహార నిపుణుడు, పోషకాహార నిపుణులు చిరు ధాన్యాలు మానవ ఆరోగ్యంపై కలిగించే విశేషమైన ప్రయోజనాల గురించి ప్రచారం చేస్తున్నారు.
సామలు తక్కువ కార్బోహైడ్రేట్ ఉండడం వల్ల, నెమ్మదిగా జీర్ణం అయ్యి, తక్కువ నీటిలో కరిగే గమ్ కంటెంట్ గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయి. సామలు రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి.
ఒక 100 గ్రాముల సాములలో పోషక విలువలు
కింది విధంగా ఉంటాయి.
ప్రోటీన్స్ : Protein (g%) 9.7 గ్రాములు
కార్బోహైడ్రేట్లు : Carbohydrate (g%) 60.9 గ్రాములు
ఫ్యాట్ : Fat (g%) 5.2 గ్రాములు
ఐరన్ : Iron (mg%) 9.3 గ్రాములు
Phosphorus (mg%) 220 గ్రాములు
కాల్షియం : Calcium (mg%) 17 గ్రాములు
మెగ్నీషియం : Magnesium (mg%) 114 గ్రాములు
ఎనర్జీ : Energy (Kcal%) 329 గ్రాములు
ఫైబర్ : Crude Fibre (g%) 7.6 గ్రాములు
Ash (g%) 5.4 గ్రాములు
Thiamin (mg%) 0.30 గ్రాములు
Riboflavin (mg%) 0.09 గ్రాములు
నైసిన్: Niacin (mg%) 3.2 గ్రాములు
ఆరోగ్య ప్రయోజనాలు:
- సామలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం. ఇందులో డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. రక్తంలో గ్లూకోస్ స్థాయినీ వేగవంతంగా పంప్ చేయకుండా స్లోగా గ్లూకోస్‍నీ విడుదల చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతో
- ఉపయోగపడుతుంది.
- సామలులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‍ను తగ్గించడంలో సహాయపడే నియాసిన్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది.
- శ్రీ సామలు మిల్లెట్‍లో చాలా ఫాస్ఫరస్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి, కణాల పునరుత్పత్తికి మరియు వ్యాయామం చేసిన తర్వాత శక్తి ఉత్పత్తికి ప్రభావవంతంగా ఉంటుంది. ఇది శరీరం యొక్క నిర్విషీకరణలో కూడా సహాయపడుతుంది.
- ఆస్తమా వంటి శ్వాసకోశ పరిస్థితులకు చికిత్స చేయడానికి సామలు ఉపయోగపడతాయి.
- సామలు మిల్లెట్‍లో గ్లూటెన్ ఉండదు. సామల్లో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
- శరీరంలో ఎక్కువ వేడితో బాధపడేవారు సామలను తీసుకోవడం వలన ఉపశమనం పొందవచ్చు. సామలు మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
- దక్కన్‍న్యూస్
ఎ : 9030 6262 88