బాలల హక్కుల పరిరక్షణే ధ్యేయం నవంబర్‍ 14 మరియు 20న బాలల దినోత్సవాలు

జవహర్‍ లాల్‍ నెహ్రూకి పిల్లలన్నా, గులాబీ పూవులన్నా చాలా ఇష్టం. పిల్లలను జాతి సంపదలుగా నెహ్రూ చెబుతూ ఉండేవారు. ఆయన పాలనలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన పుట్టినరోజున మన దేశంలో బాలల పండుగ నిర్వహిస్తున్నారు. ఈరోజు చాచా నెహ్రూను తలుచుకుని పిల్లలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.


భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా పనిచేశారు జవహర్‍ లాల్‍ నెహ్రూ. ఆయన జన్మించిన రోజున బాలల దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం అందరికీ తెలిసిందే. స్వాతంత్య్రోద్యమ కాలంలో నెహ్రూ చాలా జీవితం జైళ్లలోనే గడిపారు. ఆ సమయంలో తన ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శినితో ఎక్కువకాలం గడపలేకపోయారట. ఆయన పాలనలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.


1954కి ముందు భారతదేశంలో అక్టోబర్‍ నెలలో బాలల దినోత్సవాన్ని నిర్వహించేవారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన ప్రకారం మొదటిసారి 1954 లో ప్రపంచమంతటా నిర్వహించారు. 1989లో పిల్లల హక్కులపై నవంబర్‍ 14న ఐరాసా ఓ బిల్లును ఆమోదించింది. 191 దేశాలు ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకాలు పెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. చైనాలో జూన్‍ 1న, పాకిస్తాన్‍లో నవంబర్‍ 20న, జపాన్‍లో మే 5న, దక్షిణ కొరియాలో మే 5న, పోలాండ్‍లో జూన్‍ 1న, శ్రీలంకలో అక్టోబర్‍ 1న ఇలా ఆయా దేశాల్లో బాలల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా బాలల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.


బాలల దినోత్సవం ధీమ్‍:
ప్రపంచ బాలల దినోత్సవం పెద్దలు వినవలసిందిగా పిలుపునిస్తుంది. భవిష్యత్తు మరియు రేపటి గురించి, వారి దృష్టి గురించి పిల్లలను అడగడం. అనే థీమ్‍తో ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు ఈరోజు సరైన సందర్భంగా చెప్పాలి.

  • దక్కన్‍న్యూస్‍,
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *