అరబ్బీ మురబ్బా ‘బార్కాస్’
ఒక తాతీల్ (సెలవు) దినం పురుసత్‍గ చార్మినార్‍కు వెళ్లండి. అక్కడ చార్మినార్ చల్లని చత్రచ్ఛాయలలో ఒక పాత సైకిలు సీటు వెనుక త్రాళ్లతో కట్టిన గుండ్రటి వెదురు గంపలో దోరగా మగ్గిన జాంపండ్లను పెట్టుకుని, నడుముకు తోలు బెల్టుతో ఎగగట్టిన ఎర్ర గళ్లలుంగీని గట్టిగా బిగించి కట్టుకుని, నోటినిండా ఎర్రని పాన్ నములుతూ మధ్యలో తుపుక్, తుపుక్ మని రోడ్డుమీద ఉమ్మేస్తూ, సన్నగా పొడుగ్గా ఉన్న మేక గడ్డం చిరుగాలితో సయ్యాటలాడుతుంటే, తెల్లటి మస్లీన్ లాల్చీ ధరించి, …