కంకల్ల చారిత్రక గాథ
కాలగర్భంలో ఎన్నో చారిత్రక సంఘటనలు. భూగర్భంలో కూడా దాగిపోయిన చారిత్రక శిల్పాలు, శాసనాలు, గుడులు, పురావస్తువులెన్నెన్నో. తవ్వుకున్న కొద్ది చరిత్ర గంపలకెత్తుకునేంత. మానవ వికాస, పరిణామదశల్ని తెలుసుకునే ప్రయత్నమే చరిత్రాన్వేషణ. ఒక్కొక్క చోట ఒక్కో చారిత్రకమైన ఆనవాళ్ళు వెతుకుకోగలం. చరిత్రకు ప్రతిచోటు, ప్రతివస్తువు కావలసినదే. వాటిని పరిశీలించి, పరిశోధించి చరిత్రను వెలుగులోనికి తేవలసిన బాధ్యత చరిత్రకారులది.ఉత్తరభారతంలోని మధురకు సమీపంలో ‘కంకాలితిల’ అనేచోట పురావస్తుశాఖ తవ్వకాలు జరిపినపుడు బయటపడ్డ క్రీ.పూ.2వ శతాబ్దం నుంచి క్రీ.శ.12 శతాబ్దం మధ్య జైననిర్మాణాలైన …