2021

సృజనకారులు – శాసనాలు

చట్టాలనేవి మూడు రకాలుగా తయారవుతాయి. ప్రజల కోరిక మేరకు లేదా ప్రజల ఒత్తిడి మేరకు తయారవుతాయి. అదే విధంగా సృజనకారుల అభిప్రాయం మేరకు కూడా తయారవుతాయి, తయారు కావాలి. ఈ రెండింటి ప్రభావం తగ్గిపోయినట్టుగా అన్పిస్తుంది. ఇప్పుడు చట్టాలు ఎక్కువగా పాలకుల ఇష్టాల మేరకు తయారవుతున్నట్టు కన్పిస్తుంది. ఇప్పుడు దేశంలో జరుగుతున్న రైతుల ధర్నాని గమనించినా చాలా చట్టాలని గమనించినా అలాగే అన్పిస్తుంది.ప్రజల ఒత్తిడి కారణంగా కూడా ఆ మధ్య కాలంలో వచ్చిన చట్టం నిర్భయ చట్టం. …

సృజనకారులు – శాసనాలు Read More »

పద్దెనిమిది, పంతొమ్మిది శతాబ్దాలలో రసాయన, జీవశాస్త్రాలు

రసాయనశాస్త్రం గురించి ముందు మనం ముచ్చటించు కుందాం. నిజానికి రసాయనశాస్త్రం అనేది ఒక శాస్త్ర విభాగంగా రూపం మార్చుకుంది ఈ రెండు శతాబ్దాలలోనే! 17వ శతాబ్దంలో రసాయనశాస్త్రం రసవాదం ప్రయోగాల నుంచి పుట్టుకు వచ్చింది. కానీ అణుసిద్ధాంతం, రసాయన సంయోగనియమాల ఆధారంగా శాస్త్రవిధానంగా పరిఢవిల్లింది. హైడ్రోజన్‍, కార్బన్‍డయాక్సైడ్‍, సల్ఫర్‍డయాక్సైడ్‍ వంటి వాయువుల ధర్మాలను స్టీఫెన్‍హేల్‍ అధ్యయనం చేయడంతో ఈ మార్పు మొదలైంది. తొలిదశలో రసాయనశాస్త్రజ్ఞులు ‘దహనం’, ‘మంట’ను వివరించటానికి చాలా యిబ్బంది పడ్డారు. కొన్ని లోహాలు మండినపుడు …

పద్దెనిమిది, పంతొమ్మిది శతాబ్దాలలో రసాయన, జీవశాస్త్రాలు Read More »

చిన్న తరహా పరిశ్రమలు – అవగాహన

దేశ సంపదను పెంచడంలో చిన్న తరహా పరిశ్రమల పాత్ర ఎనలేనిది. పారిశ్రామిక అభివృద్ధితోనే ఏ దేశమైనా అభివృద్ధి చెందు తుంది. ఒక పరిశ్రమను స్థాపించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కుటుంబాలకు జీవనాధారం దొరుకుతుంది. ఔత్సాహికులు ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తే,ఉపాధి అవకాశాలు ఏర్పడి పేదరిక నిర్మూలనతో పాటు జీవన ప్రమా ణాలు మెరుగవుతాయి. చిన్న తరహా పరిశ్రమలు స్థాపించడానికి గొ ప్ప మేధస్సు అవసరం లేదు; కావలసిందల్లా విషయ పరిజ్ఞానం, నిరంతర అధ్యయనం, …

చిన్న తరహా పరిశ్రమలు – అవగాహన Read More »

వడిసి పట్టిన వాన నీటితో సాగు

తరచూ కరువుల బారిన పడి పంటలు నష్టపోతున్న రైతులు, తాగటానికి గుక్కెడు నీళ్ళు లేక కిలోమీటర్ల దూరం నడిచి నీళ్ళు నెత్తిన మోసుకొని వచ్చే మహిళలు ప్రతి ఎండాకాలం మనం చూస్తుంటాం. అదేసమయంలో వర్షాలు పడినప్పుడు పంటచేలు మునిగి పోయి పంట నష్టపోవటమూ చూస్తున్నాం. వాన కోసం రుతుపవనాల మీద ఆధారపడిన మన లాంటి దేశంలో వాన పడినప్పుడు నీటిని జాగ్రత్తగా సేకరించి దాచుకొని అవసరం అయినప్పుడు వాడు కునే పద్ధతులు చాలా అవసరం. ఎన్నో వందల …

వడిసి పట్టిన వాన నీటితో సాగు Read More »

తెలంగాణా ప్రాచీన శివాలయాలు

ఇంద్రపాలనగర శివాలయాలువిష్ణుకుండులు తమ తొలి రాజధాని అమరావతి (నేటి మహబూబ్‍నగర్‍ జిల్లాలోని అమ్రాబాద్‍) నుండి కొంత కాలం తరువాత నల్లగొండ జిల్లాలోని తుమ్మలగూడెం దగ్గరి ఇంద్రపాలగుట్టకు వెళ్ళి ఆ ప్రాంతాన్ని మరో రాజధానిగా చేసుకున్నారు. ఆ గుట్ట పైన వారు కట్టించిన కోట గోడలు, దేవాలయాలు, కోనేర్లు, బౌద్ధ స్థూపాలు, జైన మత విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి. కోటగోడ కొసన వారి రాజ చిహ్నమైన పంజా ఎత్తి గర్జిస్తున్న సింహం శిల్పం రాజదర్బారు వెనుకనే పడి ఉండటంతో …

తెలంగాణా ప్రాచీన శివాలయాలు Read More »

సమాచార కాలుష్యం నిర్మాణాత్మక వాస్తవ అవగాహనను ఛిన్నాభిన్నం చేస్తుంది

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.2020ని ఒక విపత్కర సంవత్సరంగా అందరూ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. కోవిడ్‍ మహమ్మారి ప్రపంచ దేశాలన్నిటినీ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ఆరోగ్య సంక్షోభానికి గురిచేసింది. ఈ సంవత్సరమంతా రోజువారీ జీవితంలోని ప్రతి ఆలోచననీ ఈ కరోనా ప్రభావితం చేసింది. కాని అదే సమయంలో ఇదే కోవిడ్‍ అనేక విలువల్ని నేర్పింది. జీవిత విధానాలను మార్చింది. ఆరోగ్య స్పృహను పెంచింది. ప్రకృతిలోనూ, మానవ ప్రవృత్తిలోనూ కాలుష్యాలను తగ్గించింది. మనుషుల మధ్య భౌతిక దూరం పెరిగినా …

సమాచార కాలుష్యం నిర్మాణాత్మక వాస్తవ అవగాహనను ఛిన్నాభిన్నం చేస్తుంది Read More »

బోయ జంగయ్య

 ‘కృషి వుంటే మనుష్యులు ఋషులౌతారు మహా పురుషులౌతారు’ అన్నది డా।। బోయ జంగయ్య విషయంలో అక్షరసత్యం. కవి, కథకుడు, నాటకకర్త, నవలాకారుడు, బాలసాహిత్య రచయిత ఎన్నెన్నో పక్రియలల్లో దిట్ట జంగయ్య అతి సామాన్య నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సాహితీ చరిత్రలో ఆణిముత్యంలా నిలిచారు. నిజాం నిరంకుశపాలన, రజాకార్ల దౌర్జన్యాలు, దొరలు, దేశ్‍ముఖ్‍ల ఆగడాలు ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న రోజులు. 1 అక్టోబర్‍ 1942లో నల్లగొండ జిల్లాలోని పంతంగి అనే మారుమూల గ్రామంలో …

బోయ జంగయ్య Read More »

నిజమైన అంబేద్కరైట్‍ కె.ఆర్‍.వీరస్వామి

(డిసెంబర్‍ 23 కె.ఆర్‍.వీరస్వామి జయంతి సందర్భంగా) 1940వ దశకంలో హైదరాబాద్‍ దళిత రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన జాతీయవాది కె.ఆర్‍.వీరస్వామి. తన ఇంగ్లీషు రచనలు, పత్రికా ప్రకటనలు, పదునైన భాషణతో ప్రత్యర్థులను పత్తాలేకుండా చేసేవాడు. వివిధ దళిత సంఘాలను స్థాపించి తన ముక్కుసూటి తనం, తలవంచని నైజంతో పనిచేసిండు. తప్పుజేసిన వారు ఎంతటి వారైనా సరే తూర్పారా పట్టేవాడు. అందులో తన బంధువులున్నా అదే తీరులో స్పందించేవాడు. మొదటి నుంచి రెబెల్‍గా వెలిగిండు. మిగతా నాయకులకు భిన్నంగా మాల, …

నిజమైన అంబేద్కరైట్‍ కె.ఆర్‍.వీరస్వామి Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-5 పొలమెయరట్టోడి కొండపర్తి (పూర్తి) తెలుగు శాసనం (క్రీ.శ.9వ శతాబ్ది)

హైదరాబాదుకు 32 కి.మీ. దూరంలో నున్న కీసరగుట్టలో బయల్పడిన ‘తులచువాన్ఱు’ అన్న క్రీ.శ. 5వ శతాబ్ది నాటి చిన్న శాసనమే, తెలంగాణ తొలిశాసనంగా కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్‍గారి ద్వారా ఇటీవల విస్తృత ప్రచారానికి నోచుకొంది. ఉమ్మడి రాష్ట్ర పురావస్తుశాఖ, 1970-80లలో కీసరగుట్టలో తవ్వకాలు చేస్తున్నపుడు, ఒక బండపై ఈ చిన్న శాసనాన్ని గుర్తించారు. విష్ణుకుండికాలపు ఈ శాసనంలో, తులచు – (తొలచు, తొలిచే) వాన్ఱు – (వారు, వాళ్లు) అంటే తొలచేవాళ్లని, రాతిని తొలిచే శిల్పులు (వడ్డర్లు కూడా …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-5 పొలమెయరట్టోడి కొండపర్తి (పూర్తి) తెలుగు శాసనం (క్రీ.శ.9వ శతాబ్ది) Read More »

మరుపురాని మాదన్నపేట

ఇద్దరు మంచి మిత్రులు ఒక జంటగా క్షణం కూడా విడిపోకుండా కలిసిమెలిసి ఒకే ప్రాణంగా తిరుగుతుంటే వారిని చూసి ‘‘వీరిద్దరూ అక్కన్న మాదన్నలురా’’ అని అరవై ఏండ్ల క్రిందట హైదరాబాద్‍ పాత నగరంలోని ముసలివారు ముచ్చటపడేవారు. కుతుబ్‍షాహీల కాలంలో మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు ఏకాత్మస్వరూపులుగా, కృష్ణార్జునులుగా కలసి బ్రతికి కలిసి చనిపోయారు. మహామంత్రి మాదన్న నివసించిన ప్రాంతమే ‘‘మాదన్నపేట’’గా తర్వాత కాలంలో వర్దిల్లింది. పాతనగరం శాలిబండలో వీరు కట్టించిన అమ్మవారి దేవాలయాన్ని ప్రజలు ఇప్పటికీ అక్కన్న మాదన్నల …

మరుపురాని మాదన్నపేట Read More »