దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి నిజమైన హేతుబద్ధమైన సింగిల్ విండో కీలకమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సెప్టెంబర్ 5న ఢిల్లీలోని ద్వారకలోని యశోభూమిలో రాష్ట్రాల పరిశ్రమలు, వాణిజ్య మంత్రుల సదస్సు ‘ఉద్యోగ్ సమాగమ’కు అధ్యక్షత వహిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆమోదాలు, సౌకర్యాల కోసం ఒకే వేదికకు వస్తే, అది ప్రతి రాష్ట్రంలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఆయన అన్నారు.
రాష్ట్రాలలో పరిశ్రమలకు ఆమోదాలు కాలపరిమితిలో ఉండాలని, సులభంగా ఉండాలని మంత్రి అన్నారు. ఆమోదాలు మరియు సమ్మతి కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకూడని వ్యవస్థతో మేము ప్రయోగాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీంతో కేంద్రం, రాష్ట్రాలు అన్ని రంగాలలో కలిసి పనిచేయగలవని, ఎక్కువ ఉపాధి అవకాశాల కల్పించ వచ్చునని ఆయన అన్నారు.
బిజినెస్ రిఫార్మస్ యాక్షన్ ప్లాన్ (బిఆర్‍ఏపి) కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారిని సత్కరిస్తూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‍ను పెంచడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేసిన అత్యుత్తమ కృషిని గోయల్ గుర్తించారు. కేరళ, ఆంధప్రదేశ్ మరియు గుజరాత్ వంటి రాష్ట్రాలు పక్రియలను క్రమబద్ధీకరించడంలో, వ్యాపారాలు మరియు పౌరులకు సమర్థవంతమైన సేవలను అందించడంలో వారి అద్భుతమైన సంస్కరణలకు ప్రత్యేకమని చెప్పవచ్చును.
భారతదేశాన్ని ప్రపంచానికి పెట్టుబడి గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డిఐ) ఆకర్షించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. ఎఫ్డిఐని ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, యుటిలకు సమాన అవకాశాలను కల్పించిందని ఆయన అన్నారు. విదేశాల నుండి వచ్చే పెట్టుబడులు వివిధ రాష్ట్రాలకు వెళుతున్నాయని, ఎఫ్డిఐని ఆకర్షించడానికి మేము చేస్తున్న ప్రయత్నాలకు ప్రతి ఒక్కరూ లబ్ధిదారులని ఆయన అన్నారు.
డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) ‘ఉద్యోగ్ సమాగమ్’ ను విజయవంతంగా నిర్వహించింది. ఈ సమావేశం పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రులు, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు, విశిష్ట అతిథులను పారిశ్రామిక వృద్ధిని పెంపొందించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‍ను పెంచడం మరియు దేశవ్యాప్తంగా వ్యాపార-స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం గురించి చర్చించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ సమావేశంలో మంత్రి పీయూష్ గోయల్ రూపొందించిన రెగ్యులేటరీ కంప్లయన్స్ బర్డెన్ (ఆర్సిబి) బుక్లెట్ విడుదల చేసారు. ఇది వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడానికి ప్రభుత్వ ప్రయత్నాలను ప్రదర్శిస్తుంది. 42,000కు పైగా సమ్మతులను తగ్గించడం, పాత నిబంధనలను సరళీకృతం చేయడం, డిజిటలైజ్ చేయడం వంటి విషయాలు ఇందులో ఉన్నాయి.
16 రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఇతర రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు. బిఆర్‍ఏపి అభినందనలు: ఈ కార్యక్రమం బిఆర్‍ఏపి అభినందన ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అత్యుత్తమ కృషిని కూడా గుర్తించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‍ను పెంచడంలో వారి విజయాలను జరుపుకుంది. సంస్కరణల విస్తృత పరిధిని పరిగణనలోకి తీసుకుని, 17 రాష్ట్రాలకు BRAP 2022 అనులేఖనాలు సమర్పించబడ్డాయి. చాలా రాష్ట్రాలు ఆశాజనక విభాగంలో ఉండగా, గుజరాత్ మాత్రమే ఫాస్ట్ మూవర్స్ విభాగంలో వచ్చింది. సైటేషన్ కోసం బ్రిఆర్‍ఏపి 2022లో భాగమైన మొత్తం 25 సంస్కరణలలో (15 బిజినెస్ మరియు 10 సిటిజెన్ సెంట్రిక్) ఏదైనా ఒక సంస్కరణలో అగశ్రేణి సాధించిన కేటగిరీ 95% పైన సాధించిన ఏ రాష్ట్రం అయినా సైటేషన్ కోసం ఎంపిక చేయబడ్డాయి. కేరళ, గుజరాత్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, అస్సాం, దాద్రా నగర్ హవేలీ, డామన్ మరియు డయ్యూ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, పంజాబ్, తెలంగాణ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఒకదానిని మరొకటి మెరుగుపరుచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన పోటీ, సహకారం దేశ ప్రగతికి కీలకమని ఆయన అన్నారు.
- దక్కన్‍న్యూస్
ఎ : 9030 6262 88