భారత ప్రభుత్వం అందించే ‘శిల్పగురు’ అవార్డు తెలుగు కళాకారిణి దళవాయి శివమ్మను వరించింది. సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన ఆమె తోలుబొమ్మల కళాకారిణి.
కేంద్ర జౌళి శాఖ నిర్వహించే శిల్పగురు, జాతీయ చేతి వృత్తుల అవార్డు-2023 పోటీలకు తోలుపై అద్భుతంగా రూపొందించిన శ్రీకృష్ణ చరిత, ఏడు అడుగుల ఎత్తైన విశ్వరూప హనుమాన్ కళాఖండాలను ఆమె పంపించారు.
వీటిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం.. శిల్పగురు పురస్కారానికి ఎంపిక చేసింది. శివమ్మ మాట్లాడుతూ.. ఈ రెండింటినీ తయారు చేయడానికి 6 నెలల పాటు కష్టపడ్డానని చెప్పారు. తాను శిల్పగురు అవార్డుకు ఎంపిక కావడం నిమ్మలకుంట తోలుబొమ్మల కళాకారులకు దక్కిన గౌరవమని చెప్పారు. త్వరలో దిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు అందుకోనున్నట్లు వెల్లడించారు.
- దక్కన్న్యూస్,
ఎ : 9030 6262 88